లాటరీ

అరెయి, నీకు ఆ యాప్ ఉందా, అది చాలా బాగుందని అంటున్నారు అందులో మెసేజ్ చేసినా మళ్ళీ డిలీట్ చెయ్యొచ్చు అంట రా నేను వాడుతున్న నువ్వు కూడా వాడు చాలా ఉపయోగకరమైన యాప్ ఇది అంటూ స్నేహితునికి చెప్పాడు నవీన్,ఓహ్ అవునా నేను ఇన్ని రోజులు ఒక వాట్సప్ మాత్రమే వాడుతున్నా,ఇప్పుడు నువ్వు చెప్పవు కదా,ఇక అదే వాడుతా,కానీ అందులో కాలింగ్ చేయొచ్చా అని అడిగాను ఆతృతగా నేను, ఆ ఇప్పటి వరకు అయితే లేదు రా ఇక ముందు పెడతారేమో అని చెప్పి వాడు ఫోన్ పెట్టాడు.

నేను వాడు ఫోన్ పెట్టేయగానే,నేను నెట్ ఆన్ చేసి,వాడు చెప్పిన ఆ యాప్ ని ఇంస్టాల్ చేసుకుని చూసాను యాప్ చాలా బాగుంది.చాలా వరకు ఫిచర్స్ బాగానే కనిపించాయి.దాన్ని వాడడం మొదలు పెట్టాను నేను కూడా ముందే మగాళ్ళం,నా స్నేహితులo ఒక గ్రూప్ గా అయ్యి ఇక అందులో పిచ్చ,పిచ్చగా మాట్లాడుకోవడం మొదలు పెట్టాము.అందులో పెళ్లి అవ్వని అబ్బాయిలం మాములుగా వాట్సప్ లో మెసేజేస్ ఎప్పుడైనా, ఎవరైనా చూడొచ్చు కాబట్టి ఇది చాలా సేఫ్ గా అనిపించింది.

మాకు అయితే, ఇక అందులో మెసేజ్ చేసాక, చదివాక అన్ని డిలీట్ చేసుకుంటే అయిపోతుంది. ఇక మనం ఎవరో చూస్తారు అనే భయం లేదు.కాబట్టి మేము స్వేచ్ఛగా రకరకాలుగా చాటింగ్ చేసుకునే వాళ్ళం.ఎవరూ ఎప్పుడూ వినలేని మాటలు కూడా మా ఫ్రెండ్స్ మీ మాట్లాడుకునే వాళ్ళం.ఇలాంటి ఒక సమయంలో ఆ యాప్ కి మెసేజ్ ఒకటి వచ్చింది.దాని సారాంశం ఏమిటంటే ఒక సర్వే లో పాల్గొనమని ఉంది.నేను మాత్రం అదేమి పట్టించుకోకుండా లైట్ తీసుకుని,వదిలేసా,ఎప్పటిలా మా మధ్య చాటింగ్ లు సాగుతూనే ఉన్నాయి.

ఇదివరకు అంటే ఇప్పుడు విచ్చలవిడిగా మాట్లాడుకుంటున్నాం మేము. కానీ మా నవీన్ గాడు మాత్రం మాతో మాట్లాడకుండా ఉన్నాడు.వాడు ఆన్లైన్ లొనే ఉంటున్నాడు కానీ మాతో మాట్లాడ్డం లేదు.సరేలే వాడికి ఎవరైనా అమ్మాయి పరిచయం అయ్యిందేమో అందుకే మాతో మాట్లాడ్డం లేదనిఅనుకున్నాం,ఇంతలో వేరే ఫ్రెండ్ గాడు వేరే ముచ్చట్లు తీయడం వల్ల మేము అందులో పడిపోయాం.వారం రోజుల వరకు కూడా వాడి ని పట్టించుకోకుండా ఉన్నాం.

మేము పట్టించుకోలేదు అనే కంటే వాడు మాతో కలవలేదు అనేది నిజం. సరే అలా ఒక రెండు వారాలు కూడా గడిచాయి.మూడో వారం లో వాడు అంటే మా నవీన్ అందరికీ కాన్ఫరెన్స్ కాల్ చేసి మాట్లాడాడు.
విషయం ఏమిటంటే ఒక షాక్ న్యూస్ అని మీఅందరికి మంచి పార్టీ ఇస్తున్నా సాయంత్రం వాడి ఇంట్లోనే కలుద్దాం అనే వార్త,ఓహో చాలా రోజులకు మా వాడు పార్టీ అంటున్నాడు.

అందులోనూ డబ్బు దగ్గర పీనాసి అని పేరు తెచ్చుకున్న నవీన్ గాడు పార్టీ ఇస్తాను అనే సరికి మేమంతా రెక్కలు కట్టుకుని వాడి రూమ్ ముందు వాలిపోయాం. పార్టీలో చాలా ఐటమ్ లు తినడానికి,తాగడానికి తెప్పించాడు.అయితే మలో కొందరికి ముఖ్యంగా నాకు నవీన్ పార్టీ ఇస్తున్నాడు అంటే వాడికి ఏదో లాభం లేకపోతే, రాకపోతే ఇలా చేయడు అని తెలిసి వాడి రహస్యం తెలుసుకోవాలని అనుకున్నాo. అనుకున్నాక ఇక అడ్డే o ఉంది.

మాకు మందు తలకు ఎక్కకుండా, వాడికి ఎక్కేలా చేసి అసలు విషయం రాబట్టాం వాడు చెప్పింది విన్నాక మాకు ఆశ్చర్యం కలిగింది.రోజు తెగ చాటింగ్ చేసుకుంటున్న మేము దాని వల్ల డబ్బు సంపాదించడం మాత్రం తెలుసుకోలేక పోయాం అని నవీన్ గాడి మీద కుళ్లు తో పాటు,కాస్త అసూయ కూడా కలిగింది. తర్వాత ఎలా సంపాదించాలో కూడా వాడిని అడిగి తెలుసుకున్నాం.

దానికి వాడు ఏం లేదు రా మనకు ఒక మెసేజ్ వస్తుంది దానికి ఆన్సర్ చేస్తే చాలు,కొన్ని ప్రశ్నలు అడిగి,డిపాజిట్ కడితే మన అకౌంట్ లో డబ్బులు పడతాయి.అదొక సర్వే లా చేసి గెలిచిన వారికి ఇలా 2000 అలా ఇస్తారు అని చెప్పాడు.అది విన్న మేము అంతకు ముందు మాకు అలాంటి మెసేజ్ లు వస్తే దాన్ని లైట్ తీసుకున్నాం అది గుర్తొచ్చి,చాలా అంటే చాలా చాలా ఫీల్ అయ్యాం..

ఆ తర్వాత మళ్ళీ ఆ మెసేజ్ కోసం మేము చాలా ఎదురు చూసాం కానీ మా దరిద్రం ఏమో అలాంటి మెసేజ్ మాకు రాలేదు..

ఇది జరిగిన వారం తర్వాత ఒక రోజు నవీన్ గాడు పరుగెత్తుకుని వచ్చాడు.నేను అంటే వాడికి ఉన్న ఒక ప్రేత్యేక మైన అభిమానం మరియు ఏదైనా సమస్య వచ్చినా వచ్చి ముందు నాకే చెప్తాడు.అందుకే వాడు రాగానే ఏంట్రా ఇలా వచ్చావు అని అడిగా ,బావా నా కొంప కొల్లేరయ్యింది రా అంటూ ఏడుపు మొదలు పెట్టాడు వాడు. ఏమైంది రా అని అడిగా వాడు చెప్పడం మొదలు పెట్టాడు.

అరెయి ఆ యాప్ లో డబ్బులు వస్తాయని నేను వచ్చిన అన్ని మెసేజ్ లకు రిప్లై ఇచ్చే వాడిని అలా ఒకరోజు ఎదో మెసేజ్ రావడంతో నేను దానికి రిప్లై పంపాను. అక్కడి నుండి నాకు ఒక కన్ఫర్మ్ మెసేజ్ వచ్చింది దాన్ని క్లిక్ చేయగానే ఒక సైట్ లాంటిది ఓపెన్ అయ్యి,అందులో నాకు లక్కీ లాటరీ వచ్చిందని అయిదు వేలు డిపాజిట్ అడిగారు నేను వారి అకౌంట్ లో డబ్బు వేసాను.కానీ నాకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రాలేదు రా ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది అని బేర్ మన్నాడు.

నాకు సీన్ మొత్తం అర్ధమయ్యింది. ఇంతలో ఇంకో నలుగురు స్నేహితులు కూడా ఇలాగే మోసపోయాం అని వచ్చారు.కానీ ఎవరి మీద అని కంప్లైంట్ ఇస్తాం చెప్పండి అయిదు వేల కోసం పోలీసు స్టేషన్ కి బుద్ది ఉన్నవాడు ఎవడైనా వెళ్తాడా వెళ్ళడు కాబట్టి మా వాళ్ళందరికి నచ్చ చెప్పి పంపించాను నేను కానీ నా స్నేహితులకు నాకు అయిదు వేలు అంటే ఎక్కువ కాకపోవచ్చు కానీ మధ్యతరగతి వాడికి ఒక నెల గ్రాసం కదా అదే విషయం నా మనస్సు లో మెదులుతూ ఉంది కాబట్టి ఈ కథ ద్వారా నేను మీకు ఈ విషయాన్ని చెప్పాలని,మిమ్మల్ని జాగ్రత్త పడాలని హెచ్చరించాలని వచ్చాను.కాబట్టి మిత్రులారా వేరే ఏ యాప్ వాడినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి, పరిశీలించి చూసాకే వాడండి.ఇలాంటి లాటరీ టిక్కెట్ లు వచ్చాయని అంటే మాత్రం అసలు నమ్మకండి.. తస్మాత్ జాగ్రత్త మరి…..

Related Posts