రాశి

రవిచందన కూ ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి రాశి మధ్యతరగతి కుటుంబం వరుణ్, వర్షిత్ లు ఇద్దరు బి.టెక్ చేసి క్యాంపస్ లో ఉద్యోగాలు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వెంటనే పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు. వేరు కాపురాలు కూడా పెట్టడం అయిపోయింది. మధ్యతరగతి వాళ్ళకు బాగా గో ఉండడం వల్ల ఒకరికి ఒకరు పడక పోవడం నేను సంపాదిస్తున్న అనే పొగరు ఉండడం నాకేం తక్కువ అనే అహంకారంతో తమ తండ్రి నుండి విడిపోవడం పెద్ద కష్టం కాలేదు….

అయితే రవి కూడా పిల్లలకు బాధ్యత తెలిసి రావాలి అనే ఆలోచన చేయడం వల్ల వారిని ఏమి అనలేక పోయాడు. కానీ, ఇదంతా చూస్తున్న రాశికి తన తండ్రి ఎంత మధన పడుతున్నాడో అర్ధం అయ్యింది. అప్పుడే రాశి మనసులో స్థిరమైన అభిప్రాయం ఏర్పరచుకుంది తల్లిదండ్రులు చుట్టు పక్కన ఉన్నవాళ్ళని చూస్తుంటే పిల్లల్లో ఎంత మార్పుని తిసుకోస్తాయో అవి వారి మనసుని ఎంతగా ప్రభావితం చేస్తాయో అర్ధం అవుతుంది రాశిని చుస్తే....

రాశి తన తండ్రి అన్నయ్యల వల్ల బాధ పడడం చూసి తన తండ్రికి ఎదురు చెప్పకూడదు అని అనుకుంది. కానీ, అది ఆమె జీవితాన్ని ఎంతగా మార్చేస్తుందో అప్పుడు తెలియదు. అప్పుడు రాశి ఎనిమిదో తరగతి చదువుతున్నది అలా అన్నయ్యలు వెళ్ళిపోయాక తల్లిదండ్రులతో పాటు రాశి కూడా ఉండసాగింది. తండ్రి ఏది తెచ్చినా చాలా బాగుంది నాన్న అని అంటూ ఎంతో అపురూపంగా దాచుకునేది తన తండ్రి మాటలు విని ఏంటో గొప్పగా ఫెల్ అయ్యేవాడు.

అలా ఆమె ఏమి చదవాలో ఏ గ్రూప్ తీసుకోవాలో ఏ బట్టలు వేసుకోవాలో కూడా తన తండ్రికి నచ్చినట్టుగానే మసులుకునేది రాశి. ఆ విషయాన్నీ భార్యతో చెప్తూ రవి సంతోషపడి అది నా కూతురే, నా పరువు నిలబెడుతుంది అని మీసం మేలేసేవాడు. అలా రాశి ఇంటర్ నుండి డిగ్రీకి వచ్చింది అక్కడ కూడా తండ్రి ఇష్టప్రకారమే అమ్మాయిలు అంటే హోమ్ సైన్సునె చదవాలి అనే కోరిక ప్రకారం అదే గ్రూప్ లో జాయిన్ అయ్యింది.

అయితే డిగ్రీ లో చేరిన తర్వాత నుండి రాశి మిగత వారిని చూసి తనని చూసుకుని వాళ్ళతో పోల్చుకుని ఆత్మనున్యతకు గురి కాసాగింది. అయినా ఒక పక్కన వారిల మేడారాన్ బట్టలు వేసుకోవాలని వారిలా బాయ్ ఫ్రెండ్ తో తిరగాలని ఉన్నా తన తండ్రిని బాధ పెట్టడం ఇష్టం లేక ఆమె అలానే ఉండసాగిందిఅయితే రాశి కట్టు బొట్టు నచ్చిన వినీత్ ఆమెని ప్రేమించడం మొదలు పెట్టాడు.

