లీల నాకు తెలిసిన 1 ( నిజమైన సంఘటన )

లీల

 

ఇప్పుడు నేను రాస్తున్న ఈ కథ 1980 కంటే ముందే జరిగిన కథ కాబట్టి అప్పటి పరిస్థితులు అనుకూలంగా మలుచుకునిరాయడంమొదలుపెడుతున్నా…

అమ్మా లీల కాస్త పెద్దమ్మ ఇంటికి వెళ్లి కొంచం కంది పప్పు అడిగి తీసుకుని రా నాన్న గారు తేగానే ఇచ్చేస్తాను అని చెప్పు అంటూ గ్లాస్ చేతికి ఇచ్చింది.

 

సరోజ ఏ ఎప్పుడూ వాళ్ళ ఇంటికి వెళ్ళి అది తీసుకురా ఇది తీసుకురా అని అంటూ నన్ను సంపుటవు ఇలా ప్రతి రోజూ అడుక్కుని  తినే బదలు అసలు చావడం నయం మీకు సిగ్గుగా అనిపించడం లేదా ఎందుకు ఇలా అడగడం అడుక్కుని తినే పరిస్థితి లో ఉన్న మీరు మమల్ని ఆరుగురిని ఎందుకు కన్నారు.

 

ఎవరు కనమన్నారు మేము అడిగామా కనమని ఇలా ఎన్నో అనాలని ఉన్నా ఏమీ అనలేక పోయాను glass తీసుకుని మౌనంగా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నన్ను నా గ్లాస్ నీ చూడగానే దీనికేం తక్కువ లేదు

 

మేము తినేది పిడికెడు ఇచ్చేది గిద్దేడు అంతగా లేకపోతే అడుక్కు తినాలి కానీ అరుపులు ఎందుకమ్మా ఎవర్నీ ఉద్ధరించడానికి ఈ జన్మలు అంటూ బాకుల్లాంటి మాటల తో పొడుస్తున్న అవి గుండెల్లో గునపాలు దింపుతున్నారు చెల్లెళ్ళ మొహాలు గుర్తొచ్చి మౌనంగా నిలబడ్డాను.

 

గ్లాసు తో పప్పు ఇచ్చి దీనితో లక్షా తొంభై కిలోల పప్పు ఇచ్చి ఉంటా అన్ని గుర్తుంచుకుని ఇస్తారా చేస్తారా మా ఖర్మ అంటూ లోపలికి వెళ్ళింది ఏం మాట్లాడకుండా బయటకు వచ్చాను గబగబా ఎక్కడ ఏడుస్తానో అని. ఇలా ఎన్ని రోజులు కష్టాలుపడాలి.

 

నాన్న తాగుబోతు అమ్మ చూస్తే అక్కాచెల్లెళ్లు అంటూ వారి చుట్టే తిరగడం ఇక తమ్ముడు చెల్లెళ్ళు చిన్నవాళ్ళు వారికి కడుపునిండా తిండి కూడా పెట్టలేని స్థితిలో ఉన్నారు.

 

తండ్రి నీ చూస్తుంటే చిరాకు కోపం ఏదో చేయాలి అనే కసి పుట్టుక వస్తుండడంతో పాటూ స్కూల్ కి వెళ్ళాలి అంటే లంగా ఓణీ ఒక్కజతే ఉన్నాయిఇంటికిరాగానే అవివిడిచి పాతపంచె కట్టుకుని ఇంట్లోనే ఉంటారు మళ్ళీ తెల్లారే
బయటకు వెళ్ళడం .

 

తినడానికి తిండి ఉండదు కట్టుకోడానికి బట్ట ఉనడదు, మంచి పుస్తకాలు ఉండవు అందరి ఇళ్ళలో ఎంతో ప్రేమగా ఉంటారు కానీ మా ఇంట్లో మాత్రం ప్రొద్దున లేస్తే ఎఅరి దగ్గర అప్పు తెచ్చుకోవాలె అని ఆలోచించడం తిఊనే సరిపోతుంది.

కడుపేలా నిండుతుంది , బట్ట ఎలా ఈ పూట ఎలా గడుస్తుంది అనే ఆలోచనే తప్ప పిల్లలకు మంచి ఆహారం పెట్టాలి మంచి బట్ట చదువు ఇవ్వాలి అని ఏ కోశాన కూడా ఆలోచన లేనీ నా తల్లిదండ్రులను చూస్తుంటే జీవితం లో ఏది దొరుకుతుందో లేదో అనేది తెలియడం లేదు.

