లాక్ డౌన్ లో ఆడపిల్ల పార్ట్ -1

అనుపమ బుగ్గలు ఎరుపెక్కాయి
ఊహల్లో తేలి పోతుంది.
లుంబిని పార్క్ లో తాను సాయి ధరమ్ కలిసి అలా అలా బయటకు వెళ్ళినప్పుడు జరిగిన చిలిపి పనులను గుర్తుకు తెస్తు,
సాయి ధరమ్ పెడుతున్న వాట్సాప్ మెసేజ్ లు చూస్తూ ఉన్న అనుపమ మెల్ల మెల్ల గా తన జ్ఞాపకాల లోకి జారి పోతుంది.
ఆ రోజు తాను అతడు పెట్టుకున్న ముచ్చట్లు ఆమెనూ కుదురుగా ఉండనివ్వడం లేదు.
అతడు పెట్టె మెసేజ్ లకి స్మైలీ లను రిప్లై లు ఇస్తూ అలాగే కూసోని ఉంది.
ఏ అను మళ్ళీ రేపు వెళ్దామా…
అన్న ప్రశ్న చూసి
ఏం జవాబు చెప్పాలో తెలియని మైకం తో ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది.
మళ్ళీ ఇద్దరం అలా పార్క్ లో…
అని వచ్చిన మెసేజ్ చూసి
ఆపు సాయి
అని రిప్లై ఇద్దాం అనుకోని
పర్లేదు లే నా వాట్సాప్ ఏ కదా
చూద్దాం ఇంకేం చెప్పుతాడో అని ఆగిపోయింది.
కానీ సాయి మాత్రం వాట్సాప్ ఏకాన్తం ని చాలా బాగా ఉపయోగించు కుంటున్నాడు.
అలా గంటలు ఎవరెస్ట్ శిఖరము మీది నుండి జారి పడిన గులక రాళ్ల లాగా దొర్లీ పోతున్నాయి.

అలా రాత్రి మొత్తం వాట్సాప్ తో గడిపిన అనుపమ
ఎలాగైనా రేపు ఆఫీస్ అయిపోయాక
తనను కచ్చితంగా కలుసు కోవాలి
అని సాయి పెట్టిన షరతు కు ముద్దుగా ఆమోదం తెలిపిన విషయం గుర్తు తెచ్చుకొని నిద్ర కు ఉపక్రమించింది.
అలా అనుపమ రాత్రంతా ఆ ఊహల లోనే
లుంబినిపార్క్, ఎన్టీఆర్ గార్డెన్,
సంజీవయ్యా పార్క్, చార్మినార్,
బిర్లా మందిర్, ఫలక్ నుమా ప్యాలెస్ పాలస్,
సాలార్ జంగ్ మ్యుజియం , బిర్లా ప్ఇలానిటోరియం లా హైదరాబాద్ లోని అందమైన ప్రదేశాలు
అన్ని సాయి తో కలిసి తిరిగినట్టు
ఎన్నో తీయని అనుభూతులను పంచుకున్నట్టు కలలు కనీ ,
నిద్రలో కూని రాగాలు కూడా తీసి
అమ్మ చేతిలో దొరికి పోయి,
తరువాత ఏదో కత చెప్పి మేనేజ్ చేసి
పట్టిన కాడికి నిద్ర పోయింది.

పొద్దునే లేచి స్నానము చేసి,
చక్కగా దేవుడికి పూజలు చేసి,
వంట కాలేదు అన్న విషయం ని లైట్ గా తీసుకొని
పోనీ లే అమ్మ అని చెప్పి
అమ్మ నాన్న తో
ok నమ్మా ఆఫీస్ కి వెళ్లి వస్తాను
అని చెప్పింది.