డిగ్రీ రెండో సంవత్సరంలో ఆమెకి తన ప్రేమ విషయం కూడా చెప్పాడు కానీ రాశి మాత్రం తనకు ప్రేమ అంటే ఇష్టం లేదని తన తండ్రి దగ్గరికి వచ్చి మాట్లాడమని అంది. కానీ వినీత్ కి అది సమoజసమే అనిపించినా ఇంకా ఉద్యోగం సద్యోగం లేకుండా వెళ్ళి మాట్లాడితే తనని పురుగులా చూస్తాడు అని అనుకుని అదే మాటని రాశితో చెప్పి చదువు అయ్యేవరకు తనని వేచి ఉండమని ప్రార్ధించాడు. దానికి రాశి నా చేతిలో ఏమి లేదు అంతా మా నాన్నగారి ఇష్టం అని చెప్పింది. వినీత్ నేను అంటే నీకు ఇష్టం లేదా ప్రేమించవా అని అడిగాడు నువ్వు అంటే ఇష్టమే కానీ మా నాన్న అంటే నాకు ప్రాణం అని చెప్పి, మా నాన్న ఎవరిని చేసుకోమంటే నేను వారినే చేసుకుంటా అంతే తప్ప మా నాన్నకు ఇష్టం లేనిదీ నేను పని చేయను అని చెప్పింది. ఇక ఆమెతో మాట్లాడి ప్రయోజనం లేదని ఉద్యోగం కోసం ప్రయత్నించ సాగాడు వినీత్.

డిగ్రీ మూడో సంవత్సరం మొదలైన మూడు నెలలకు ఒక మంచి సంబంధం వచ్చింది అని రాశికి చెప్పి పెళ్లి చూపులు ఆరెంజి చేసారు ఆ విషయం వినీత్ కి తెలిసి పరుగున రాశి దగ్గరికి వెళ్ళి నేను విన్నది నిజమేనా నీకు పెళ్లి చూపులా అని అడిగాడు అవును అని చెప్పింది రాశి ఈ పెళ్లి చూపులని ఒక్క ఆరు నెలలు అపు ఎలాగైనా నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని అన్నాడు వినీత్ లేదు వినీత్ నేను మా నాన్న చెప్పినా  వాడినే పెళ్లి చేసుకుంటా అంది మొండిగా రాశి అయ్యో రాశి నీకు ఎలా చెప్తే అర్ధం అవుతుంది.

నువ్వు మీ నాన్న కష్టపడోద్దు అని ఇలా నీ జీవితాన్ని నాశనo చేసుకుంటున్నావు కానీ అదెంత తప్పో నీకు ఇప్పుడు కాదు తర్వాత అర్ధం అవుతుంది ఒక్క ఆరు నెలలు నీ డిగ్రీ అయ్యక చేసుకుంటా అని మీ నాన్నతో చెప్పు అంతే నేను అడిగేది నేను తర్వాత వచ్చి మీ నాన్నగారితో మాట్లాడతా నువ్వు ఒక్క పని చెయ్యి అని అన్నాడు వినీత్. లేదు నేను మా నాన్నకు ఎదురు చెప్పలేను అని అంది. విసిగిన వినీత్ అయితే పో పోయి అనుభవించు అని కోపడ్డాడు రాశి కి ఏడుపు వచ్చి అక్కడి నుండి వెళ్లిపోయింది.

తెల్లారి పెళ్లి వాళ్ళు రావడం చూడడం వాళ్ళు వాళ్ళు చెప్పిన కట్నం రవికి నచ్చడంతో రాశికి చెప్పే అవకాశం లేకుండా అంత నిర్ణయం అయిపోయింది. పెళ్ళిలో పెళ్లి కూతురిగా కూర్చున్న రాశిని చూసి గట్టిగా నిట్టూర్చి వెళ్ళిపోయాడు వినీత్ అది చుసిన రాశిలో అంతర్మధనం మొదలయ్యింది.

అయినా బయట పడలేదు పైగా అప్పగింతలప్పుడు తండ్రి కూతురికి నువ్వు నాకు ఎలా అయితే ఎదురు చెప్పకుండా ఉన్నావో నీ భర్తతో కూడా అలాగే ఉండాలి ఉంటాను అని నా మిధ ఒట్టేయ్యు అని అన్నప్పుడు అనాలోచితంగానే ఆమె చెయ్యి వేశింది. అలా రాశి కొత్త జీవితం మొదలయ్యి బాగా సాగింది పెద్దగా గొడవలు అవి ఏమి లేకుండా భర్తకు విషయం లోనూ ఎదురు చెప్పకుండా ఉన్న రాశికి కొన్ని రోజులు అయ్యాక తానూ ఏమి కోల్పోయిందో అది గుర్తుకు రాసాగింది.

అయినా రాశికి కూతురు పుట్టింది తర్వాత పిల్లలు కాలేదు ఎందుకో కొన్నేళ్ళకూ రాశి కూతురు అపరాజిత డిగ్రీలో ఉన్నాప్పుడు ఒక అబ్బాయి తో ప్రేమలో పడిందని తెలిసి రాశి భర్త నందన్ కి తెలిసి కూతుర్ని కట్టడిలో పెట్టాడు. కానీ, రాశికి తన డిగ్రిలో జరిగిన వినీత్ విషయం గుర్తుకు వచ్చింది. తను ఏమి కోల్పాయిందో తన కూతుర్ని చూసి తెలుసుకున్న రాశి ఆమె ప్రేమించిన వ్యక్తి తోనే ఆమె పెళ్లిని జరిపించాలని అనుకుంది.

కానీ భర్త కూతురి ప్రేమని అంగీకరించక అపరాజితను ఒక గదిలో పెట్టి ప్రేమ, దోమా అని అన్నావో నిన్ను చంపి నేను చస్తాను అని బెదిరించాడు దానికి రాశి చంపండి ఏంటి ఎదో బాగా మాట్లాడుతున్నారు. కన్న కూతుర్ని ఎలా చంపుతారు అని ఎదిరించిగది తాళo తీసి కూతుర్ని వెళ్ళమ్మ అని చెప్పింది. రాశిని ఆశ్చర్యంగా చూసాడు నందన్. అన్నేళ్ళు, అన్నళ్ళుగా తనకు ఎదురు చెప్పని తన భార్య ఇప్పుడు ఒక్కసారిగా మాటలు వచ్చిన చిలకలాగ మాట్లాడడం అది కూడా తనకు ఎదురు చెప్పి మాట్లాడడం చుసిన నందన్ ఆశ్చర్య పోయి అలా చూస్తూ ఉండగానే అపరాజిత వెళ్లిపోయింది.

ఆమె వెళ్ళిన తర్వాత రాశి నందన్ దగ్గరగా వచ్చి ఒక్కగానొక్క కూతురు అండి ఆమెని స్వేచ్చగా ఉండనివ్వండి ఆమెకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకునే స్వేచ్చని ఆమెకు ఇవ్వండి ఆమె ఎలా ఉండాలి అని అనుకుంటుందో అలాగే ఉండనివ్వండి ఆమెకు తగిన స్వేచ్ఛని ఇద్దామండి. ఆమె ఇప్పుడు ప్రేమించిన వాడిని చేసుకోకుండా మన మాట విని మనం చూసిన వాణ్ణి చేసుకుంటే నాలాగే జీవితాంతం ఎదో కోల్పోయినట్టుగా బతకాల్సి వస్తుంది నాలాగా నా కూతురు కాకూడదు అలా అని మీరు నాకేమి తక్కువ చేయలేదు నేను మిమల్ని ప్రేమించలేదు అని చెప్పడం లేదు. కానీ, మీరంటే నాకు భయం, భక్తి రెండు ఉన్నాయి నేను మా నాన్న చూసిన వాడిని చేసుకున్నా ఎక్కడో ఎదో మూల లో నన్ను ప్రేమించిన వాడిని చేసుకోలేక పోయాను అనే ఒక గిల్టీ ఫీలింగ్ అనుభవించసాగాను……

దాంతో మీతో కూడా మనస్పూర్తిగా మాట్లాడలేక పోయాను. మిరంటే నాకు భయమే కానీ ప్రేమ మాత్రం కలగలేదు ఇప్పుడు నేను మీకు ఇలా చెప్పే పరిస్థితిని నాకు నేనుగా కలిగించుకున్నా…. కానీ, ఇదే పరిస్థితి నా కూతురికి రాకూడదనే మిమల్ని ఎదిరించాను. నన్ను క్షమించoడి అని రెండూ చేతులూ జోడించి నమస్కరిస్తున్న రాశిని చూసి ఇన్నేళ్ళుగా తను పడిన మానసిక క్షోభ గుర్తించిన నందన్ రాశిని ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు……

 

      శ్రావణ్

Related Posts