లలిత

నీకు ఏమైనా బుద్ధి ఉందా,నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు,ఎం చేస్తున్నావు,ఏం అవ్వాలని అనుకున్నావు,అన్ని మర్చిపోయి,ఇప్పుడు  ఇలా చేయడం నీకు ఏమైనా బాగానిపిస్తుందా, చెప్పు ,ఇప్పుడు నీ సమాధానం ఏంటో అంది ఆశ,

అబ్బా ఏంటి నీ గోల ఇప్పుడు నేనేం చేసాను,నాకు నచ్చింది నేను చేస్తా అయితే తప్పేంటి చెప్పు అంది లలిత.ఏంటే నువ్వు ఊరి నుండి ఎదో పొడుస్తా,ఎదో చేస్తా అని ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఎవడో నాలుగు మంచి మాటలుమాట్లాడగానే నువ్వు ఇలా మరిపోతావు అని అసలు అనుకోలేదు అంది ఆశ.

చూడు ఆశ  నేనేం చేయాలో నాకు బాగాతెలుసు,నువ్వు ఏమి  నాకు చెప్పాల్సిన అవసరం లేదు.నేనేం చిన్న పిల్లని కాదు ,ఇది నా జీవితం నా ఇష్టం, ఇంకో మాట చెప్తున్నా విను ఊరికి ఎదో చేద్దాం అని అనుకున్నా,నిజమే కానీ ఇక్కడ నా  జీవితం, ఊరి కోసం ఎవరో ఒకరు వస్తారు,

ఏమైనా చేస్తారు.కానీ నాకు ఉన్నది ఒకటే జీవితం, ఒకే ఛాన్స్ కాబట్టి నన్ను వదిలేయి,నువ్వు నా గురించి ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. చివరికి నా తల్లిదండ్రులకు కూడా చెప్పకు,వాళ్ళు అడిగితే నీకు తెలియదు అని చెప్పు ఎందుకంటే నా హస్టల్ నీ హాస్టల్ వేరు కాబట్టి నిన్ను ఎవరూ అనుమానించరు.

సరేనా ఇక నేను వెళ్తున్నా అని గట్టిగా ఆశ తో చెప్పి ,తన బాగ్ తీసుకుని బయటకు వెళ్తున్న లలితని చూస్తూ తన జీవితం తన ఇష్టం అని అంత ధీమాగా చెప్తూ,నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంట అని అంటున్న స్నేహితురాలి మాటలకు నివ్వెర పోయి,

తన జీవితం,తన ఇష్టం అని అంటున్న నాకేంటి నొప్పి అయినా ఒకప్పటి తన లల్లి కాదు ఇది,చాలా మారిపోయింది అని అనుకుంటూ తన చిన్ననాటి స్నేహితురాలు ఎలా ఉండేదో గుర్తు చేసుకుంది ఆశ.

ఆశ,లలిత లు ఒక కుగ్రామం లో జీవించే వారు,వారి తల్లిదండ్రులు చేపలు పట్టి జీవనం సాగిoచే వారు.కానీ చేపలు పట్టడానికి వెళ్లే సమయంలో వారు చాలా ప్రమాదాలకు గురయ్యే వారు.అది చూసి ఆశ,లలిత లు ఊరి కోసం ఏదైనా చేయాలి అంటే బాగా చదువుకోవడం ఒక్కటే మార్గం అని,

చదువు కుంటే పెద్ద పెద్ద పదవులు వస్తాయని అనుకుని, తన వారి కోసం ఎంత కష్టం అయినా భరించి,వారికి మంచి సౌకర్యాలు కలిగించాలనే కోరిక ఎప్పుడూ వెల్లడించేది లలిత.అదే ఆశయం గా ఉండేది తన లలిత కు  తల్లిదండ్రులను ఒప్పించి మరి పట్నం లోని హాస్టల్ లో జాయిన్ అయ్యారు.

పది వరకు బాగానే చదువుకున్న  లలిత తర్వాత నుండి అంటే కాలేజీ లో జాయిన్ అయిన మూడు నెలల్లో రాజేష్ తో పరిచయం,అతణ్ణి బాగా నమ్మడం,ప్రేమలో పడడం అతనితో పెళ్లి గురించి కలలు కనడం తో పాటు ఆశ తో సరిగ్గా మాట్లాడక పోవడం ,చదవక పోవడం అన్ని జరిగాయి.