 

వీళ్ళు కనీస అవసరాలు తీర్చడం లేదు.  ఇక పెళ్ళిళ్ళు ఏం చేస్తారు . ఎక్కడినుండి మంచి వాళ్ళను తెస్తారు ఒక వేళా తెచ్చినా చేసినా కూడా ఏ రెండో సంభందం మూడో సంభందం తెచ్చి చేస్తారేమో ఇలాంటి ఆలోచనలతో నాకు నిద్ర పట్టడమే లేదు.

 

చివరికి చాలా అలోచించి అలోచించి ఎలాగైనా బాగా డబ్బు సంపాదించి కడుపు నిండా తినాలి కంటి నిండా నిద్ర పోవాలి చెల్లెళ్ళకు మంచి  తిండి అయినా పెట్టాలి అని అనుకుంటూ దానికి ఏదైనా దారి వెతకాలి అనుకుంటున్నా సమయం లో ఒక రోజు బియ్యం తేవడానికి దుకాణం కు వెళ్ళింది లీల .

 

ఆ దుకాణం లో ఉన్న సేటు కు ఎన్నో రోజుల నుండి లీల పై కన్ను వేసాడు ఇప్పుడు మిట్ట మధ్యానం షాప్ లో ఎవరు లేరు దాంతో అతను లీల చేయి పట్టుకున్నాడు లీల అది చూసి అర్ధం చేసుకుంది.

 

ఎందుకంటే అనుభవం అన్ని లీలకు నేర్పింది కాబట్టి ఎక్కువ బెట్టు చేయకుండానే నవ్వుతూ సామాను ఇవ్వండి ముందు అంది.  అతను లీల ను అర్ధం చేసుకున్నాడు వెంటనే సామాను అంత ఇచ్చాడు లీల దాన్ని తీసుకుని వెళ్లి తల్లికి ఇచ్చింది.

 

తల్లి ఎక్కడిది ఇది అని అడగలేదు తను కూడా అర్డంచేసుకుంది సామాను తీసుకుని లోపలి కి వెళ్ళింది మౌనంగా లీల వెనకాలే వచ్చిన సేటు తలుపులు మూసాడు లీల ఆకలి అతని ఆకలి తీరింది .

 

ఇక అప్పటి నుండి తన ఆకలిని తీర్చిన వాళ్ళను లీల సంతోష పెట్టసాగింది ఈ విషయం తెలిసినా ఎవరూ ఏం అనలేక పోయారు. తెలిసినా తెలియనట్టుగా ఉండి పోయారు ఇంట్లో నలుగు వెళ్ళు లోపలి కి వెళ్తున్నాయి అందరికి.

 

ఇంతలోనే తన కంటే చిన్నది అయినా శారద కు రెండో సంభందం చూసి పెళ్ళి చేసారు తాత అమ్మమ్మలు దాంతో లీల గుండెల్లో రాయి పడింది.

 

తనకేక్కడ ఇలాగె రెండో, మూడో సంబందo చేస్తారో అని అప్పటికే తన టైప్ పరీక్షా పాసు అవడంతో పాటు ఇంటర్ పాసు అయ్యింది దాంతో ఒక స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం వెతుక్కుంది.

 

ఇప్పటికే మనసు శరీరం రెండు చాలా శ్రమ పడ్డాయి శారీరకంగా మానసికంగా బాగా నలిగిపోయింది లీల దాంతో తన మనసులో ఏవేవో ఆలోచనలు, ఏవేవో కోరికలు తన తల్లిదండ్రి అక్క చెల్లెళ్ళు తమ్ముడు అందరూ తనని వాళ్ళ స్వార్దానికి ఉపయోగించుకున్నారు. ఇప్పుడు తనదే తప్పు అన్నట్టుగా మాట్లాడారు అప్పుడు శరీరం పాడు చేసుకుని తెచ్చి పెడితే తిన్న వాళ్ళు ఇప్పుడు మేము చేయమన్నామా అంటూ ఎదురు మాట్లాడుతున్నారు .

 

ఇప్పుడు తమ్ముడు హోటల్ లో పని చేస్తూ సంపదిచడం తో అమ్మ కూడా వేరేగా మాట్లాడం మొదలు పెట్టింది. తనని చూస్తేనే చిరాకు పడుతుంది.

 

కానీ ఇప్పుడు తప్పించుకుని తిరుగుతుంది అప్పుడు ప్రేమగా మాట్లాడింది ఇప్పుడు అసలు పట్టించుకోవడమే లేదు. అప్పుడు ఏమో నేను డబ్బు తెస్తే తాను అన్ని విధాలా వండి పెట్టింది.అన్ని చేసి పెట్టింది.

 

కానీ ఇప్పుడు తమ్ముడు సంపాదించగానే మిగతా పిల్లల పరిస్థితి గురించి ఆలోచిస్తుంది మరి నా గురింఛి ఎందుకు ఆలోచించడం లేదు నేను మనిషిని కానా ? నాకు పెళ్ళి అవసరం లేదా ? నాకు కోరికలు లెవా ?

 

అప్పుడే నేను సామాను తెచ్చినప్పుడే ఇది వద్దు అని అనలేదు ఎందుకని ? ఇప్పుడేమో తాను తప్పు చేసినట్టుగా చూస్తోంది ..ఇంతకీ

 

తానూ చేసిన తప్పేంటి కన్నవారి, తోడ పుట్టిన వారి ఆకలి తీర్చాలని అనుకోవడమే తన తప్పా ? తానేం ఒళ్ళు కొవ్వెక్కి చేయలేదుగా ? వాళ్ళ ఆకలి తీరాలని కోరుకోవడమే తాను చేసిన తప్పా ?

 

ఒకప్పుడు తాను తెస్తేనే తినే వాళ్ళు ఇప్పుడు కాస్త అవసరం తీరగానే ఇలా నన్ను చులకన చేస్తారా ? ఇక్కడ స్వార్ధం ఎవరిది నాదా ? వాళ్లదా ? ఛి ఇంత చేసినా నా వాళ్ళు నన్ను ఇలా మాట్లాడతారా ?

 

అందుకే ఎవరికీ ఏది చేయకూడదు నా జీవితం నాశనం చేసుకుని నేను బావుకున్నది ఏంటి ? ఇలా నన్ను ఈ క్షణం ఎంతో చెడ్డ దానిగా అందరి ముందు చిత్రించడం ఎందుకు ?

 

అటూ చూస్తే చెల్లి కడుపు పెట్టుకుని వచ్చింది కానీ ఇంకా తన అక్కకు పెళ్ళి కాలేదని అందరూ నన్నే అంటున్నారు ఇక నేను వీళ్ళ గురించి జీవితం లో ఆలోచించ లేను ఇక వీళ్ళ గురించి బాధ పడడం దండగ అందితే జుట్టు , అందకా పోతే కాళ్ళు పట్టుకునే వీళ్ళ గురించి జీవితం లో ఆలోచించడం అసలు వీళ్ళు ఉన్నారనే ఉహ కూడా నాకు రాకూడదు.

 

అందుకే నేను ఇక నా గురించి మాత్రమే ఆలోచించాలి నేనే నా గురించి పట్టించుకోవాలి వీళ్ళ కు దూరంగా వెళ్ళాలి అయితే ఎదో ఒక తప్పు చేసి కాకుండా గౌరవంగా వెళ్ళాలి అని ఇలా ఆలోచించిన లీల

 

అదే స్కూల్ లో పనిచేస్తున్న సతీష్ అనే తమ కులం వాడిని ప్రేమించింది. అతనితో తన కుటుంబ పరిస్థితిని అంతా చెప్పింది పెళ్ళి చేయలేరు అని చెప్పి అతన్ని గుట్టుగా రిజిస్తర్ మారేజీ చేసుకుని దండలతో ఇంటికి వచ్చింది.

 

అది చూసి తల్లి శాపాలు పెడితే తండ్రి  కులం వాడిని చేసుకున్నందుకు సంతోషించి చిన్నగా  దావత్ లాంటిది చేసి చుట్టలందరికి తెలిసేలా చేసుకున్నారు.

 

ఆ తర్వాత అదే ఊర్లో వేరు కాపురం పెట్టిన లీల తన వాళ్ళు ఎన్ని బాధలు పడుతునా ఏమవుతున్నా తన దగ్గరికి సహాయం కోసం ఎవరు వచ్చినా అసలు పట్టించుకోవడం మానేసింది

 

కొన్నాళ్ళకు అత్తగారు చనిపోవడం తో మామయ్యను చూస్ఉకోవడానికి అత్తగారింటికి వెళ్ళిన లీల తిరిగి ఎప్పుడూ తన వాళ్ళను చూడడానికి రాణే లేదు తమ్ముడి చెల్లెళ్ళ పెళ్లిళ్లకు మాత్రం చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళేది.