అలా ఇంటి గడప దాటి బయటకు అడుగు
వేయ పోతుంటే అడ్డుగా వచ్చిన నాన్న
మాట విని అదిరి పడింది
ఆగు, ఎక్కడికి వెళ్తున్నావ్
అన్న నాన్న మాట కు బదులు గా
అది ఆఫీస్ కి నాన్న అని చెప్పగా
ఏం ముసలోళ్ళు వీళ్ళు
వీరికి ఏమి తెలియదు అనుకున్నావా
మాకూ వాట్సాప్ లో మెసేజ్ లు వస్తున్నాయ్ తెలుసా..
అని నాన్న అనగానే
ఏంటి వాట్సాప్ మెసేజ్ ల!
అని మనసు లో
ఆ సాయి గాడు వీళ్లకు ఏమైనా పంపి ఉంటాడా… అని అనుకోని
ఏది మీ ఫోన్ ఇవ్వండి
అని ఫోన్ అంత చెక్ చేసి
ఏంటి నాన్న సాయి ఏం పంపలేదు కదా…
అనగానే
సాయి నా వాడెవడు?
నేను చెప్పేది గవర్నమెంట్ గురించి..
మన దేశం ప్రజలను చైతన్యం చెయ్యడానికి, ప్రభుత్వం అందరికి ఫార్వర్డ్ మెసేజ్ పంపుతున్న విషయం నీకు తెలియదా?
అని నాన్న అడుగగా
ఓ ఆ విషయమా!,
నేను ఇంకేదో అనుకున్న,…
పోనీ నాన్న
ప్రభుత్వం వారు ఏం పంపారు మెసేజ్
అని మెల్లిగా మాటలను
పక్క దారి పట్టించాలి అని చూడగా
కోపం గా చూస్తున్న తండ్రి
అది పక్క న పెట్టు,
ముందు సాయి ఎవరో చెప్పు…..
అదీ, అదీ సాయి..
అని నీళ్ల తో పాటు
అప్పుడే తిన్న ఇడ్లి లో నాంచుకున్న సాంబార్ కొంత నాలిక పై ఉండగా దాన్ని,
పొద్దున్న పతంజలి పేస్ట్ తో పండ్లు తోముకొన్న ప్పుడు పండ్ల కు అలాగే అంటుకుపోయిన పేస్ట్ ని కూడా కలిపి
కసా కసా కసా నవలగా…..
నమిలిన కాడికి చాలు,
ముచ్చట చెప్పు అన్న తండ్రి కోపం చూసి,
ఎందుకు వచ్చిన గొడవ అని ఆలోచించి
సాయి మా బాస్ పేరు నాన్న అని సర్ది చెప్పింది.

ఓహో బాస్ పేరా
రాత్రి కలలో ఒకటే కలవరింతలు తీస్తూ ఉంటే
ఇంకా ఏమో అనుకున్న
ఇంత దాకా వచ్చినదా విషయం
అబద్దాలు చెప్పడం కూడా నేర్చావ్ అన్నమాట
నీకు ఇదే మొదటి మరియు చివరి హెచ్చరిక.

ఈ రోజు నుండి ఏప్రిల్ 14వరకు లాక్ డౌన్ అంట
ఆఫీస్ లు అన్ని బంద్ పెట్టారు
మర్యాదగా ఇంట్లో కూర్చొని
రంగనాయకమ్మ గారి రామాయణం,
వోల్గాగారి రచనలు చదివి
ఆ సాయి అనే నీచుడిని,
వాని కుటిల పన్నాగం ని మరిచి పో
లేదా ఈ లాక్ డౌన్ టైం లోనే
ఓ.ఎల్. ఎక్స్ లో పెండ్లి కొడుకుని చూసి,
ఫేస్బుక్ లో పత్రిక లు వేయించి,
వాట్సాప్ లో పసుపు కుంకుమ లు పంపి,
ఆన్లైన్ లో పంతులు ని పిలిచి
పంతులు కట్నం పే .టి. యం ఓ
లేదా గూగుల్ పే నో చేసి
నీ పెండ్లి చేసి,
హనీమూన్ కి
అని ఏదో చెప్పబోతు ఉండగా
నాన్న
అన్న బర్రె అరుపు,
గాడిద వొండ్రాయింపు లాంటి కేక చూసి,
చుట్టూ పక్కల జంతువులు ఏమైనా వచ్చాఏమో అని సరి చూసుకొని,
చివరికి అది తమ కూతురి ఆర్ధనాదం,
పోలికేక, విప్లవ శంఖం,
దండోరా, తుడుం దెబ్బ
అని గ్రహించి కూతురు వైపుకు తల తిప్పాడు
మన శంకర్ రెడ్డి శాస్త్రి సాహెబ్ దానియేలు

ఇంకా ఉంది మిమ్మల్ని ఎవ్వరు కాపాడలేరు..

వంశీ కృష్ణ

Related Posts