ఇదేంటని అడిగిన ఆశకు ఏవేవో చెప్పి తప్పించుకుంది లలిత,కానీ రాను రాను లలిత ఇంటికి కూడా రాకుండా రా జేష్ తోనే అతని రూమ్ లో ఉండడం,హద్దులు దాటడం జరిగే సరికి ఆశ లలితను నిలదీసింది. దాని ఫలితమే లలిత హాస్టల్ రూమ్ నుండి వెళ్లి పోవడం,నా జీవితం నా ఇష్టం అని చెప్పడంతో

ఆశ ఏమి మాట్లాడక ఊరుకుంది.తిరిగి ఊరెళ్లినప్పుడు ఆశ లలిత తల్లిదండ్రుల తో విషయం మొత్తం చెప్పింది అది తన కనీస బాధ్యత కాబట్టీ, లలిత చెప్పిన విషయం విని తల్లిదండ్రులు తమ కూతుర్ని బాగా తిట్టుకున్నారు,అలా చేసినందుకు  తమకు కూతురే లేదని, విషయం ఎవరికి చెప్పొద్దని ఆశను కోరారు వాళ్ళు, కూతురు చేసిన పని ఊరంతా తెలిస్తే తమ పరువు పోతుందని ఆమె భావించి, సరే అని అక్కడి నుండి వెళ్ళిపోయింది.

ఆశ ఇంటర్ అవ్వగానే,డిస్టన్స్ లో డిగ్రీ కి కట్టుకుని, బ్యాంక్ పరీక్షల కోసం కోచింగ్ కూడా తీసుకోసాగింది. అలా కష్టపడి చదువుతూ,కాలాన్ని వెనక్కి నెడుతూ అయిదేళ్ళు కాల గర్భం లో కలిసిపోయాయి.

అయిదేళ్ళ లో లలిత కు టైఫాయిడ్ జ్వరం వచ్చి హాస్పిటల్ లొనే చనిపోయింది అని  ఊరి వారిని అందరితో చెప్పారు నమ్మించారు.ఆశ  బాగా కష్ట పడి చదివి కలెక్టర్ గా తన స్వంత ఊరి కె వచ్చింది.ఆమెని చూసి లలిత తల్లిదండ్రులు తమ కూతురే ఇలా వచ్చిందని మురిసి పోయారు. ఆశ కూడా ఊరికి రాగానే లలిత తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి,ఆశర్వాదం తీసుకుంది.

తమ ఊరి అమ్మాయి తన ఊరికే కలెక్టర్ గా రావడం గ్రామంలో ఆనందం వెల్లి విరిసింది, సంతోషం లో ఆమెకు సన్మాన సభను ఏర్పాటు చేశారు. సభకు ముఖ్యంగా లలిత తల్లిదండ్రులను పిలిచింది.అందరూ వచ్చాక సభ మొదలైన తర్వాత ఆశ గురించి చాల గొప్పగా మాట్లాడారు అంతా,

ఇక ఆశ మాట్లాడుతూ తన చదువుకు,తాను ఇదంతా సాధించడానికి  తనకు స్ఫూర్తి ప్రధాతలు లలిత తల్లిదండ్రులు అని బాగోద్వేగంగా చెప్పి,కళ్ళు తుడుచుకుంది. ఆమె కలెక్టర్ అయిన సందర్భంగా పేదలకు చీరలు పంపిణీ చేశారు కొందరు అవి అందరికి పంచుతున్న ఆశ కు దూరంగా వస్తున్న లలిత కనిపించింది.

