రైతుల ఆక్రందన
కన్నీరు పెడుతున్నారు
అసువులు విడుస్తున్నారు
ధరణి తల్లి కంట కన్నీరు చిందిస్తున్నారు
నేలమ్మ నేలమ్మ
నీకు విల్లా లు ఎలమ్మ
డబ్బులున్న బాబులు
భూములు తక్కువకి కొన్న రోజులు
రైతులు ఆక్రతలు వినలేని రోజులు
వారు ఉచ్చ పోస్తే దివ్య అయ్యి వెలిగింది
రైతులు కన్నీరు మాత్రం చిందిస్తూ వినిపిస్తూనే ఉన్నారు
కాశీలోని అన్నపూర్ణ సైతం
మా రైతులను విడిచింది కాబోలు
పంటకి తగ్గ గిట్టుబాటు ధర లేక రోదన
ఇట్టి స్థితిలో భూముల అమ్మిన గిట్టుబాటు ధర లేక వేదన
రైతుల రక్తం
ఎర్ర సూర్యుని నొసటి తిలకం
24 గంటలు కన్నీరు పెడుతున్నా ప్రతీకం
వారి రక్తం ఎర్ర సముద్రంలో కలిసిపోయిన ద్రావణం అయిపోయింది
దాన్ని భూ దందా వారు
బీర్లలో మరియు వైనులలో కలుపుకొని ప్రశాంతంగా ఆరగిస్తూ తాగుతున్నారు
వారి జేబులో పూర్తిగా డబ్బు నిండినది
వారి బ్రీఫ్ కేసులో డబ్బు నిండినది
మరి బీరువాలు లో డబ్బులు నిండినవి
పేదవాడి జీవితం మాత్రం అట్లానే ఉండినది
రైతు కడుపున అన్నానికి సున్నం కొట్టి బ్రతికేస్తున్నారు
ఏమిటి ఘోరం
ఏమిటి ఆక్రందనం
ఏమిటి ఈ నైజం
ఏమిటి ఈ అకుంఠిత వైపరీత్యం
న్యాయం జరగదా ఈ స్థితి
అన్యాయం తొలగిపోదా రాబోవు స్థితి.
యడ్ల శ్రీనివాసరావు