 

తండ్రి తల్లి చనిపోయినా ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది . ఇప్పుడు తన ఇద్దరి పిల్లలతోను భర్త తోనూ హయిగా ఉంది కోడలు కూడా వచ్చింది ఇప్పుడు ఎవరికీ ఆమె ఎక్కడుందో అసలు తెలియదు .

 

అక్కని చూడాలని చెల్లెళ్ళు వెళ్ళాలి అనుకుంటే మేము లేము రాకండి అనే చెప్పేది మొహం మీద దాంతో ఎవరు ఆమె నీ చూడడానికి వెళ్ళేవాళ్ళు కాదు.

 

లీల ఇలా చేయడానికి కారణాలు కేవలం తల్లి దండ్రుల ప్రవర్తన కారణం అని నేనంటాను? ఒక అమ్మాయి తన వాళ్ళందరిని నిర్ధాక్షిణ్యంగా వదిలేయడానికి, ఎంత మానసిక వేదన పడితే తానూ ఆ నిర్ణయం తీసుకుంటుంది ?

 

ఎంత బాధని అనుభవించి ఉంటుంది ? వాళ్ళు ఎలా ప్రవర్తించి ఉంటారో ? ఎంత ఘోరమైన మాటలు అని ఉంటారో వివరంగా చెప్పాలి కానీ ఇది చాలా సున్నితమైన విషయం.

 

నిజంగా జరిగిన ఘటన అందుకే వివరంగా వివరించలేదు. ఇప్పుడు ఇది వారి కుటుంబంలో వాళ్ళు అంటే చెల్లి కానీ తమ్ముడు కానీ చదివితే వాళ్ళ మనో భావాలూ ఎలా ఉంటాయో ?

 

వాళ్ళు ఇదంతా ఖండించి మాకేం తెలియదు అని అంటారా ? ఆ అంత సీన్ లేదు అదే కొవ్వు ఎక్కువై చేసిందని తప్పించుకుంటారా , నిజానికి అబద్దానికి ఎంత తేడా ?

 

ఒకవేళ వాళ్ళు కళ్ళతో చూసినా కూడా దాని వెనక ఏ కారణాలు ఉన్నాయో వాళ్ళకు తెలుసా ? ఎందుకంటే అప్పటికి వాళ్ళు చిన్న వాళ్ళు కాబట్టి ఇదంతా నిజమే అనుకుంటారా ?

 

ఇప్పుడు లీల నీ వివరణ అడిగితే తను నిజాలు చెప్పి తన కుటుంబం ముందు బయట పడుతుందా ? అసలు ఇది జరిగే పనేనా ?

ఒక ఆడపిల్ల అలా మారడానికి ఎన్ని సమస్యలు కారణం అవుతాయో ఎవరైనా ఆలోచించారా ? ఎన్ని ప్రశ్నలు వాటికీ ఎవరు సమధానం చెప్పాలి మీరే చెప్పాలి అంటారా కానీ నాకేం తెలియదే ఇలా జరిగి ఉంటుందా అనే ఉహనే ఈ కథ నాకు తెలిసిన నిజాలు మాత్రమే ఇక్కడ నేను రాసాను ఒక వ్యక్తి మారింది మారాడు అంటే అతని కానీ ఆమె జీవితం లో కానీ ఏ సమస్యలు, ఎంత వేదన ,అనుభవిస్తే వాళ్ళు అలా మారతారు ఏ ఆడపిల్ల కూడా తన పుట్టింటిని వదులుకోదు

 

మరి ఇక్కడ లీల వదులుకుంది అంటే కారణం ఇదే అయ్యి ఉంటుంది అనే ఉహ నాతో ఇది రాయించేలా చేసింది. మీరే ఆలోచించండి పుట్టింటి వాళ్ళు ఎంత కర్కోటకులు అయినా కూడా ఒక ఆడపిల్ల ఇలా చేస్తుందా ?

 

చేయ గలుగుతుందా మీరు అలాంటి వారిని ఎవరినైనా చూసారాచూస్తే కారణం ఏమిటో తెలుసుకున్నారా ? నాకు చెప్పండి .. మీ అనుభవాలు కథలు నాతో పంచుకోండి ఎవరైనా ఇలాంటి బాధలు పడితే ఆ విశేషాలు రాయండి ..

 

వాళ్ళను జన్మలో చూడకూడదు అని అనుకోవడానికి తల్లి తండ్రి నిర్లక్ష్యం స్వార్ధం కారణాలు అయ్యాయా ? మరి మీరేం అంటారో చెప్పండి కామెంట్ రూపం లో నాకు చెప్పండి . ..

 

Related Posts