రారాజు…నాన్నే మా రారాజు, అమ్మే మహారాణి

ఈ నాటి అంశం
రారాజు

శీర్షిక
నాన్నే మా రారాజు, అమ్మే మహారాణి

జీవితమే ఒక చదరంగం.
మీ జీవితానికి మీరే రాజు.
మీ యొక్క నిర్ణయాలు మీరే తీసుకోవాలి. మీ కుటుంబ
బాధ్యత మీరే నెరవేర్చుకుని
ముందడుగు వేయాలి. మీ
మిత్రబలం, బంధుగణమే మీకు
సైన్యం. ఎంతమంది హితులు
ఉంటే మీరు అంత గొప్పగా
ఎదగగలరు. ఈ సమాజంలో
ఎవరికి వారే తమ అభివృద్ధికి
బాటలు వేసుకుంటుంటారు.
ఒకరిపై ఒకరు ఎత్తులు-పై ఎత్తులు వేస్తుంటారు. ఒకోసారి
ఓడిపోయినా మళ్ళీ ప్రయత్నం చేసి నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు పరచటం వల్ల
అభివృద్ధిని సాధించగలరు.
కుటుంబాన్ని సమర్ధవంతంగా
నడిపే ప్రతి ఒక్కరూ కూడా ఒక రారాజే. వారి విజయం వారి
కుటుంబానికి కూడా విజయమే
సాధించిపెడుతుంది. నాకు నా
నాన్నే రారాజు. నా అమ్మే రాణి.
మా నాన్న తన కుటుంబం కోసం అహర్నిశలు కష్టపడి
పనిచేసారు. మా అమ్మ తన
కుటుంబం కోసం పోరాటమే
చేసింది. ఆమె ఆ పోరాటం
తన ఆఖరి శ్వాస వరకు చేస్తూనే ఉంది. వారు చేసిన
మంచి పనులు మమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. నా కుటుంబమే కాదు ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులే
రాజు-రాణి. వారి చల్లని
దీవెనలే ఆ కుటుంబాలకు
శ్రీరామరక్ష.

ఈ రచన నా స్వీయ రచన
అని హామీ ఇస్తున్నాను.

వెంకట భానుప్రసాద్ చలసాని

Previous post గొడవ మొదలైంది…
Next post ఒకే మాట మీద జీవితాంతం బ్రతకాలి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close