లవ్ స్టోరీ 2020

అదొక కాలేజీ సీతాకోకచిలుక లాంటి అమ్మాయిలు, అబ్బాయిలాంత సంతోషంగా,కొత్త లోకం లో విహరిస్తూన్నట్టుగా, లోకం లో తామే ఉన్నట్టుగా తమదే ప్రపంచం అన్నట్టుగా కబుర్లు చెప్పుకుంటూ,తమలో తామే నవ్వుకుంటూ, విహరిస్తున్నారు.

ఇక అమ్మాయిలు అయితే తమ కొత్త అందాలను మంచి మంచి బట్టలో దాచి దాచనట్టుగా దాస్తు,ఒర చూపులతో కుర్ర కారుని మైమరపింప చేస్తూ, వారు తమని చూస్తున్నారో లేదో అని ఒరా చూపుల నుండి గమనిస్తూ, అక్కడక్కడ తిరుగుతూ ఉన్నారు,ఇక అబ్బాయిలు కూడా వారి దృష్టిలో పడాలని అక్కడక్కడే తిరుగుతూ ఉన్నారు.

వారందరి కంటే కాస్త దూరం లో ఇద్దరూ మాట్లాడుకుంటూ నిలబడ్డారు.వారిలో ఒక అమ్మాయి,ఇంకో అబ్బాయి ఉన్నారు వారిద్దరి వయసు ఇరవై లోపే ఉంది.అబ్బా చరిత నన్ను అర్థం చేసుకో,

నా ప్రేమని ఒప్పుకో,దయచేసి అన్నాడు ఆనంద్,లేదు ఆనంద్ ప్రేమలు, అవి మా ఇంట్లో ఒప్పుకోరు అంది చరిత,అబ్బా ముందు నువ్వు ఒప్పుకుంటే నేను ఎలాగైనా  ఇంట్లో ఒప్పిస్తాను కదా,ముందు నువ్వు ఒప్పుకో చాలు అన్నాడు ఆనంద్.

అంతేనంటవా అంది చరిత అటూ,ఇటూ ఉండి ఊగిసలాడే మనసుతో,అబ్బా మాట ఇప్పటికి ఎన్ని సార్లు అంటావు. నీకు ఇష్టమే కానీ నన్ను ఇబ్బంది పెట్టడానికి ఇలా చేస్తున్నావు కదా అన్నాడు ఆనంద్. మాటలకు నవ్వుతూ చూసి, సిగ్గుపడుతూ అక్కడ నుండి పరుగెత్తింది చరిత,

అంటే ఒప్పుకునట్టే అని భావించిన ఆనంద్ యా హు అంటూ ఎగిరి గంతేసి, క్లాస్ కి వెళ్లిపోయాడు.ఆనంద్,చరిత లు ఒకే కాలేజీ,ఒకటే క్లాస్ కావడం వల్ల చరిత ను చూడగానే ప్రేమలో పడ్డాడు ఆనంద్, చాలా రోజులు గా బతిమాలించుకుని ఇప్పుడు ఒప్పుకుంది చరిత.

ఇక రోజు నుండి వారి సంతోషాలు, సరదాలు అన్ని మొదలు అయ్యాయి. కాలేజీ లో,సినిమా హల్లో, పార్కులు అన్ని వారి కబుర్లకు,చిలిపి పనులకు  అత్తారిల్లు లా మారి పోయాయి.

వారిద్దరూ తమ తమ పరిధులు దాటి , సమాజం పెట్టిన హద్దులు చేరిపేసి, శీలం అనే రేఖను కూడా చేరిపేసుకున్నారు.ఆనందాల అంచుల వరకు వెళ్ళొచ్చారు. స్వర్గపు శిఖరాలను అందుకున్నారు.అలా వాళ్ళు తమ ఆనందాన్ని,సంతోషాన్ని అందుకునే క్రమంలో తమ ఇంట్లోని వారిని మర్చిపోయారు.

ఒక శుభ దిననా చరిత ఇంట్లోని వాళ్ళు ఆమెకి ఫారిన్ సంబంధాన్ని చూసి, పెళ్లి చూపులకు కూర్చో బెట్టారు.కూర్చుంది,అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు ఆనంద్ కంటే కూడా పైగా ఫారిన్ వాడు, లక్షల్లో సంపాదన ఉంది. ఇద్దరి కి ఇద్దరూ నచ్చారు. ఇక ఆనంద్ కూడా తండ్రి బిజినెస్ లో పార్ట్ నర్ అయిన ఒకతని కూతురుకు భర్త గా ఫిక్స్ అయ్యాడు.. 

వారికి కూడా చూపులు అయ్యాయి,చరిత కంటే అందంగా కనిపించింది అమ్మాయి ఆనంద్ కళ్ళకి, పైగా లక్షల కోట్ల ఆస్థి,ఒక్కతే కూతురు కావడంతో పెళ్లికి పెద్ద అభ్యoతరం అనిపించలేదు. పెళ్లిళ్లు కుదిరాయి..

ఇద్దరు కాలేజీ చివరి రోజు కలిశారు. హే చరితా హౌ అర్ యు అడిగాడు ఆనంద్,హే నైస్ రా వాట్ ఆబౌట్ యూ అంది చరిత యా ఫైన్ అన్నాడు ఆనంద్, హే ఆనంద్ నా మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది,నువ్వు తప్పకుండా రావాలి అంటూ కార్డ్ ఇచ్చింది చరిత.హో అలాగే వస్తా

నా మ్యారేజ్ కూడా ఫిక్స్ అయ్యింది నువ్వు కూడా తప్పకుండా రావాలి అన్నాడు ఆనంద్ కార్డ్ ఇస్తూ..హో ష్యుర్ అంది చరిత. ఇద్దరి దారులు వేరయ్యాయి. ఇద్దరు తమ తమ తండ్రులు తెచ్చిన కార్లో కూర్చున్నారు,కార్లు కదిలాయి. చరిత పెళ్లికి ఆనంద్,ఆనంద్ పెళ్లికి చరిత ఇద్దరూ వెళ్ల లేదు…. ఇది  లవ్ స్టొరీ  2020

Related Posts