లావొక్కింతయు

అబ్బా ఏం ఉందిరా బొమ్మా, డన్ లప్ పరుపుకు ఎక్కువా,సింగిల్ కాట్ కి తక్కువలా ఉంది రా ఫిగర్ అన్నాడు పక్కింటి అబ్బాయి,తన స్నేహితులతో వెటకారంగా , పక్క నుండి వెళ్తున్నా  దేవికి చర్రున కోపం ముంచుకు వచ్చి,కోపంగా ఒక్క చూపు చూసింది.అలా చూడగానే అబ్బా ఏంటి నీ చూపుకు మేము భయపడలా ఏంటి, నువ్వు నీ మొఖం ఒకసారి నీ ఫేస్ ని అద్దం లో ఒక్కసారి చూసుకో అన్నాడు వాడి స్నేహితుడు.

దేవి ఏడుస్తూ తన ఇంట్లోకి వెళ్ళింది.తండ్రి పరమేష్ చూసి ఏమమ్మా దేవి ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు ఆందోళన గా,  అది నాన్న నన్ను పక్కింటి వాడు లావుగా ఉన్నావు అని వేళాకోళం చేస్తున్నాడు అంటూ జరిగింది అంతా చెప్పింది.అది విన్న పరమేష్ నా ఇంట్లో కిరాయికి ఉంటూ నా కుతుర్నే మాటలు అంటాడా, వాడిని ఇప్పుడే ఖాళీ చేయిస్తా అంటూ కోపంగా బయటకు వెళ్ళాడు.

చేయిస్తారు.చేయిస్తారు వాడు ఇచ్చే కిరాయి డబ్బుతోనే మనమిప్పుడు మూడు పూటలా తింటున్నాం వాడిని ఖాళీ చేయిస్తే అది కూడా ఉండదు అంది తల్లి పరమేశ్వరి.దాంతో ఇద్దరూ నోర్లు మూసుకుని లోపలికి వెళ్లి పోయారు. ఖాళీ చేయిస్తాడు అంట,చేసే పనేమీ లేదు కానీ, మాటలు మాత్రం  కోటలు దాటుతున్నాయి అంటూ బయటకు నీళ్లు తేవడానికి వెళ్ళింది పరమేశ్వరి..

పరమేశ్వరి,పరమేష్ ఒక్కగానొక్క కూతురు దేవి,పరమేష్ చాలా అమాయకుడు అని చెప్పేకంటే వెర్రి బాగుల వాడు అనడం కరెక్టు అనవచ్చు, పాపం పరమేశ్వరే తన ఇంటిని,భర్త ని కిరాణా షాపు పెట్టి,వారిని పోషిస్తుంది. ఒక్కతే కూతురు కావడం వల్ల చిన్నప్పటి నుండి బాగా చిరు తిండి తినడం అలవాటయ్యి,తిన్నా కూడా సరి అయినా వ్యాయామం లేక పోవడంతో  కాస్త బొద్దుగా తయారయ్యింది దేవి..

చిన్నప్పుడు బాగానే అనిపించినా ఇప్పుడు పెళ్లి చేయాలని చూస్తున్న లావు వల్లనే ఒక్క సంబంధం  కూడా కుదరడం లేదు. లావు వల్లనే కుదరడం లేదనే అందరూ అనుకుంటున్నారు.దానికి తగినట్లుగా దేవి కూడా ఇంకా లావు అవుతుందే తప్ప సన్నగా అవ్వడం లేదు.ఇది ఇప్పటి వరకు ఉన్న  దేవి పరిస్థితి.. 

ప్రస్తుతం అమ్మా ఆకలే అంది దేవి, అమ్మా తల్లి ఇంతకు ముందే కదా గిన్నెడు అన్నం తిన్నావు ఇంకా నన్ను తిను. అయినా నికేమైన బుద్ధి ఉందా,ఇలా తింటూ కూర్చుంటే ఇంకా లావు అయిపోతే,ఇక నీకు పెళ్లి ఎలా అవుతుందే మీ అబ్బా కుతుర్లను పోషింస్తూ నేను చావడమే తప్పితే మీ ఇద్దరికి బుద్ధి రాదు.

అయినా చదివిన చదువుకు ఒక ఉద్యోగం వెతుక్కోవలన్న ఇంగిత జ్ఞానం అయినా నీకుందా,మీ నాన్న గారంటే వెర్రి బాగుల వాడు కాబట్టి ఆయనకు తెలివి లేదు. మరి నికేమయ్యిందే,అంతా చదువు చదువుకున్నావు,అయ్యో పాపం నా తల్లి కష్టపడుతుందే అని కూడా ఆలోచన లేదు. 

పైగా ఇంట్లో కూర్చుని అది కావాలి,ఇది కావాలి అంటూ ఆర్డర్ లు వేస్తున్నావు నువ్వు ఇలా తింటూ ఉంటే నీకు పెళ్లి కావడం కష్టం,ఇదిగో నేను లాస్ట్ గా చెప్తున్నా మంచి జాబ్ సంపాదించుకో,

అలాగే సన్నగా అయ్యి,నీ పెళ్లి నువ్వే చేసుకోవాలి,అది కూడా కట్నం లేకుండా,వాళ్ళు అడగకుండా చూసుకోవాలి అంటే నువ్వు సన్నగా,మెరుపు తీగల మారితే అది ఏమంత కష్టం కాదు.

నీకు తెలియడం లేదు కానీ నువ్వు చాలా అందంగా ఉంటావు.ప్రయత్నం చెయ్యి తల్లి,ఇంకా మిమల్నిభరించడం నా వల్ల కాదు ఇది మాత్రం ఖచ్చితంగా జరగాలి.మూడు నెలల్లో నువ్వు బరువుతగ్గి,ఉద్యోగం కూడా సంపాదించుకోవాలి. ఇదే నీకు నేనిచ్చే పనిష్మెంటు అనుకో..

ఇప్పటి నుండి నీకు ఇంట్లో ఒక్క పూట మాత్రమే భోజనం పెడతాను,రెండో పూట నీకేమి పెట్టను.నీ భోజనం నువ్వే సంపాదించుకో అని సీరియస్ గా చెప్పి,లోపలికి వెళ్ళిపోయింది పరమేశ్వరి.

పుట్టినప్పటి నుండి తనని ఒక్క మాట కూడా అనకుండా,తాను ఏదీ అడిగినా వండి పెడుతూ, తన భర్త వెర్రిబాగుల వాడు అయినా కష్టపడి షాపు నడుపుతూ,తన మాటకారి తనం తో,తనని తాను పాడు సమాజం నుండి కాపాడుకుంటూ,తన కూతుర్ని కూడా  కాపాడుకుంటున్న

తన తల్లి రోజు ఇలా ఇంతలా తన గురించి బాధ పడుతుందని తెలిసిన దేవి అవాక్కయింది తర్వాత రియాలిటీ కి వచ్చి,తమ పరిస్థితి ఏమిటో గుర్తించింది. తానూ మారాలని ఆనుకుంది,ఒక నిర్ణయం తీసుకున్నట్టు గా గట్టిగా శ్వాస తీసుకుని,వదిలి ,తన గది లోకి వెళ్ళింది.

తెల్లారి మూడు గంటలకు  ఇంట్లో అలారం మోగింది.లైట్స్ వెలిగాయి. ఎప్పుడో కొన్న  జాగింగ్ డ్రెస్ ని పట్టకున్న ఎలాగో వేసుకుని,షూస్ వేసుకుని బయటకు వచ్చింది దేవి.చప్పుడు కాకుండా తలుపులు తీసి,జాగింగ్ కు బయల్దేరి వెళ్ళింది.కొంచం దూరం వెళ్ళగానే ఆయాసం వచ్చి ఆగిపోయింది.

ఇంతలో కొత్తగా తమకు పోటీ గా ఎవరో వచ్చారని భావించిన ప్రాంతపు కుక్కలు దేవి మీదకి బౌ మంటూ తమ గళాన్ని పెంచి,మొరగసాగాయి. అసలే ఆయాసం,దానికి తోడు కుక్కలు అంటే భయం వల్ల ఒక్కసారిగా భయపడి,ముందుకు ఊరికింది.అలా పరుగెత్తి,పరుగెత్తి  ఇంటి లోపలకు వచ్చి,ఇక పరుగెత్త లేక పడిపోయింది దేవి..

ఆమె కాళ్ళు,చేతులు,మొఖం అన్ని అన్ని చెమటతో తడిచిపోయాయి.డ్రెస్ అక్కడక్కడా చిరిగింది. అంత లావున్న దేవి కింద పడడం వల్ల వచ్చిన శబ్దానికి ఇంట్లో బెడ్ మీద పడుకున్నా పరమేష్  కింద పడిపోయాడు.పరమేశ్వరి ఎగిరి పడింది. ఏంటో శబ్దం అంటూ బయటకు వచ్చి చూసిన వారికి అక్కడ గేట్ దగ్గర కింద పడి కొట్టుకుంటున్న  దేవి కనిపించింది.

అయ్యో తల్లి నీకేమైయ్యిందే అంటూ తల్లి వచ్చి ఆమె చెంపల మీద తడుతూ,ఏమండి వెళ్లి నీళ్లు తీసుకుని రండి అంది భర్త తో,పరమేష్ వెళ్లి నీళ్లు తీసుకుని వచ్చాడు. నీళ్లు దేవి మొఖం పైన చల్లింది పరమేశ్వరి. చన్నీళ్ళు మీద పడడం వల్ల మెలకువ వచ్చిన దేవి చుట్టూ చూసి తన తల్లి ఒడిలో ఉండడం చూసి,

గబుక్కున లేచి కూర్చుంది. ఏంటి ఇది నువు ఇంత ప్రొద్దున లేవడం ఏంటి,ఇలా వెళ్లడం ఏంటి అని అన్నది తల్లి. అది అమ్మా,నేను జాగింగ్ కి వెళ్లాను అని చెప్పి,నాకేం అవ్వలేదు గాని మీరు కంగారు పడకండి అని అంటూ అతి కష్టం మీద కింద నుండి లేచి,తన గది లోకి వెళ్ళిపోయింది దేవి. సరిలేమ్మాని ఇద్దరు వెళ్లి పడుకున్నారు ఎప్పటిలా..

గది లోకి వెళ్లిన దేవి ఊరికే ఉండలేదు. తన ఫోన్ లో పాటలు పెట్టుకుని వింటూ,తన రూమ్ లోనే చిన్నగా జాగింగ్ చేస్తూ,ఇక ముందు బయటకు వెళ్లకూడదు అని గట్టిగా నిర్ణయించుకుంది. తర్వాత తనకు అత్యంత మంచి మిత్రురాలు అయిన సుధ దగ్గరకు వెళ్ళింది. చాలా రోజులకు వచ్చిన స్నేహితురాలికి చూసిన సుధ,ఏంటి ఇలా వచ్చావు అని అడిగింది దేవి ని ,

దేవి జరిగినదంతా సుధ తో చెప్పి,బాధ పడింది. సుధ దేవిని ఓదార్చి,అబ్బా అలా భాద పడుతూ  కూర్చుంటే నీకు ఉద్యోగం రాదు కదా,దానికి ప్రయత్నం చేయాలి అని అంటూ కొన్ని అప్లికేషన్లు నింపి,పద ఆఫీసులలో ఖాళీ ఉందట,ఇవ్వన్నీ ఇచ్చి వద్దాం అంటూ తన బండి మీద బయలుదేరి వెళ్లారు ఇద్దరూ

అక్కడ ఆఫీస్ లో ఆమె సర్టిఫికెట్ లు చూసి అందరూ ఆశ్చర్య పోయారు.కారణం దేవి అన్నింటి లోను ముందుగా రావడమే చాలా వాటిలోను ఆమె తన ప్రతిభను కనపర్చింది.అవన్నీ చూసి,ఆమె ని చూసారు వాళ్ళు అంత లావుగా  ఉన్న ఆమెలో ఇంత ప్రతిభ దాగుందా అన్న తలంపు వారిలో స్పష్టంగా కనిపించింది.

చూడమ్మా నీలో చాలా టాలెంట్ ఉంది.మాకు కావాల్సింది నీ టాలెంట్ ,కాబట్టీ నీకు ఉద్యోగం ఇస్తున్నాం,కానీ  నువ్వు ఆఫీస్ కు వచ్చి పని చేస్తే అందరూ నిన్ను,నీ లావుని  గురించి మాట్లాడుకోవడం మొదలు పెడతారు. దాంతో పని చేసే సమయం తగ్గిపోయి,మాకు నష్టం వస్తుంది 

దీనికి మీ దగ్గర వేరే ఆప్షన్ ఏమైనా ఉంటే చెప్పండి . ఉద్యోగం మీదే అని చెప్పడం తో, ఉద్యోగం వచ్చింది అనే సంతోషం కొంచం లో మిస్ అయ్యింది ఇద్దరికి.

