రాము

రాము ఎందుకు అలా చేసావు నేనేం చేశాను మాస్టారు అన్నాడు అమాయకంగా రాము గోపాలం మాస్టారుతో. అలా గోపి ని కొట్టవచ్చునా నేను చూడలేదని అని అనుకుంటున్నావా? అని మళ్ళి వాడికి కనిపించదు అనే కదా వాడిని అలా కొట్టి వచ్చావు. వాడు నిన్నేమి అనలేదు అనే కదా అలా చేసావ్ వాడు లేచి తిరిగి కొట్టగలిగితే నీ విలువ ఏముంటుంది  అని మందలించాడు గోపాలం మాస్టారు రాముని అబ్బా వదిలేయండి మాస్టారు

వాడు చూడలేదు కదా నేనేనని వాడికి ఎలా తెలుస్తుంది.? మీరు ఎలాగు చెప్పరు అని తేలికగా అన్నాడు రాము. ఓ నీకు కళ్ళులేని వాళ్ళంటే చులకనగా అనిపిస్తుందా? ఒకరోజు గుడ్డివాడిగా ఉండి చూడు వాళ్ళ కష్టం ఏంటో, వాళ్ళు పడే పాట్లు ఏమిటో, నీలాంటి వాళ్ళు గుడ్డివాళ్ళని ఎలా గేలి చేస్తారో నీకర్ధమవుతుంది  అని అన్నాడు గోపాలం మాస్టారు రాముతో.

హ అదేo పెద్ద గొప్ప విద్య నా మాస్టారు. నాకెలాగు అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసు. కాబట్టి నేను చాల సులువుగా తిరగగలను అని అన్నాడు పొగరుగా. ఓ అలాగా  నీకు అది అంత తేలికగా అనిపిస్తుందా? సరే అయితే రేపటి నుంచి ఒక రెండు రోజులు గుడ్డి వాడిగా ఉండు, పందేమా అని అన్నాడు గోపాలం మాస్టారు కవ్విస్తున్నటుగా ఓ పందెం పందెం అని అన్నాడు రాము.

సరే అయితే రేపు తయారయ్యి ఉండు అన్నడు గోపాలం. అలాగే మాస్టారు అని రాము అన్నాడు. సరిగ్గా అప్పుడే బెల్ మోగింది అందరూ స్కూల్ వదిలి వెళ్ళిపోయారు.ఒక రెండు రోజులు రాము గుడ్డివాడిగా ఉండగలడా? తను చేసి తప్పుని తెలుసుకోగాలడా? చూద్దాం రండి……  

తెల్లారిన తర్వాత రాము ఇంటి నుండి బయటకు రాక ముందే గోపాలం అతని ఇంటికి వెళ్ళి వారి తల్లిదండ్రులతో ,బడి లో ఒక నాటకం ఉందని దాని కోసం రాము గుడ్డి వాడి  వేషం వెయ్యాడానికి,ఈ రోజు ప్రాక్టిస్ చెయ్యడానికి అతని కళ్ళని ఒక బట్ట తో కట్టి వెయ్యాలని అన్నాడు.దానికి వాళ్ళు ఒప్పుకుని సరే అన్నారు ఇక అప్పటి నుండి రాము కూ ఒక గుడ్డని కట్టి బయటకు తీసుకుని వచ్చి తల్లిదండ్రులు కనుమరుగు అయ్యేవరకు చూసి,వాళ్ళు కనుమరుగు అవ్వగానే రాముని వదిలేసి కొంచం దూరం లో నడవసాగాడు

గోపాలం అతన్ని చూస్తూ గమనిస్తూ అప్పటి వరకు మాస్టారి చెయ్యి పట్టుకుని నడిచిన రాము ,ఆ తర్వాత మాస్టారు వదిలెయ్యడం తో అతని కళ్ళు గుడ్డతో కట్టేసి  ఉండడం వల్ల కాళ్ళు చీకటిగా ఉన్నాయి మాస్టారు మాస్టారు మీరు ఎక్కడ ఉన్నారు అని అంటూ చేతి తో వెతుకుతూ వెతుకుతూ వెళ్ళి ఒక వ్యక్తిని గుద్దుకున్నాడు అతను ఏమి చేసినా గోపాలం ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు రాము తను తగిలిన వ్యక్తిని తాను బడికి వెళ్ళాలి అని ఎటు వైపుగా వెళ్తే బడి వస్తుందని అడిగాడు.దానికి ఆ వ్యక్తి రాము ని అటూ ఇటుగా చేతులతో నెట్టి వేస్తూ గుడ్డి వెధవ అలా ముందుకు వెళ్ళి పక్కకి జరుగు అని అన్నాడు.ఆ వ్యక్తి చెప్పిన వైపు గా వెళ్ళడం తో రాముకి ముళ్ళు చెట్లు తగిలి చేతులకూ కళ్ళకు ముళ్ళు గుచుకుంటూ ఉన్నాయి.

అయితే మధ్యలో ఎవరో మాట్లాడించడం వల్ల గోపాలం మాస్టారు రాముని మర్చి పోయి,అతనితో మాట్లాడుతూ కూర్చున్నాడు.దాంతో రాము కట్టు విప్పకుండా అది అలాగే ఉండడం తో చెట్లు,ముళ్ళు గుచ్చి,రక్తం రావడం తో పాటు మండుతూ ఉండడం తో ,మాస్టారు ,మాస్టారు అని పిలుస్తూ,నేక్కరుకు అంటిన ముళ్ళని లాగుతూ ,చివరికి ఎలాగో కళ్ళకు ఉన్న కట్టుని తీసేసి,చూసాడు ,

కట్లు విప్పిన తర్వాత చాలా సేపటి వరకు తన ముందు ఏమి ఉన్నాయో కనిపించలేదు. రాము కాసేపు అయ్యిన తర్వాత కళ్ళు నులుముకుని చూసే సరికి తమ ఊరి చెరువుకి దగ్గరలో ఉన్నాడు.అమ్మో చెరువు అని భయపడి తన బట్టల వైపు చూసుకున్నాడు,బట్టలు అన్ని ముళ్ళు గుచ్చి ఉన్నాయి.అది చూసి గుడ్డివాడిగా ఉండడం అంటే ఇంత కష్టమా అని అనుక్లుని మరి గోపాలం మాష్టారు ఎక్కడ అని చుట్టూ చూసాడు

రాము కనిపించక పోవడం తో గోపాలం మాస్టారు రాము ని వెతుకుతూ వచ్చారు.రాముని దూరంగా  చూసి రాము మాష్టారు ఇక్కడ ఇక్కడ అని పిలిచేసరికి గోపాలం వెళ్ళి రాముని చూసి అయ్యో రాము ఏమయింది అని అడిగాడు.మాష్టారు అని జరిగింది మొత్తం వివరంగా చెప్పాడు.

రాముని తీసుకుని బడికి వెళ్ళాడు గోపాలం మాస్టారు అక్కడ అతని గాయాలకు మందు రాసి,ముళ్ళు తిసేసాడు.ఆ తర్వాత రాము వెళ్ళి గోపి ని తీసుకుని వచ్చి,మాస్టారు నేను తప్పు చేశాను,గోపికి తెలియదు అని గుడ్డివాడు అని అతనికి కనిపించదు అని హేళన చేశాను ఆట పట్టించాను.కానీ నాకు ఇప్పుడు అర్ధం అయ్యింది గుడ్డి వాడిగా ఉండడం అంటే ఎంత నరకమో అలంటి వాళ్ళ ని హేళన ఎగతాళి చేస్తే మనకి కూడా అలానే జరుగుతుంది అని తెలిసింది ఒక పూట కూడా నేను గుడ్డి వాడిలా ఉండలేకపోయాను అని అన్నాడు మాష్టారు తో..

దానికి గోపాలం రాము మారడం చూసి చూడు రాము నీకు గుడ్డి వాళ్ళ కష్టం తెలియాలనే పందెం వేసాను నువ్వు వారిని చులకనగా చూడకుండా నువ్వు మారితే చాలు అని అనుకున్నాఅంతే నువ్వు మారిపోయావు నాకు అది చాలు ఇక ఇప్పటి నుండి నువ్వు గోపి ఇద్దరు మంచి స్నేహితుల్లా ఉండండి అని చెప్పారు గోపాలం మాష్టారు.తనని మార్చిన మాస్టరుకు వంగి పాదాభివందనం చేసారు పిల్లలు ఇద్దరు … 

 ***(అంగవైకల్యం కల వారిని హేళన చెయ్యకండి అనే నీతి గల పిల్లల కథ)***

                                                                                                ………………………ప్రణవ్

Related Posts