పూసిన పచ్చిపూల పరిమళాలు
మనస్సుకు గుచ్చుకొన్న శరవేగాలు…
ఏకాంతం రాసుకొన్న వెన్నెల్లో అక్షరాలు
మరువని జ్ఞాపకాల పందిరి కింద సిగ్గులై..!!
తలుచుకొన్న ప్రతిరేయి తెగిపోలేనిదే…
ఆ మోహపు తపనల తత్త్వం విడిపోలేనిదే…
కోరికల స్పర్శలు కోమలమైనవే
దానికై ప్రయత్నాలు పురితిరిగినవే…
దాహం తీరని దేహపు కదలికలతో..!!
అల్లిన క్షణాలతో రెండు హృదయాలు
ఒక్కటై పాడుకొనే యుగళ గీతాలు…
వెదకని తీరాలలో రెక్కలిప్పిన విహారాలు
చీకటి కప్పలేదు వెలుగు చూపలేదు
మది పొంగులతో నిరంతర మధునాలే..!!
తగిలిపోతున్న చిరుగాలులు చుంబనాలే
కంటి విరుపులతో ఒంటి తేనియలను
తాగుతు తాకిన ప్రతిచోట అదో లోకమే…
మూయని కంటిపై మాయని పచ్చబొడుపే…
కట్టుకొన్న వారధిపై ఆపలేని ప్రయాణమే…
కవ్వింపులతో కాలం కరిగిపోయినా
కావలసినది ఏదో తెలుసుకోలేని తాపం..!!
దేహాలు రెండైన పాడుకొనే రాగమొక్కటే
కుదించబడని క్షణాలతో అది ఆస్వాధింపే…
ఆవేదనలకు చిక్కని ఆనందమయమే…
చిలికిన సమయాలు అమృతమయమే…
ప్రేమలతో జయించినది నిలిచిన శాశ్వతమే…
దేరంగుల భైరవ (కర్నూలు)
9100688396