అదేంటి సర్ ఇస్తున్నాం అని అంటూనే మళ్ళీ ఇవ్వము అని చెప్తున్నారు అంది సుధ. అవునమ్మా నువ్వే ఆలోచిoచు నిజమే కదా,నువ్వు ఆఫీస్ కి రావడం వల్ల రోజులో రెండుగంటలు అయినా నీ గురించి మాట్లాడుకుంటూ సమయాన్ని వృధా చేస్తారు.

కాబట్టి నువ్వు ఆఫీస్ లో ఉండి పనిచేయడానికి లేదు.అలా అని నిన్ను ఇక్కడ అపాయింట్ చేయలేము,మరి ఎలా అన్నది నువ్వే ఆలోచించి చెప్పు నువ్వు ఎలా చెప్తే అలా చేయడానికి మేము సిద్ధం అన్నారు ఎం.డి గారు.

ఒక్క నిమిషం ఆలోచించిన దేవిసర్ నేను ఇంట్లో నుండే పని చేస్తాను.నాకు మీరు ఎంత వర్క్ ఇచ్చినా ఇంట్లో ఉండి చేయగలను.అందువల్ల మీకు సమస్య లేదు కదా,నేను చేసిన పని అంతా మీకు మెయిల్ లో పంపిస్తాను. మీ కంపనీ యాడ్ లను కూడ రెడి చేస్తాను,కానీ నాకు ఉద్యోగం చాలా అవసరం సర్ అని బతిమలింది దేవి.”

అమ్మా దేవి నువ్వు చేప్పిన ఆలోచన బాగుంది. అలాగే నీకు ఉద్యోగం ఇస్తాము.నువ్వు పనిలో ప్రతిభను చూపించు.నీకు ఉద్యోగం ఎంత అవసరమో,మాకు టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా అంతే అవసరం,నిన్ను వదులుకోలేక ఉద్యోగం ఇస్తున్నాం,కాబట్టి నీ టాలెంట్ ని చూపించు,

అని అంటూ ఆమె జాయినిoగు పేపర్లు ఇచ్చి,అవసరమైన కాగితాల మీద సంతకాలు తీసుకున్నారు. తర్వాత ఆమె పని చేయాలో ఆమెకు వివరంగా చెప్పారు. అన్నిటికీ తలూపింది దేవి.

సంతోషంగా బయటకు రాగానే సుధ దేవితో ఇన్ని రోజులు నీ చదువుని,తెలివి ని ఉపయోగించలేదు. ఇప్పుడు ఉపయోగించే అవసరం వచ్చింది.దాన్ని మంచిగా వాడుకో,  అవన్నీ సరే నే కానీ నేను లావు తగ్గాలి, సన్నగా అవ్వాలి అలా చేయాలి అంటే మా ఇంట్లొ  ఉండి చేయడం కుదరదు. కాబట్టి ఇంకెక్కడైనా ఉండి ప్రయత్నించాలి.

అవును జిమ్ లో చేరితే సన్నగా అవ్వచ్చు కదా అంది ఆశగా దేవి. నిజమే కానీ జిమ్ కి నువ్వు వెళ్ళాలి కదా అంది సుధ అలా కాదే నీకు ఎవరైనా తెలిస్తే చెప్పు,ఇంట్లోనే వర్క్ అవుట్లు చేసేలా  మాట్లాడుకుందాం అంది దేవి.

అమ్మా తల్లి ముందు నువ్వు ఉద్యోగం చేసి ఒక నెల జీతం వచ్చాక లావు తగ్గడం గురించి ఆలోచించు,ఇప్పుడు అదేం ఆలోచించకు హాయిగా ఇంటికి వెళ్లి ఉద్యోగం సంగతి మీ వాళ్లకు చెప్పి,నచ్చింది చేయించుకుని తిను అని సుధ దేవిని వాళ్ళింటి దగ్గర వదిలేసి,తన ఇంటికి వెళ్ళిపోయింది….

తల్లిదండ్రుల కు తన ఉద్యోగం గురించి చెప్పిన దేవి తల్లి మెచ్చుకునే చూపులని అబ్బురంగా చూసింది.తండ్రి అయితే చిన్న పిల్లడిలా గంతులు వేస్తూ మా అమ్మాయికి ఉద్యోగం ,మా అమ్మాయికి ఉద్యోగం అంటూ సంబర పడ్డాడు.పరమేశ్వరి దేవి కి ఇష్టమైన స్వీట్ చేస్తాను అంది.

వద్దమ్మా నాకు ,మీరు ఆనందంగా ఉన్నారు అది చాలు అంది. దానికి పరమేశ్వరిఏంటి దేవి నేను తిట్టను అని కోపం వచ్చిందా తల్లి ,అందుకేనా ఏమి వద్దు అంటున్నావు, నేను ఏం చేయనమ్మ ఇన్ని రోజులుగా నేను అనుభవిస్తున్న విసుగుని నీ మీద చూపించాను,మీ నాన్నని నాకు కట్టబెట్టారు.

పెద్ద వాళ్ళు,ఏమి అనలేని  పరిస్థితి నాది అందుకే విసుగుని నీ మీద చూపించాను అంది పరమేశ్వరి.”” “అయ్యో లేదమ్మా నన్ను కాకపోతే నువ్వు ఇంకెవర్ని అంటావు. నీకు నేను తప్ప ఇంకెవరు ఉన్నారు అని తల్లిని కౌగిలించుకుoది.దేవి ప్రేమకు పరమేశ్వరి కరిగిపోయిoది.”

అలా రోజులు గడిచిపోతున్నాయి. దేవి రోజు పొద్దున్నే సుధ వాళ్ళింటికి వెళ్లి,అక్కడ నుండి తన ఆఫీస్ పని చేస్తుంది.ఇంట్లో ఉద్యోగం అని ఆఫీసుకు వెళ్లకుండా ఉంటే వారు అది అబద్దం అనుకుంటారు అని భావించి,పొద్దున్నే అలా సుధ వాళ్ళింటికి వెళ్తుంది దేవి.అలా మూడు నెలలు గడిచాయి.

ఒక రోజు దేవి ఇంటికి వచ్చి,అమ్మా నాకు వేరే బ్రాంచి,వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యింది. వెళ్ళాలి అని తల్లి తో చెప్పింది. దానికి పరమేశ్వరి అలా ఒక్కదానివి ఎలా వెళ్తావు,మేము కూడా నీతో పాటు వస్తాం అని అంది. లేదమ్మా ఇక్కడ షాప్ ను వదిలేసి ఎలా వస్తావు

అని తల్లిదండ్రుల ను ఒప్పించి,తాను ఒక్కతే వెళ్ళిపోయింది దేవి వేరే ఊరికి.ముందు వద్దు అని అన్నా దేవి,సుధ సర్ది చెప్పడం వల్ల వారు ఒప్పుకున్నారు.అలా దేవి మొదటి సారి గా తల్లిదండ్రులను వదిలేసి బదిలీ పేరుతో వేరే ఊరికి వెళ్ళింది...

ప్రతి నెలలో జీతాన్ని,తన తల్లిదండ్రులకు పంపిస్తుంది దేవి. ఫోన్ లో మాట్లాడ్డం చేస్తూ ఉండేది దేవి. అలా సంవత్సరం గడిచింది. సంవత్సరం గడిచిపోతున్న కూతురు రాకపోవడంతో,దేవి మీద బెంగ పెట్టుకున్న పరమేష్  సన్నగా అవ్వసాగాడు.

అది చూసి పరమేశ్వరి కూతురికి ఫోన్ చేసి తండ్రి దిగులు పడుతున్నాడు అని,తనని రమ్మని చెప్పింది. సరే వస్తాను అని అంది దేవి.అలా మూడు రోజులు గడిచాయి..

ఒక రోజు పొద్దున్నే  ఇంటి ముందు టాక్సీ ఆగింది.అప్పుడే షాపు తీస్తున్న పరమేశ్వరి తామిoటి ముందు ఆగడం చూసి ఎవరా అని ఆనుకుంది. టాక్సీ లోనుండి ఒక  అందమైన అమ్మాయి దిగింది. ఆమెని చూస్తున్న పరమేశ్వరి అబ్బా ఎంత బాగుంది మెరుపు తీగ లా అని అనుకోకుండా ఉండలేకపోయింది.

ఇలా తన కూతురు కూడా అయితే ఎంత బాగుండు అని ఆనుకుంది మనసులో,దిగి చుట్టూ చూస్తున్న అమ్మాయి దగ్గరకు వెళ్లి ఏవరమ్మా ఎవరు కావాలి అని అడిగింది. చుట్టుపక్కల వాళ్ళు కూడా అమ్మాయిని చూస్తున్నారు.

  అమ్మాయి పరమేశ్వరి ముందుకు వచ్చి, ఆమె ని కౌగిలించుకుని అమ్మా నేను దేవి ని అని అంది. ఏంటమ్మా నువ్వు మా దేవి వా ,నన్ను ఆట పట్టించడానికి మా అమ్మాయి పంపిందా, నేనే దొరికేనా,అయిన మా అమ్మాయి ముద్దుగా,బొద్దుగా ఉంటుంది,

నువ్వేoటి ఇలా ఉన్నావు అంది. అంటే మీ అమ్మాయి ఇలా కాకూడదు అని అనుకుంటున్నారా అంది అమ్మాయి..

అయ్యో లేదమ్మా అయితే సంతోషమే కదా అంది తల్లి, అయితే నేనే నీ కూతుర్ని సరిగ్గా చూడు నన్ను అంటూ కళ్ళద్దాలు తీసింది.

పరమేశ్వరి అమ్మాయిని తడిమి చూసి, అవును దేవి నువ్వు నువ్వేనా,ఏంటి ఇది ఇలా ఎలా మారవు అంటూ సంతోషంగా, చుట్టుపక్కల వారికి గట్టిగా మా అమ్మాయి,మా అమ్మాయి దేవి ని  చూడండి అంటూ చెప్పసాగింది.

ఇంతలో కారు లలో  నుండి  సుధ దిగి,ఏంటి ఆంటీ ఇలాగే నిలబెడతారా ఇంట్లోకి పీలుస్తారా అంటూ హాస్యం ఆడింది. అయ్యో ఉండండి అని లోపలికి వెళ్లి హారతి తీసుకుని వచ్చి,బిడ్డకు దిష్టి తీసి,లోనికి తీసుకుని వెళ్ళింది.

అందరూ ఇంట్లో కూర్చున్న తర్వాత ఏంటమ్మా ఇది నువ్వు ఇలా ఎలా మరిపోయావు అంది సంతోషంగా తల్లి ,అమ్మా దానికి కారణం మన సుధ నే,సుధ కె క్రెడిట్ అంతా దక్కుతుంది అంటూ సుధ వైపు ఆప్యాయంగా చూసింది..,

అవునా అంత గమ్మత్తు,మేము చేయలేనిది నువ్వు ఏం చేసావు సుధ అంది పరమేశ్వరి. అయ్యో ఏమి లేదాoటి,మంచి జిమ్ ట్రైనర్ ని చూపించాను, ఆహారం విషయం లో నేను దగ్గర ఉండీ,కఠినంగా వ్యవహరించాను.అది కాక తనకు కూడా తగ్గాలని ఉండడం కూడా సన్నగా అవ్వడానికి కారణం అయ్యింది అంటూ అసలు విషయం చెప్పింది సుధ.. 

అంతా విన్న తర్వాత తల్లిదండ్రులు ఇద్దరూ ఏదీ ఏమైనా మా కూతురు పట్టుదలతో,నీ సహకారంతో తన లావుని తగ్గించుకుంది. అది చాలు మాకు అని అన్నారు. ఇంతలో తండ్రి స్వీట్ తెచ్చి,దేవి నోట్లో పెట్టబోయాడు అమ్మో మళ్ళినా అంటూ భయం నటించింది దేవి. అందరూ హాయిగా నవ్వుకున్నారు….

Related Posts

2 Comments

  1. కథ కథనం బాగుంది మంచి స్ఫూర్తి దాయకంగా వుంది ఆత్మ విశ్వాసం పట్టుదల అలోచన రీతి వుంటే మనం అనుకున్నది సాధించవచ్చు అని కథ సారాంశం తెలుపుతుంది మీ శైలి రీతి బాగుంది… ఎర్రిబాబులోడైనా ఓ మంచి కూతురినే కన్నాడు కదా…. అలా అని ఏమి ఉండదు కొందరి స్వభావం తీరు కొన్ని విషయాలలో ఆలోచన సరిగ్గా ఉండదు వాళ్ళు కొన్ని విషయాలలోనే అలా అన్నింట్లో కాదు… ఏమి తెలియనిదే పెళ్లి పెళ్ళాం సంసారం పిల్లలు ఇవ్వన్ని వుండవు కదా కాబట్టి కొన్నిటికే వాళ్ళు అలా పరిమితం అని నా భావన…!!

Comments are closed.