రాబోయే దీపావళి అందరి కళ్ళలో ఆనందం నింపాలని….

చీకటి పారద్రోలాలి.

అమావాస్య చీకటిని పారద్రోలాలని ఇంటింటా
దీపాలు వెలిగిస్తారు. దీపావళి
అంటేనే దివ్వెల పండుగ. రేపు
రాబోయే దీపావళి అందరి కళ్ళలో ఆనందం నింపాలని
కోరుకుంటున్నాను. ఇక కధలోకి వెళితే నా మితృడు
ఈ సారి టపాసులు కొందాం
అని నిర్ణయం తీసుకుని తన
కుమారుణ్ణి పిలిచి” చిన్నా
సాయంత్రం బజారుకు వెళ్ళి
టపాసులు కొందాం. స్కూలు
నుండి రాగానే సిద్ధంగా ఉండు”
అన్నాడు. చిన్నా సరేనని తన
స్కూలుకు వెళ్ళాడు. స్కూల్లో
దీపావళి పండుగ గురించి చర్చ
వచ్చింది. అప్పుడు టీచర్ పిల్లలతో” చూడండి పిల్లలూ,
దీపావళి పండుగ ఆనందంగా
జరుపుకోండి. అయితే పొగ
వచ్చే టపాసులు కాల్చటం
వల్ల వాయి కాలుష్యం, శబ్దం
వచ్చే టపాకాయలు కాల్చటం
వల్ల శబ్ద కాలుష్యం ఎక్కువ
అవుతుంది. పర్యావరణం
దెబ్బ తినే అవకాశం ఉంది.
అందువల్ల ఎంత వీలైతే అంత
కాలుష్యం తగ్గించే ప్రయత్నం
చేయండి. పర్యావరణాన్ని
కాపాడండి” అని అన్నారు.
ఆ మాటల ప్రభావం చిన్నా
మనసు మీద పడింది.
సాయంత్రం చిన్నా తండ్రి ఆఫీసు నుంచి వచ్చి” పద
చిన్నా,టపాసులు కొందాం”
అన్నాడు. అప్పుడు చిన్నా
“లేదు నాన్నా, నేను ఈసారి
టపాసులు కొనటం లేదు.
పర్యావరణాన్ని కాపాడే
సంకల్పం తీసుకున్నాను” అన్నాడు. అప్పుడు చిన్నా తండ్రి సంతోషించి “చిన్నా,
నీలో వచ్చిన మార్పుకు
చాలా ఆనందంగా ఉంది.
పద బజారుకు వెళ్ళి బట్టలు,
మిఠాయిలు కొనుక్కొద్దాం.
ఈ సారి మిఠాయిలు పంచి
పండగ చేసుకుందాం” అని
అన్నారు. ఇద్దరూ ఆనందంగా
బజారుకు వెళ్ళారు. వారి
మాటలు విని ప్రకృతి పరవసించింది.

ఈ రచన నా స్వీయ రచన
అని హామీ ఇస్తున్నాను.

వెంకట భానుప్రసాద్ చలసాని.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *