రైలెక్కి చూడవోయ్ మొనగా,,,,!!

రైలెక్కి చూడవోయ్ మొనగా,,,,!!

రైలెక్కి చూడవోయ్ మొనగా,,,,!!

కారుచీకట్లు కమ్ముకొస్తున్న వేళ
చుక్ చుక్ మంటూ రైలుబండి వెళుతున్నదీ
పంటచేల గుండా మైదానాల గుండా
అడవుల గుండా నదులపై బ్రిడ్జీల పైనుండీ
కొండల సొరంగాల గుండా సుడిగాలిలా
కూతమీద కూతలేసుకుంటూ
దూసుకెళ్తోంది అదిగదిగో రైలుబండి……..

హై క్లాస్ పెద్దమనుషుల నుండి
మధ్యతరగతి, నిరుపేదలు, అభాగ్యులు
చౌక నుండి అత్యంత రేటు వరకు టిక్కెట్ చార్జీలు
నిరుపేదలను కదిలిస్తే ఒక్కొక్కరిదీ ఒక్కోగోస…….
మధ్యతరగతి జనాన్ని కదిలిస్తే కన్నీటి చరిత్ర……..
గొప్పగొప్ప పెద్దవాళ్ళ గుండెలు
డమడమ కొట్టుకుంటూ పరిగెత్తే పట్టాలపై రైలుబండి…….
వేళ్ళమీద లెక్కబెట్టేంత మందే ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారు,,,,,,,,
రైలు నిండా లొడలొడ వాగుళ్ళ ఒంటరిగాళ్ళు

రైలుబండి కష్టపడి చమటోడ్చి పట్టాలు వేసిన కార్మికులు
రైలు ఇంజిన్లు, రైలు డబ్బాలు తయారీ కార్మికుల చమటే,,,,,
రైలుబండి పరుగులకు
వేల మంది కార్మికుల నిరంతర శ్రమ
అందుకే రైలుది ఒంటరి బ్రతుకే
కష్టాల మోతలో,,,,, సుఖదుఃఖాల ప్రయాణికులు
మనిషి కోసం మనిషి తయారు చేసిన మానవతా యంత్రం,,,,!!

అపరాజిత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *