లెస్బియన్స్

నేనొక కథ రాయాలనుకుoటున్నా అన్నాను అమ్మతో సీరియస్ గా అదేంటి కొత్తగా చెప్తున్నావ్ నువ్వేప్పుడు రాస్తూనే ఉంటావు కదామళ్ళి నాకు చెప్పడం ఏంటి రోజు ఎన్నో రాస్తుంటావు కదా అంది అమ్మ నాకేసి విచిత్రంగా చూస్తూ

అవునమ్మ నేను కథలు రాస్తాను అది కూడా రోజు రాస్తాను కాని ఇది కొత్త కథ కొత్తగా రాస్తున్న కథ ఎవరూ రాయలేని కథ ఒక వేళ రాసినా అవి ఒకటో రెండో ఉంటాయి తప్ప నాలాగా రాయలేదు అనుకుంటా అమ్మా అన్నాను

నేను అవునా అయితే అదేo కథ నాకు చెప్పు లవ్ స్టొరీ నా? లేదా భార్య భర్తల కథానా ? అన్నదమ్ముల కథ నా ? తల్లి కొడుకుల కథ నా ? తండ్రి కొడుకుల కథానా ? ఎం కథే లేకపోతే తండ్రి కూతురు కథానా ? ఏమి కథనో కాస్త నాకు చెప్పొచ్చు కదా అంది అమ్మ నా వైపు చూస్తూ

అబ్బా అమ్మా అవేవి కాదే ఇది కొత్త కథ అసలు నీకు ఉహకు అందని కథ అమ్మా అన్నాను నేను కాస్త విసుగ్గా అలా అయితే కథ దేని గురించో నాకు చెప్పాల్సిందే చెప్తావా?లేదా? నాకు ఇప్పుడు అంది అమ్మ నన్ను ఎగాదిగా చూస్తూ అమ్మా చెప్పాలనే కదా నిన్ను పిలిచి చెప్పేది అన్నాను

నేను సరే అయితే ఏంటో చెప్పు నీ కథ అంది అమ్మా బాసింపట్టు వేసుకుని కుర్చుని అందరూ పనుల్లోకి వెళ్ళాక నేను అమ్మా కుర్చుని కథల గురించి చర్చిస్తున్న వేళ మా మధ్య టాపిక్ రావడంతో చర్చలోకి దిగాను

 నేను ఎందుకు అంటే నేను రాయాలి అనుకున్న థీం వేరు కాబట్టి ముందుగా మా అమ్మా స్పందన చూడాలి అని చర్చని లేవదీసా…

 ఏంటో చెప్పమని అంటే అలా మౌనంగా దిక్కులు చూస్తావేంటి అంది అమ్మ కాస్త కోపంగా అదేo లేదమ్మా అని అమ్మ వైపు చూసి చెప్తున్నా అగు అని అమ్మా అది నేను అని అంటూ సణుగుతూ ఉన్నాను

అమ్మా అది నేను ఒక లెస్బియన్ కథ రాయాలి అని అనుకుంటున్నా అన్నాను నేను మెల్లిగా ఏంటి అది లెస్బియనా అంటే ఏంటి హిజ్రాల గురించా అయితే రాయొచ్చు పర్వాలేదు అంది అమ్మా, అది కాదమ్మా హిజ్రాల గురించి కాదు. 

ఆడవాళ్లలో కొందరు మగవారి  మీద కోరిక లేకుండా ఆడవాళ్ల కి ఆడవాళ్లు అంటేనే ఇష్టం, వారి తోనే ఎక్కువ ఉండడానికి ఇష్టపడతారు అలాంటి వారి గురించి నేను కథ రాయాలి అని అనుకుంటున్నా అన్నాను మెల్లిగా అమ్మకు అన్ని వివరంగా చెప్తూ

అమ్మ కాసేపు మౌనంగా ఉండి తర్వాత ఏంటదీ ఆడవాళ్లకు ఆడవాళ్ల మీద కోరికనా ఇదేం విడ్డురం తల్లి నేనెక్కడా విన్లేదు ఆయినా కోరికల గురించి రాయడం ఎందుకు ?

హాయిగా హిజ్రాల గురించో,లేదా కుటుంబం గురించో రాయకుండా ఇలా అడ్డమైన రాతలన్ని రాయడం నీకు అవసరమా అంది అమ్మా కోపంగా

అదేంటమ్మా అలా అంటావు అది కూడా ఒక అంశమే దాని మీద కథ రాయడం తప్పేమీ కాదమ్మా అయినా సరే నువ్వు అలాంటి పిచ్చి,పిచ్చి కథలు రాయడానికి నేను ఒప్పుకొను అమ్మా pls రచయిత అన్న తర్వాత అన్ని అంశాలపై రాయాల్సి ఉంటుంది.

ఇప్పుడు ఇదే అంశంపై పోటీలు పెడితే రాయామా,ఇది అంతే అందుకే రాయాలి అని అనుకుంటున్నా అన్నాను నేను అమ్మని బుజ్జగిస్తూన్నట్లుగా..

అదేమీ లేదు నువ్వు అలాంటి కథలు రాయకూడదు అంతే అంది అమ్మ పట్టుదలగా, అబ్బా అమ్మా నేను ఇంకా రాయడం మొదలు పెట్టలేదు కానీ కాసేపు నాతో వారి గురించి మాట్లాడు అన్నాను నేను ,

మాట్లాడ్డం ఎం మాట్లాడటం అయినా చీ చీ అనుకుంటేనే ఎలాగో ఉంది, అవునే మగాళ్ల మీద ఇష్టం లేకపోవడం ఏంటి వింతగా లేదు అంది అమ్మా,

అయ్యో అమ్మా అది తెలియకనే కదా నీతో మాట్లాడేది అవునమ్మా కొందరికి మగాళ్లు అంటే ఇష్టం ఉండదు.వారికి ఆడవాళ్లు అంటేనే కొరికగా ఉంటుంది.

ఆడవాళ్ళని చూడగానే వారి కళ్ళలో కనిపించే ఆనందం మగాళ్లని చూడగానే కనిపించదు అయినా అలాంటి వాళ్ళు ఉంటారా అంది అమ్మ సాలోచనగా చూస్తూ అమ్మా ఉంటారా అని అంటున్నవా చూడు 

చిన్నప్పుడు నీకో,నాకోమంచిస్నేహితురాలు ఉందనుకో ఆమె నిన్ను వదలకుండా ఉందే అనుకో అంటే మీరు స్నానం చేసేటప్పుడు లేదా నువ్వు స్నానంచేసేటప్పుడు నిన్ను గట్టిగ హత్తుకోవడం లేదా ముద్దు పెట్టుకోవడం వంటివి చేయడం చేసింది అనుకో ఆమె అలాంటిది అని అనుకోవచ్చు అని అన్నాను.

అలా అయితే మరి అమ్మ బిడ్డని ముద్దు పెట్టుకుంటుంది, బిడ్డ కూడా తల్లిని ముద్దు పెట్టుకుంటుంది.వాళ్ళు కూడా అలాంటి వాళ్ళేనా అంది అమ్మా అనుమానంగా కరెక్ట్ అమ్మా కానీ తల్లి కూతుర్ల మధ్య,స్నేహితురాళ్ళ మద్య ,ఇంకా అత్తకోడల్లా మధ్య అవి చాలా సహజంగా జరిగిపోతాయి 

అందులో ఎవర్ని తప్పు పట్టలేము ,ఎవర్ని అనుమానించలేము, వారి ప్రేమ, వాళ్ళు ముద్దు పెట్టుకోవడం  అనేవి వారి ప్రేమకు సాక్షాలు ,అలాగే వారి ప్రేమని తెలుపుకునే పద్ధతి అలా కాకుండా మనకి మరి విచిత్రంగా అనిపించేవి కొన్ని మనం అలాంటివి అనుభవించినప్పుడు మన మనసుకు తెలిసిపోతు ఉంటాయి.