ఆమెని చూడగానే ఆశ  గబగబా వెళ్లి  లలిత ఏంటి ఇలా అయిపోయావు,ఇక్కడికి ఎలా వచ్చావు,ఇన్నాళ్లు ఏమై పోయావు అని అంటూ అడిగింది ఆవేదనగా,ష్  గట్టిగా మాట్లాడక నేను చనిపోయిన అని నా తల్లిదండ్రులు హాయిగా ఉన్నారు, ఇప్పుడు నువ్వు నన్ను చూపించి వారి పరువు తీయకు అని అంది లలిత,మరి నీతో మాట్లాడ్డం ఎలా అంది ఆశ ,పోనీ నా గది లో  కూర్చో వేళ్ళు అని ఒక పోలీసు అధికారి ని పిలిచి,లలితని చూపించి నాకు కేటాయించిన గదిలో కూర్చో బెట్టండి అని చెప్పిన ఆశ తిరిగి  దుస్తులు పంచడం లో మునిగి పోయింది. 

ఇన్ని రోజులకు వచ్చిన స్నేహితురాలు తో మనసారా మాట్లాడలనే  ఆశ తొందరగానే బట్టలు అందరికి పంచి వచ్చింది ఆశ,ఏంటీ లలిత ఇన్నాళ్లకు మమ్మల్ని చూడాలని వచ్చావా, ఇన్ని రోజులు అసలు ఏమైపోయావు,ఎక్కడ ఉన్నావు ఏం చేస్తున్నావు

అతను నిన్ను పెళ్ళి చేసుకున్నాడా,లేదా అసలు ఇలా రావాల్సిన అవసరం ఏముంది ఇంత దొంగతనం గా  ఎవరికి ఆఖరికి మీ అమ్మగారికి కూడా తెలియనివ్వద్దు అనడం ఏంటి ?  పరువు పోవడం ఏంటి ? అంటూ ఆత్రంగా ప్రశ్నించింది ఆశ లలితను ,అబ్బా అబ్బా నీ మాటలు నీ ప్రశ్నలే నా కాస్త నా గురించి ఆలోచించేది,నేను చెప్పేది  వినడం అంటూ ఏదైనా ఉందా లేదా అంటూ అసహనంగా అడిగింది లలిత.

సరే సరే ఇంతకీ ఏమైనా తిన్నవా లేదా అని అంది లేదు మూడురోజులుగా తిన లేదు భోజనం తెప్పించు అనగానే బయటకు వెళ్ళింది కానీ ఇంతలోనే ఊరి సర్పంచ్ భోజనం క్యారీయర్ తీసుకుని వచ్చేసరికి క్యారీయర్ గుంజుకున్నట్టు తీసుకుని లోనికి వెళ్లి గబగబా విప్పి,ప్లేట్ లో పెట్టింది.లలిత అన్నం చూడగానే ఆకలితో ఆగలేక ఉట్టి అన్నాన్నే తినసాగింది.

లోపల జిల్లా డి.. జి గారు వచ్చారు కలెక్టర్ దగ్గరికి అక్కడ అన్నం తింటున్న లలిత ను చూడగానే స్టిఫ్ట్ అయ్యి సెల్యూట్ చేసాడు ఇతనేంటి మళ్ళీ సెల్యూట్ చేస్తున్నాడు అని ఆనుకుని,సర్ మళ్ళీ ఎందుకు ఫార్మాలిటీస్ అని అంది,

దాంతో మూర్తి గారు సారి మేడం ఇది మీకు కాదు మా మేడం లలిత గారికి అన్నాడు,లలిత కా లలిత కు ఎందుకు అంటూ ఆశ్చర్యం గా డి. . జి వైపు చూసింది,మిస్టర్ . జి ప్లీస్ క్లోజ్ డోర్ అంది లలిత, వెంటనే డోర్స్ పెట్టాడు .జి. ఆశ కూర్చో,సర్ మీరు కూడా కూర్చోండి అంటూ ప్లేట్ లో చేయి కడిగేసుకుంది

లలిత లేచి నిలబడి సర్ ఇంకాసేపట్లో ఇక్కడికి మినిస్టర్ అతని గ్యాంగ్ రాబోతున్నారు వారిని అరెస్ట్ చేయగలిగే పవర్స్ అన్ని మీకు ఉన్నాయి సో మీరు కొన్ని పేపర్స్ మీద ఆశ మేడం సంతకాలు తీసుకోండి అంది .ఓకె మేడం అంటూ పేపర్స్ తీసుకుని  సంతకాలు పెట్టమన్నారు ఆశ ని,

లలితలోని మార్పును, మాటను పోలికలు లేకపోవడంతో ఏమనాలో తెలియక గబగబా సంతకాలు పెట్టింది ఇంతలో బయట కలకలం వినిపించేసారికి లలిత సర్ పొజిషన్ అని గో బాక్ ఆశ అంటూ ఆశని పక్కనే ఉన్న ఒక ఖాళీ బీరువాలో కి పంపిస్తూ మళ్ళీ నేను పిలిచే వరకు బయటకు రాకు జాగ్రత్త అంటూ చెప్పి చీరలో దాచుకున్న గన్ బయటకు తీసింది బీరువా మూసుకుంది,

ఇద్దరు తలుపుల వెనక్కి నక్కారు,బయట నుండి రేయ్ ఇక్కడే ఉంటారు జాగ్రత్తగా వెతకండి అనే అరుపులు విని సైగ చేసింది . జి గారికి ఇంతలో తలుపు నెమ్మదిగా తీర్చుకుంది లోపలికి మినిస్టర్ రాగానే తలుపుల వెనక నక్కిన లలిత తలుపులు మూసి డోంట్ మూవ్ అంటూ గన్ ని వెనకనుండి అతని విపులో గుచ్చిo ది.ఇంతలో అందరూ పరుగెత్తి వచ్చారు అక్కడికి డోర్లు బడుతున్నారు. .జి గారు పెద్దగా తలుపులు కొట్టకండి మీ నాయకుడు మాకు బంది అయ్యాడు.ఇక మిరెక్కడికి తప్పించుకోలేరు మా వాళ్ళు మీ వెనకే ఉన్నారు అని అనగానే ఒక వంద మంది పోలీసులు బిల్డింగ్ మొత్తాన్ని చుట్టేసి,

బయట ఉన్న మినిస్టర్ అనుచరులని అరెస్ట్ చేశారు. గోలంతా అయ్యేవరకు కలెక్టర్ గారు బిరువాలోనే ఉన్నారు.వారిని తీసుకుని వెళ్లిన తర్వాత గంటకు లలిత వచ్చి ఆశని బయటకు తీసుకొచ్చి,కుర్చీలో కూర్చోబెట్టి o ది. ఏంటీ ఇదంతా లలిత నువ్వు ఎవరు అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు

దయచేసి చెప్పండి మీరైనా అంది అయోమయంగా చూస్తూ.. చెప్తాను ఆశ గారు చెప్తాo చెప్పక పోతే మీకు ఎలా అర్థం అవుతుంది అంటూ వచ్చాడు రాజేష్,అతన్ని చూడగానే ఇంకోసారి ఆశ్చర్య పోయింది ఆశ అబ్బా ఎన్ని సార్లు ఆశ్చర్యపోతావే ఇదిగో ఇటూ చూడు నేను వివరంగా చెప్తా గాని నిదానంగా విను,అంటూ మొదలు పెట్టింది లలిత

నీకు ముందు నుండి తెల్సు ఊరికి ఏదైనా చేయాలని నేను అనుకోవడం దానికోసమే  చదువుకోవాలని పట్నం రావడం,ఇక్కడ నాకు రాజేష్ పరిచయం అయ్యాడు అతని పరిచయం తో నాకు కొన్ని కొత్త విషయాలు తెలిసాయి అవే యువతను మత్తులో ముంచి ఎన్నో అరాచకాలు చేయించే విషయాలు దానికి మూలం ఏంటో, ఎక్కడ నుండి అవి వస్తున్నాయో తెలుసుకున్నాడు రాజేష్ ,

అయితే రాజేష్ రా ఏజెంట్ అనే సంగతి నాకు అప్పటివరకు తెలియదు ఒక రోజు నేను తన సూట్కేస్ లో పేపర్స్ అన్ని చూడడం జరిగింది. నాకు ఇంట్రెస్ట్ గా అనిపించింది దాంతో రాజేష్ నాకన్ని విషయాలు చెప్పాడు అప్పటి నుండి నాకు ట్రైనింగ్ ఇవ్వడం మొదలు పెట్టాడు.

అప్పటికే నీవు నన్ను అపార్థం చేసుకున్నావు,నీకు ఇవ్వన్ని చెప్తే భయపడి నన్ను వెనక్కి ఎక్కడ లాగేస్తావో అని, అయినా నాకు సమయంలో మన ఊరికంటే కూడా ఇదే పెద్ద సమస్యగా అనిపించి దీన్ని రూపుమాపాలని అనుకుని,హాస్టల్ నుండి వెళ్ళిపోయి రాజేష్ సహకారాన్ని అందుకుని రా ఏజెంట్ గా మారాము,

ఇద్దరం కలిసి ఎన్నో అరాచకాలు రూపు మాపి వారిని పట్టుకున్నాం,తర్వాత అమ్మావాళ్ళ ని చూడాలని ఊరికి వచ్చాను కానీ అప్పటికే నేను రాజేష్ తో లేచి పోయాను అని అనుకున్న వాళ్ళు నేను చనిపోయాను అని అందరికి చెప్పడం తో వెనుదిరిగి పోయాను,

ఇక నా జీవితం మంచి పనులకే వినియోగిస్తాను,దేశాన్ని కాపాడడానికే నేనున్నా అంటూ పెళ్లి ఆలోచనను కూడా మానుకున్నా,ఇక రాజేష్ నాకు స్నేహితుడు,మిత్రుడే కాక నాతో పని చేసే ఉద్యోగి మాత్రమే మా జీవితాలు ఇక దేశ సేవకే అంకితం అని,ఇక మిగిలింది యువత డ్రగ్స్ విషయం ,దాంట్లో మినిస్టర్ ది ముఖ్యమైన పాత్ర అని తెలిసి అన్ని ఆధారాలు సంపాదించాము.

ఇక రోజు ఇక్కడ నీ ఫంక్షన్లో  చీరల పంపిణీ తో పాటుగా డ్రగ్స్ కూడా పంచె కార్యక్రమం ఉందని తెలిసి ఇక్కడికి వచ్చం కొన్ని కోట్ల  డ్రగ్స్ చేతులు మారి పోతుందని తెలిసి వచ్చాము, మేము వస్తున్న సంగతి ఎలాగో వారికి తెల్సిపోయి,మమ్మల్ని చంపాలని వారు వచ్చారు కానీ మేము వారిని పట్టుకున్నాం అంటి దీర్ఘo గా చెప్పి,ఊపిరి పీల్చుకుంది లలిత.

తాను అపార్థం చేరుకున్న లలిత ఇప్పుడు ఒక దేశానికి సేవ చేసే పోలీసు ఆఫీసర్ అని తెలియగానే తాను తనని ఎంత తిట్టిందో గుర్తుకు వచ్చి పశ్చాత్తాపం తో  తల దించుకుంది ఆశ.కానీ మళ్ళీ తలెత్తుతూ తన చిన్ననాటి స్నేహితురాలు తన ఊరి గురించి ఆలోచించిన అమ్మాయి దేశం గురించి ఇంకెల ఆలోచిస్తుందో,

తెలిసి తాను ఆమెని మాత్రం కూడా అర్థం చెసుకోలేక పోయినందుకు,తన దృష్టి లో,లలిత తల్లిదండ్రుల దృష్టిలో ఆమె చనిపోయిందని అనుకున్న ఇవేవీ లక్ష్య పెట్టక తన దారిలో నడిచే లలిత అంటే చెప్పలేనంత అభిమానం ఒక్కసారిగా పెరిగి పోయింది ఆశ మనసులో కుర్చీలో నుండి లేచి నన్ను క్షమించు లలిత అంది 

క్షమాపణ ఎందుకు నీ ప్లేస్ లో నేనున్నా అదే చేస్తా అంది లలిత ఆశని కౌగిలించుకుని, ఇంతలో లలిత తల్లిదండ్రులు వచ్చేసరికి అందరూ కొద్దీ సేపు దుఃఖ సాగరం లో మునిగిపోయారు. తర్వాత రాజేష్ ఇక వెళ్దాo లలిత ఎక్కువ సేపు ఉండడం మంచిది కాదు అనే పిలుపు విని తల్లిదండ్రుల దగ్గర వీడ్కోలు తీసుకుని తన కర్తవ్య నిర్వహణ కోసం బయలు దేరిన వీరనారి లలిత ను చూస్తుండిపోయారు అంతా కన్నీటి తో.

 

Related Posts