లాక్ డౌన్ లో ఆడపిల్ల పార్ట్ -2

రెండవ రోజు రచన

ప్రస్తుతం :

అలా తండ్రి మాటలకూ ఆగం అయిపోయిన అనుపమ తన రూమ్ లో ఒక్కతే
ఏడుస్తూ కూర్చుని ఉంది.
అనుపమ బుగ్గలు
ఇప్పుడు ఎర్రని ఆపిల్ పండు మీద
నీలం రంగు angoor పొట్టు నిండిపోయినట్టు గా కన్నీరు తో నీలం గా మారిపోయాయి.
అనుపమ బట్టలు
పన్నెండు సంవత్సరాల కు ఒకసారి వచ్చే
పుష్కరాల లో ఆలస్యం గా వెళ్లి,
అందరు వదిలి పోయిన బురద తో స్నానము చేసిన భక్త శిరోమణి లా పచ్చి పచ్చి గా, బురద బురద గా మారిపోయాయి.
అనుపమ చెంపల మీది నుండి నీరు
శివుడి తల మీది నుండి పారె
గంగా ప్రవాహం గా కారుతూ పోతుంది.
అనుపమ కళ్ళు ఎర్ర మిరపకాయ లతో
కారం పొడి దంచుదాము అని ప్రయత్నం చేసి
ఆ ప్రయత్నం లో, ఆ దంచే సమయం లో అనుకోకుండా కారం పొట్టు కళ్ళలో పడగా
కళ్ళ లోని retina, antinta,
సిల్వర్ స్క్రీనా కి గాయం అయ్యి
ఒక్కసారి గా కండ్లు అన్ని
అర్ధరాత్రి స్వతంత్రం, ఎర్ర సైన్యం,
చీమల దండు, లాల్ సలాం సినిమా లో ని
R. నారాయణ మూర్తి కండ్ల లాగా, ఎర్రగా మారిపోయాయి.
అనుపమ ముక్కు లోనుండి చీము
అప్పుడే కాసిన ఉగాది మామిడి కాయ లాగా, అప్పుడే నింపిన మాంగో frooti లాగా
నిగ నిగ లాడుతూ,
బాహుబలి పార్ట్ one నుండి విడుదల కోసం
వెయిట్ చేస్తున్న అనుష్క క్యారెక్టర్
బాహుబలి 2క్లైమాక్స్ కి రాగానే
ఎంత ఆనందం గా,
ఆత్రం గా విడుదల అయ్యేందుకు వేంపర్లడిందొ అంతకు మించి వెయ్యి రేట్లు వేగం తో
ఆ చీముడు ముందుకు కారుతు ఉంది.
అయినా కూడా తన శ్రమ ను,
దేవుడి రాత ను తప్ప
వేరే వాటి గురించి ఆలోచించని
సగటు భారతీయ రైతు కూలి లాగా,
పారిశుధ్య కార్మికుల లాగా,
కులం చేతిలో దెబ్బతింటున్న కింది కులాల మనుషుల లాగా
అనుపమ కూడా
అంత బాధ లోను
ఆ కారే చీము ను వెనక్కి తోయ్యా డానికి
తన చీర ను, జాకెట్ ను ఆ దేవుడు ఇచ్చిన ఆయుధం గా వాడుతుంది.
చివరగా ఆ పోరాటం లో అనుపమ దే పై చెయ్యి అయ్యింది.
అందుకే పెద్దలు చెప్తుంటారేమో ఎప్పటికైనా న్యాయమే విజయం సాధిస్తుంది అని అనుకోని తనకి తాను ఊరట కలిగించు కుంది అనుపమ.

అలా రోదిస్తున్న అనుపమ గుండెల్లో
సప్త సముద్రాలూ, పంచ మహా సముద్రాలూ,
నైల్, మిస్సిసిపి, లాంటి విదేశీ నదులతో పాటు
గంగా, గోదావరి, కృష్ణ, సరస్వతి
వంటి నదులు కూడా
ఉత్తరాది దక్షిణాది బేధాలను విడిచిపెట్టి
కాంతి కన్నా వేగం గా,
ధ్వని కన్నా గొప్ప గా ప్రవహిస్తున్నాయి.
గంట ముందు తండ్రి తో జరిగిన సంవాదం
మెల్లిగా చెవిలో dts సౌండ్ తో, మల్టీప్లెక్స్ acceptable సౌండ్ రేషియో తో వినిపిస్తుంది.
నాన్న నేను సాయి ధరమ్ నే ప్రేమించాను,
సాయి ధరమ్ నే పెండ్లి చేసుకుంటాను.
అన్న అనుపమ మాటలకూ
కోపం వచ్చిన దానియేలు సాహెబ్ శాస్త్రీ
ఎవడో కులం, మతం, ఆస్తి,
అంతస్తు, పేరు, ప్రతిష్ట లు,
అమ్మ నాన్న లు వున్న వాడిని
తీసుకొని వచ్చి,
నాన్న వీడే నీ అల్లుడు అని చెపితే
ఒప్పుకోవడానికి
నేనేం కమ్యూనిస్ట్ ని, సోషలిస్ట్ ని,
అంబేద్కరిస్టు ని, హేతువాది ని
అనుకున్నావా?
నా పేరు ఏంటో తెలుసా
శంకర్ రెడ్డి శాస్త్రి సాహెబ్ దానియేలు,
మీ అమ్మ పేరు ఆల్రిలీజియనీయమ్మ
నీ పేరు కూడా all క్యాస్టమ్మా
అని పెడితే
నువ్వే ఈ దోపిడీ సమాజం కి
బయపడి అనుపమ గా మార్చుకున్నావ్.
నాకు అల్లుడు గా వచ్చేవాడు
ఒక అనాధ అయ్యి ఉండాలి.
వాడికి రీసెంట్ గా గవర్నమెంట్ జారి చేసిన
నో caste, నో రిలీజియన్,
నో కంట్రీ, నో సెకండ్ థాట్
And ఫైనల్లీ నో హోప్స్ in life
అని చెప్పబడే ధ్రువీకరణ పత్రం ఉండాలి.
అవి ఉన్నాయా మీ సాయి వద్దా
అనగానే
కోటి సంవత్సరాల నుండి
గుండెల్లో నింపుకున్న
ఆశ లను, ఎవరో దొంగ డాక్టర్
ఆపరేషన్ ఫీజు కి కక్కుర్తి పడి
కడుపు నోప్పి అని వెళ్లిన వాడికి
apendicite ఆపరేషన్ చేసి,
కడుపు లోని ప్రేగు లతో పాటు
ఆ ఆశ లను కూడా నిరంకుశంగా,
అన్యాయం గా బయటకు లాగి
పడేసినట్టు అయ్యింది
అనుపమ పరిస్థితి
తన తండ్రి చెప్పిన మాటలు విని.

కానీ శంకర్ సాహెబ్ మాత్రం
అది ఏమి ఆలోచించంకుండా
తన దోవ న తను పోతునే ఉన్నాడు.
అలా యక్ష ప్రశ్న లతో
కూతురు పై కక్ష సాధిస్తున్న తన భర్త ని
ఆపడానికి అనుపమ తల్లి
అల్ రిలీజియనమ్మా భర్త తో
ఏమండీ
ఆ రోజు మన శోభనం సమయం లో
మీరు ఏమన్నారో గుర్తు లేదా?
అని అనగానే
ఆ హటాత్తు ప్రశ్న కు
తల వెయ్యి వంకరలు తిరిగిన రెడ్డి శాస్త్రి,
ఒసేయ్ పిచ్చి మొకమా
పెళ్లిడుకు వచ్చిన పిల్ల ముందు
ఆ పిల్ల ప్రేమ వ్యవహారం గురించి మాట్లాడుతుంటే మధ్య లో నీ శోభనం కబుర్లు ఏంటే
నీ మొకం మండ
అని సౌమ్యమ్ గా, మృదు వు గా చెప్పగా
అల్ రిలీజియనమ్మా అది కాదండీ
కులం మతం లేని మీరు
మీ కులం లోనే ఎందుకు పెళ్లి చేసుకున్నారు,
అది కూడా మీ మేన మారదలు అయిన
నన్నే ఎందుకు చేసుకున్నారు
అని అంటే ఏమన్నారు ఆనాడు
ఏమనుంటాను
కాలం కలిసి రాకపోతే వాసుదేవుడు
అంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకోలేదటె
అని అనుంటాను
అబ్బా
మీ హాస్యం పిల్లులు, కుక్కలు, బర్రెలు, పందులు గాడిదలు, కాకులు, జర్రులు, ఎర్ర లు
సమస్త జీవ రాశులు దొల.

ఆ రోజు ఏమన్నారు అంటే
నేను వేరే కులం వాడిని,
మతం వాడిని పెండ్లి చేసుకుంటే
ఈ సమాజం నన్నో ఆది శంకరుడినో,
రామానుజున్నో
అవేవి కాకపోతే కనీసం
ఒక నిత్యా నందున్నో చేసి పడేసి,
విగ్రహం పెట్టేసి,
నా లక్ష్యం ని గాలికి వదిలేస్తుందే
పిచ్చి మొకమా,
అందుకే నేను నిన్నే చేసుకున్నాను అని అనలేదు.

అనగానే శాస్త్రి అవును అన్నాను
అయితే ఏంటి? అనగానే
అలాగే మన కూతురు కి కూడా
మన కులం వాడినో లేదా
తాను ప్రేమించిన వాడినో ఇచ్చి పెళ్లి చెయ్యాలి గాని అనాధ కే ఇస్తా అనడం
ధర్మం కాదండీ
అని అల్ రిలీజియనమ్మా చెప్పగా
హిందూ ధర్మం అని
వాడెవడో టీవీ ఛానల్ పెట్టగానే
ప్రతీ వాడు ధర్మం గురించి మాట్లాడే వాడే
అసలు నీకు ధర్మ అధర్మం ల సంగతి
ఏం తెలుసు
మనుషులలో విబేధాలు రావడానికి కారణం
పురుష ఆదిపత్య సమాజం.
ఈనాటి కి కులం ఉందంటే
మా పురుషులమే కారణం
నా స్త్రీ స్వతంత్రం అర్హతి
ఇది అన్ని మతాలు చెప్పిన మాట
కాబట్టి నేటి సమాజం లో ఒక సంస్కరణ తేవాలి అన్న
దాన్ని అలాగే చిర స్థాయి గా నిలపెట్టాలి అన్న పురుషుడి తో మాత్రమే సాధ్యం.

అందుకే నేను కూతురు ని ఒక్కదాన్నే కన్నాను,
నీకు కొడుకు పుడుతున్నాడు అని డాక్టర్ ద్వారా తెలుసు కొని
నీకు మాట మాత్రం చెప్పకుండా అబార్షన్ అయ్యేలా చేశాను.
అలాగే నా తల కొరివి కూడా కూతురు తోనే పెట్టించు కుంటాను.
దానిలో భాగం గానే
నా కూతురు కి ఆస్తి అంతస్తు,
కులం, మతం, ప్రాంతం,
దేశం అంటు ఏది లేని
వాడికే యిచ్చి పెళ్లి చేస్తాను తప్ప,
ఒక దిక్కు మొక్కు,
ముక్కు మొహం ఉన్నవాడికి ఇచ్చి
నా కూతురు గొంతు, చెవులు, కాళ్ళు, చేతులు, నోరు, ముక్కు, మెడ, జుట్టు ఇంకా శరీర అవయవాలను కోయలేను
అన్న మాటలకు అల్ రిలీజియనమ్మా సమాధానం చెప్పలేక నీరు, జ్యూస్, రసం, చీము, సాంబార్ కారి పోయింది.

తన తండ్రి మాటలు
చెవి కర్ణబేరి కి రంద్రాలు పెడుతున్నా,
చెవిలో నుండి చీము
“గంగా తరంగ రమనీయ జటా కలాపం”
అన్న పాట రేంజ్ లో పరవళ్లు,
పచ్చిక బయళ్లు,
ఇసుక తిప్పలు ,
గవర్నమెంట్ వేసిన డాంబార్ రోడ్ లు
తొక్కు తున్న విషయం
గ్రహించిన అనుపమ స్పృహ లోకి వచ్చింది.

ఇంకా ఉంది మళ్ళీ కలుద్దాం.

—–వంశీ కృష్ణ

Related Posts

1 Comment

Comments are closed.