అంటే ఏలానే అంది అమ్మా  అమ్మా వాళ్ళలో వారికీ ఎదుటి వారు అంటే ఇష్టంగా ఉంటుంది వాళ్ళు చేసే ప్రతి పని లోనూ ఎదుటి వారి ఇష్టాన్ని కూడా తెలుసుకుంటూ వారికీ నచ్చినట్టుగానే తయ్యరవ్వడం, వారికీ నచ్చిన బట్టలే వేసుకోవడం వంటివి చేస్తూ ఉంటారు,

మరి వారిని ఎలా గుర్తు పట్టడం అని అడిగింది అమ్మ శ్రద్దగా నేను చెప్పేది వింటూ సరే చెప్తున్నా విను అమ్మా నాకు ఇంతవరకు తెలియదు వాళ్ళు  ఇలా ఉంటారు అని కానీ నేను అనుకుంటున్నా ఇలా వాళ్ళని గుర్తు పట్టొచ్చు అని అవి నీకు చెప్తాను,

దాన్ని బట్టి నువ్వు నీ స్నేహితురాళ్ళలో కానీ ఇంకా దగ్గరి బంధువుల్లో కానీ ఎవరైనా ఉన్నారేమో చూడు అన్ని చెప్పడం మొదలు పెట్టా వాళ్ళ ప్రవర్తన మన మిద వేరేలా ఉంటుంది.ఎలా అంటే స్నానం చేసేటప్పుడు కావాలని లోపలి రావడం,మన బట్టలని దాచివేయడం మనల్ని నగ్నంగా ఉన్నప్పుడు చూడాలి అనుకోవడం,

వెనక నుండి వచ్చి కౌగిలిoచుకోవడం వంటివి చేస్తూ ఉంటారు.అలాంటి వారిని మనం గమనిస్తే వారికీ పెళ్లి మిద ఇష్టం ఉండదు తమ పెళ్లిని వాయిదా వేస్తూ ఉంటారు.

అలాగే ఒక వేళ  పెళ్లి అయినా భర్త తో కాపురం చేస్తూనే పిల్లలని కంటారు కానీ వారికీ అంతర్లీనంగా కోరికలు  ఉంటూ ఉంటాయి. కాకపోతే ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు.

మరి అలాంటప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చు కదా అంది అమ్మా నేను చెప్పేవి శ్రద్దగా వింటూ ,అమ్మా నేను కథ రాస్తా అంటేనే నువ్వు ఛి ఛి అని అన్నావు అలాంటిది ఇక వాళ్ళు అలా అని తెలిస్తే ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా,?

సమాజం ఉరుకుంటుందా ? ఎన్ని మాటలు అంటుంది? ఇప్పటికే సమాజం లో హిజ్రాలు నానాభాదలు పడుతున్నారు, హక్కుల కోసం పోరాడుతున్నారు, ఇప్పుడిప్పుడే సమాజం హిజ్రాలని గుర్తించి వారికీ ప్రత్యేకమైన హక్కులు ,వసతులు కల్పిస్తుంది అయినా కూడా ఇంకా వారి పట్ల చిన్న చూపే ఉంటుంది,

నువ్వు కూడా చూస్తున్నావు కదా అన్నాను, అవును నిజమే పాపం వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు అంది అమ్మ నిజాన్ని ఒప్పుకుంటూ  కదా మరి అలాంటి వారినే గుర్తించడానికి ఇన్నేళ్ళు పట్టినప్పుడు

ఇక ఇలాంటి వాళ్ళని గుర్తించి వారిని ఒక మనుషులుగా చూడాలి అంటే మనదేశం చాలా ముందుకి వెళ్ళాలమ్మా ఇప్పుడిప్పుడే డేటింగు అంటూ సహజీవనం చేస్తున్నా ఇంకా వారివి తెర పైకి  రావడం లేదు

అందుకే నేను వారి గురించి తెల్సుకోవాలి అని అనుకుంటున్నావారి గురించి లోకానికి తెలియాలని కోరుకుంటున్నా  వారిని గుర్తించాలి అని అనుకుంటున్నా దాని కోసమే నా కథ రాసే ప్రయత్నం చేస్తున్నా అని అంటూ వివరించాను.

అవును కానీ నువ్వు వారి గురించే ఎందుకు రాయాలి అనుకుంటున్నావు,నీకేంటి అంత  ఇంటరెస్ట్ అని లా పాయింటు లాగింది అమ్మా నన్ను అనుమానంగా చూస్తూ అయ్యో అమ్మా నువ్వు మరీ నన్ను అనుమానిస్తున్నావ్ ఎందుకు ?

నేను అలాంటి దాన్ని అయితే ముందుగా నికే చెప్తాలే కానీ ఇప్పటికి మాత్రం నన్ను వదిలెయ్యి, అయినా కథలు రాసినంత మాత్రానా నేను అలాంటి  దాన్ని అనుకుంటే ఎలా ? రచయిత అనేవారు అన్ని రకాల కథలు రాయాలి అలాంటప్పుడే అన్ని రాసే సత్తా వస్తుంది, అదేంటో సెక్స్ గురించి రాస్తే వాళ్ళు సెక్స్ పిచ్చోలె అని నీలాంటి వాళ్ళు అనుకోబట్టే లోకం ఇలా ఉంది.

అయినా మహా కవి శ్రీ శ్రీ కె తప్పలేదు వెతలు ఇక నేనెంత సముద్రం లో కాకి రెట్టంత నువ్వు అనుకోవడం లో తప్పు లేదు, ఎందుకంటే నేను ఎంచుకున్న అంశం అలాంటిది కాబట్టి,అన్నాను నేను, ఇంతలో మా తమ్ముడు  అమ్మా లెస్బియన్స్ అంటే ఎవరూ అని అడిగాడు

వాడు  వచ్చిన విషయం గమనించని  మేము  మాటకు అవాక్కయ్యము నిజం చెప్పొద్దూ వాడు అడుగుతుంటే నాకే ఏదోలా అనిపించింది కానీ అంతలోనే  సర్దుకున్న  ఇప్పుడు ఏమి సమాదానం చెప్తావో చెప్పు అన్నట్టుగా చూస్తుంది

మా అమ్మ కోపంగా చెప్తాను దానిదేముంది అన్నట్టుగా చూస్తూ చెప్తా కానీ ముందు నువ్వు వెళ్ళి  ఫ్రెష్ అవ్వు అని వాడిని లోపలి కి పంపించాను.

వాడు లోపలి కి వెళ్ళాక మా అమ్మ నవ్వుతు ఏంటి పంపించావు చెప్పకుండా అని అంది వాడికి చెప్పేముందు నీకొక క్లారిటీ ఇద్దామని పంపించాలే అవునమ్మా మీకాలం లో నువ్వు మీ అమ్మ తో ఎప్పుడైనా సెక్స్ గురించి మాట్లాడవా అని అడిగాను అమ్మని,

ఛి ఛి రామ రామ మా ఇంటా వంటా లేదు అంది మరి నేను ఎప్పుడైనా నిన్ను అలా అడిగానా అని అన్నానులేదు అడగలేదుఅంది. అయితే విను మీ జనరేషన్ లో మీరు దాని గురించి మాట్లాడలేదు మా తరం లో మాకు బడి లో పునరుత్పత్తి అండల విడుదల స్త్రీ పురుషుల హోర్మోన్స్ వాళ్ళకు ఆడ , మగ పిల్లలు పుట్టడం అనేవి ఉన్నాయి,

కానీ మేము వాటి గురించి చదివినా ,మాకు అనుమానాలు వచ్చినా అడగడానికి ఎదో ఇబ్బంది గా అనిపించి అడగలేదు , మాకు ఎవరూ ఏమి చెప్పకున్న మేమే తెలుసుకున్నాం పెళ్ళిళ్ళు  అయ్యాక  అనుభవం తో తెలుసుకున్నాం  కానీ ఒకటే అమ్మా ఇప్పుడు తరం మారింది అన్ని విషయాలు టీవీ లోనూ సినిమాల్లోనూ చూసి నేర్చుకుంటున్నారు మళ్ళి ఫోన్ లు కూడా పిల్లలకి అన్ని తెలిసేలా చేస్తున్నాయి

ఇలాంటివి తెలుసుకోవడం తప్పు ఏమి కాదు, ప్రభుత్వమే వారి బుక్స్ లో అంశాలుగా సెక్స్ ఎడ్యుకేషన్  ని చేర్చింది . 

సినిమాల వాళ్ళ చాల వరకు తెలుసుకున్నారు ఇక బుక్స్ వాళ్ కూడా తెలుసుకున్నారు వారి అనుమానాన్ని మనం తిర్చితే వారిని ఇలాంటి వారి నుండి కాపాడగలం  అలా అని మొత్తం విప్పి చెప్పాల్సిన అవసరం లేదు 

మంచి చెడు అంటే బాడ్ అండ్ గుడ్ టచ్ గురించి చెప్తే చాలు. అమ్మాయి అయినా అబ్బాయికైనా జాగ్రత్త చాలా అవసరం ఇక పిల్లలకు ప్రేమ,సెక్స్ అనేవి తెల్సు, సినిమాలో హీరో,హీరోయిన్ లు ప్రేమించుకోవడం, పాటలు పాడుకోవడాన్ని వాళ్ళు  ఎంజాయ్ చేస్తారు,

పాటలని బట్టి పడతారు కాబట్టి వారికీ ఏమి తెలియదువారి ముందు ఇలాంటి విషయాలు మాట్లాడకూడదు అని అనుకోవడం చాలా పొరపాటు నిజమే వారికీ కాస్త తెలియడం లో తప్పు లేదు

వారి అనుమానాలని నివృత్తి చేసే వాళ్ళం మనం కాకపోతే  ఇలాంటి విషయాలు వారికీ ఎవరూ చెప్తారు,తల్లో తండ్రో విషయాలన్ని వారికీ ఎదో సందర్భం లో చెప్పాలి, వారిని జాగ్రుత పరచాలి 

నీ మనవడు ఏమి చిన్న పిల్లాడు కాదు వాడిప్పుడు పదో తరగతి, అంటే టినేజి లోకి వచ్చాడు అన్న మాట ,కాబట్టి వాడికి అన్ని చెప్పి, జాగ్రత్త పరిచే భాద్యత మన మిద ఉంది అని అన్నాను.

అమ్మో నువ్వు ఒక్కో విషయం చెప్తుంటే నిజమే అనిపిస్తుందిఅంది అమ్మ , ఇంతలో తమ్ముడు ఫ్రెష్ అయ్యి వచ్చి , అమ్మా నేను రెడీ అన్నాడు, సరే నీ అనుమానం ఏంటి అని అన్నాను,

అదేనమ్మా నేను వచ్చే సరికి మీరు లెస్బియన్ అని ఎదో మాట్లాడుకుంటున్నారు అంటే ఎవరమ్మా అని అడిగాడు వాడు అయితే ముందు నీకో ప్రశ్న చెప్తావా అని అడిగాను నేను చెప్తా  అన్నాడు వాడు 

సరే నీకు గే లు హిజ్రాలు తెలుసా అని అడిగాను తెలుసమ్మా వాళ్ళు బస్ స్టాండ్స్ దగ్గర, ట్రైన్స్ లోనూ చప్పట్లు కొడుతూ డబ్బులు అడుగుతారు కదా అన్నాడు వాడు

మలినం కానీ వాడి మనసును చూసి అచ్చెరు పొందిన నేను సరే విషయం వదిలేయ్యి కానీ వాళ్ళు అలా ఎందుకు అవుతారో అయ్యారో ఎప్పుడైనా తెలుసుకున్నావా అని అడిగా మళ్ళి వాడిని ,

వారికీ ఆడవాళ్ళలా ఉండడం  అంటే ఇష్టం, వాళ్ళు అలాంటి  వాళ్ళ తోనే ఫ్రెండ్ షిప్ చేస్తారు కాబట్టి వారిని గే ,ట్రాన్స్ జెండర్స్  అంటారు అని మా టీచర్స్ చెప్పారు అన్నాడు వాడు ,చూసావా నీకంటే వాడికే అన్ని తెలుసు అన్నట్టుగా చూసాను నేను అమ్మా వైపు .

గొప్పే అన్నట్టు మూతి తిప్పింది అమ్మా .సరే రా అబ్బాయికి అబ్బాయిలు నచ్చడాన్ని హిజ్రాలు, గే లు అంటారు,అలాగే అమ్మాయిలకి అమ్మాయిలు నచ్చాడాన్ని లేస్బియన్స్ అంటారు అని చెప్పాను , ఓహో అంతేనా అయితే అమ్మాయిలు అమ్మాయిలనే లవ్  చేస్తారు, అబ్బాయిలు అబ్బాయిలనే లవ్ చేస్తారు అంతేనా మమ్మీ అని తేల్చేసి, బాల్ తీసుకుని బయటకి వెళ్తున్న వాడిని ఇద్దరం అలా చూస్తూ ఉండిపోయాము.

చూసావా అమ్మా మనం ఇంతగా బుర్రలు బద్దలు కొట్టుకుంటుంటే వాడు చాలా తేలికగా అనేసి ఎలా వెళ్ళి పోయాడో ఇప్పటి పిల్లలు అన్ని చాలా ఈజీగా తీసుకుంటున్నారు దేని గురించి మాట్లాడడానికి కి కూడాభయ పడడం లేదు అన్నాను నేను అమ్మ తో,

అవును కానీ అదే వాళ్ళని గుర్తించడానికి అన్ని చెప్పావు ,మరి ఎవరైనా ఉన్నారంటావా అలాంటి వాళ్ళు అని అడిగింది అమ్మ . 

అమ్మా మన దగ్గర  అంటే మన తెలుగు రాష్టాల్లో ఇంకా వాళ్ళు ఇలా అని ఎవరూ ముందుకు రావడం లేదు కానీ డిల్లి ముంబాయి లాంటి  సంపన్న నగరాల్లో మేము అలాంటి  వాళ్ళము అని కొదరు దైర్యంగా ముందుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు,

నేను కూడా మధ్యే వారి మిద ఒకటో, రెండో కథలు రావడం చూసాను, కాబట్టే రాయాలి అని అనుకుంటున్నా ఏమంటావు అని నిన్ను అడగాలని వస్తే ,ఇదిగో ఇంత సమయం వృధా  చేసావు అయినా నీతో మాట్లాడడం వల్ల నాకు కూడా కొంచం వివరణ దొరికింది అన్నాను నేను

అయినా అమ్మా మన దేశం లో మన తెలుగు వారిలో ఇలాంటి విషయం అందునా సెక్స్ గురించి మాట్లాడాలి అన్నా,దాని గురించి తెలుసుకోవాలి అని అనుకున్నా ఏమైనా అనుమానాలు వచ్చినా అడగడానికి చాలా ఇబ్బంది పడతారు,అలాంటి మాటలు మాట్లాడే వారిని చాలా చీప్ గా చూస్తారు,

కానీ అలా చేయడం వల్ల ఏదైనా సమస్య ఉన్నవాళ్లు చెప్పుకోలేక పోతారు.కానీ అది చాలా తప్పు దాని వల్ల వారి సమస్యలు ప్రాణాల మీదకి వస్తాయి ఇంకా కొన్ని చోట్ల విషయాన్నీ మాట్లాడ్డమే అపరాదంగా చూస్తారు అని

అలాంటి  కథలు రాసే వారంతా బరి తెగించిన వాళ్ళు అనే వారె సమరం సమస్యపరిష్కారం  సమాధానాలు చదువుతారు అన్నాను నేను ఆవేశంగా

సరే కానీ అలాంటి లేస్బియన్స్ కి పెళ్లి, పిల్లలు, కాపురం ఉండవా అని అడిగింది అమ్మ నన్ను దాని గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం కానీ ఇప్పుడు చెప్పు నేను వారి గురించి రాయాలా ? వద్దా ? అని అడిగాను చివరిసారి గా ఏమంటుందో విందామని

కానీ అమ్మ నా ఆలోచనలని చదివినట్టుగా చిరుకోపంతో అయినా నేను ఆగమంటే ఆగుతావా ఏంటి నువ్వు మీ నాన్నలాగే మొండి ఘటానివి అంది మురిపెంగా నన్ను చూస్తూ అమ్మ 

సరే కానీ నీ కూతురు ఇలాంటివి రాస్తుంది అని ఎవరైనా నిన్ను అడిగితె ఏమంటావు అమ్మా అని అడిగాను నేను అమ్మనినేనా కథని కథలాగే చదివి అందులోని మంచిని మాత్రమే తీసుకోవాలని చెప్తాను అంది అమ్మ,” మా మంచి అమ్మఅంటూ అమ్మని గట్టిగా కౌగిలించుకున్నా ప్రేమతో “….

Related Posts

1 Comment

  1. ఒక వ్యాసాన్ని రాసి కథలా మలచడానికి మంచి ప్రయత్నం చేసారు. బాగుంది.
    కృతజ్ఞతతో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *