లోపమా? శాపమా?

 చీ చీ పొద్దున్నే ఏధవ మొఖం  చూడ్డం, ప్రొద్దున్నే బయటకు రాకపోతే ఏమైయ్యిందమ్మా నీకు,ఇంట్లో వాళ్ళని బయట పని చేసుకొనియ్యవా ఏమిటి అన్నాడు రాజయ్య. తన్నుకు వస్తున్న ఏడుపు ని అపుకుంటూ నోట్లో చెంగు కుక్కుకుని లోనికి వెళ్ళింది యశోద. ఉన్నమాటనేగా నేను అన్నది,కొత్తగా ఏమి అనలేదు కదా,అంత ఏడుపు ఉన్న వాళ్ళు అయితే పిల్లలని కనోచ్చు కదా అన్నాడు వెటకారంగా. 

ఎవర్నీ రా అంత మాట అంటున్నావు అంటూ వచ్చాడు రామయ్య అన్నగారిని చూసి  భయపడి,ఏమి లేదు అన్నయ్య అన్నాడు కంగారుగా, నువ్వు ఎవరిని అంటున్నవో తెలుసుకోలేనంత మూర్ఖుడిని కాను లేరా..నాకు తెలుసు నువ్వు మీ వదినని అంటున్నావు అని అన్నాడు రామయ్య,అన్నయ్య అది,అది అన్నాడు నీళ్లు నములుతూ రాజయ్య.

సరే లే రా ఇప్పుడు నిన్ను ఎవరూ ఏమి అనడం లేదు ,అదంతా మా తల రాత అని,సరే నువ్వు షాప్ కు వెళ్లి కూర్చో,నేను గోవిందం దగ్గరికి వెళ్లి గోధుమలు తీసుకొని వస్తా అన్నాడు తిరిగి చెప్పులు వేసుకుంటూ,అన్నయ్య కొప్పడక పోవడం తో ఊపిరి పీల్చుకుని బయటకు వెళ్ళాడు రాజయ్య.

అవును రా  రామం పక్కన ఉన్న గుళ్లోని బాబాగారు వచ్చారు అంట,వెళ్లి ఒక్కసారి దర్శనం చేసుకుని రండి రా అంది రామయ్య తల్లి  జోగులంబ,అమ్మా రోజుల్లో కూడా బాబాలు, స్వామీజీ లు ఏమిటీ, ఇంకా మూఢ నమ్మకాలు వదలరా అన్నాడు కాళ్ళు కడుకుంటూ, నా మాటలు మీకేం నచ్చుతాయి లే,పో రా పో ఏమైనా చేసుకో,ఇన్నేళ్లు అవుతున్నా పిల్లా,జిల్లా లేరనే బాధ తో అంటున్నా,

ఇంట్లో పసిబిడ్డ లేక పోవడంతో బోరు మంటుంది అంది తల్లి..సరే అమ్మా పోతాం లే అన్నాడు లోపలికి వెళ్తూ, లోపలికి వెళ్ళగానే సుమతి ఏడుస్తూ కూర్చుంది వంట రూమ్ లో,ఆమెని  ఓదార్చడానికి ఎవరూ లేరు.సుమతి కి తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు.ఆమె బాబాయి పిల్లలతో కలిసి పెరిగింది.రామయ్య తల్లి జుగులంబ సుమతి పని తనం,ఇల్లు చక్క బెట్టుకోవడం చూసి ఇష్టపడి తన కొడలుగా చేసుకుంది.

కానీ పెళ్లి అయ్యి పదేళ్లు అవుతున్న ఇంకా పిల్లలు కాలేదు వారికి,దాంతో ఇరుగు పొరుగు వారు సూటిపోటి మాటలతో ఆమెని బాధ పెడుతున్నారు,దానికి తోడు మరిది రాజయ్య కు పెళ్లి జరిగిన సంవత్సరానికే భార్య కడుపు పడింది.వారికి ఒక బాబు పుట్టడం తో,రాజయ్య కూడా వదిన అనే గౌరవం  లేకుండా మాటలు ఆనడం మొదలు పెట్టాడు.

లోపలికి వచ్చిన రామయ్య,సుమతి కన్నీళ్లు తుడుస్తూ బాధ పడకు సుమతి ఇలాంటివి మనకు కొత్త కాదు కదా, నువ్వు ఏడిస్తే నేను చూడలేను సుమతి, దయచేసి ఏడవకు అన్నాడు.ఏడుపు  కాక ఇంకేం మిగిలిందండీ,అందుకే మీకు చెప్పాను,నన్ను వదిలేసి,వేరే పెళ్లి చేసుకొమ్మని అని అంది.పిల్లలు కాలేదన్న సాకు తో నిన్ను వదిలేస్తే,మరి రేపొద్దున్న వచ్చిన దానికి కూడా పిల్లలు కాక పోతే అప్పుడెం చేయాలో అది కూడా నువ్వే చెప్పు, లోపం నీలో కాక,నాలో ఉందేమో సుమతి అందుకే పిల్లలు కావడం లేదేమో,పోని నీకు వేరే పెళ్లి చేస్తాను అప్పుడు నీకు,అతనికి పుట్టిన పిల్లలను నేను పెంచుతాను అన్నాడు.

అయ్యో అదేం మాట అండీ,నేను ఇంకో పెళ్లి ఎలా చేసుకుంటాను అంది ఆందోళన గా,మరి అలాంటప్పుడు నన్ను ఎలా చేసుకోమంటావు సుమతి అన్నాడు రామయ్య, ఎదో బాధ లో అన్నాను అండీ,వద్దు లెండి మీరు భాద పడకండి,నేనేదో పిచ్చిదాన్ని,ఏడుస్తూ కూర్చున్నా,మీకు భోజనం వడ్డిస్తా,రండి అంది. నువ్వు కూడా పెట్టుకో అన్నాడు రామయ్య,సరే అని కంచం లో అన్నం పెట్టుకుంది సుమతి.

లక్ష్మయ్య,జోగులంబా దంపతులకు ఇద్దరూ కొడుకులు,ఇద్దరు కూతుర్లు కుతుర్లకు చిన్నతనం లోనే పెళ్లిళ్లు జరిపించడం తో,వారి కాపురాలు,పిల్లలు,వారి భాద్యతలు వారికి ఉన్నాయి.ఇక ఇద్దరు కొడుకుల్లో రామయ్య పెద్దవాడు,రాజయ్య రెండో వాడు తండ్రి చనిపోతూ ఉన్న కిరాణా షాపుని ఇద్దరికి అప్పగించి చనిపోయాడు. చిన్న కిరాణా షాపుని ఇద్దర -న్నదమ్ములు కలిసి కష్టపడి పెద్ద షాపుగా మార్చి,ఆ చుట్టుపక్కల మంచి పేరు తెచ్చుకున్నారు.భార్య రావడం వల్ల రాజయ్య  మాటల్లో కొంచం తేడా వచ్చింది కానీ అంతకు ముందు అయితే వదినని దేవతలా చూసేవాడు.ఆ మాటల్లో తేడా గమనించిన రామయ్య ఇలా కాదని,తన షాపు ని రెండు భాగాలు గా చేసి,ఓ పక్కన తాను,ఓ పక్క తన తమ్ముడికి పంచి ఇచ్చాడు. ఇంట్లో కూడా ఓ భాగం లో తానుంటూ,మిగతా భాగంలో తమ్ముడికి ఇచ్చాడు.తల్లిని ఉమ్మడిగా చూస్తున్నారు ఇద్దరూ,వారికి ఏ విషయాల్లోనూ విభేధాలు లేవు.రామ లక్ష్మణులని పేరు కూడా తెచ్చుకున్నారు..

ఇక ప్రస్తుతం ఇద్దరూ భోజనాలు ముగించి,లేచారు సుమతి నేను పట్నం వెళ్తున్నా ఏమైనా కావాలా అని అడిగాడు రామయ్య,నాకేమి వద్దండి,అత్తయ్య గారు అన్నట్టుగా స్వామీజీ దగ్గరికి వెళ్లి వద్దం ఏమంటారు అంది భయంగా అయినా స్పష్టంగా సుమతి.సుమతి ఈ స్వామీజీ లు బాబా లను నేను నమ్మను అని తెల్సు కదా అన్నాడు రామయ్య.సరే మీ ఇష్టం అంది సుమతి భర్త గురించి తెలిసినట్టుగా.ఇక ఏమి మాట్లాడక సరే వస్తాను అని బయటకు నడిచాడు.పట్నం వెళ్లిన రామయ్య గోవిందు గారి దగ్గరికి గోధుమలు ఎంత ధర పలుకుతున్నాయి అని అడుగుతూ ఉండగా, ఇద్దరు వ్యక్తులు గోవిందం దగ్గరికి వచ్చారు.ఏమయ్య గోవిదం మీ ఊర్లో ఇంత మంచి డాక్టర్ ని చూపించిన నువ్వు మాకు దేవుడివయ్యా అన్నారు వచ్చిన వాళ్ళు ,అయ్యో అదేంటి బాబాయి అలా అంటారు.తమ్ముడికి పిల్లలు లేరని మీరు భాదపడ్డాం చూడలేక చెప్పాను.ఇప్పుడు అంతా బాగుంది కదా అన్నాడు గోవిందం.

బాగేనా అంటవా ఇప్పుడు నా కోడలు గర్భవతి బాబు అందుకే నీకు తీపి తినిపించాలని వచ్చాము అంటూ స్వీటు ని గోవిందం కు,రామయ్యకు ఇచ్చి,తిరిగి వెళ్లిపోయారు.వారి సంభాషణ అంతా విన్న రామయ్య కూడా ఆ డాక్టర్ గురించి గోవిందం ని అడిగి తెలుసుకున్నాడు.ఆ డాక్టర్ గారి పేరు హరినాధ్ అని చాలా మంచి హస్తవాసి ఉన్న డాక్టర్ అని చెప్పిన గోవిందం కి కృతజ్ఞతలు చెప్పి,ఇంటికి బయలుదేరాడు రామయ్య.ఆ తర్వాత వారం రోజులకు భార్యను వెంట బెట్టుకుని గోవిందం సహా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు రామయ్య, రామయ్య దంపతులను పరీక్షించిన డాక్టర్ హరినాధ్ గారు, మీకు ఇన్ని రోజులు సంతానం కాకపోవడమే మంచిదయింది.లేకపోతే గర్భం దాల్చిన తర్వాత తల్లి బిడ్డ చనిపోతే మీరు చాలా బాధ పడాల్సి వచ్చేది.అని, సుమతి కడుపులో గడ్డ ఉందని, అది కరగడానికి మందులు ఇచ్చి,రెండు నెలల తర్వాత రమ్మన్నాడు. సుమతి మంచి ఆహారం తింటూ,మందులువాడడం వల్ల ఆ గడ్డ తొందరలోనే కరిగిపోయింది.

దాంతో డాక్టర్ గారు సంతానం కావడానికి వారిద్దరికి మందులు ఇచ్చారు. ఇద్దరూ మందులు వాడుతూ కాపురం చెయ్యడం వల్ల సుమతి మూడునెలలోనే గర్భవతి అయ్యిoది. తొమ్మిది నెలల తర్వాత పండంటి బాబుకు జన్మనిచ్చింది సుమతి. బాబుని రామయ్య కు అందిస్తూ అంతా మీ పోలికే అండీ అంది.అయ్యో ఏడుస్తూన్నావా అన్న రామయ్య మాటలకు సుమతి అయ్యో ఇది ఏడుపు కాదండి,ఇవి ఆనందభాష్పాలు ఇన్ని రోజులు నన్ను చుట్టుపక్కల వారు  గొడ్రాలు అనే వారని,ఇంట్లో వారు కూడా అనడం వల్ల చనిపోవాలని అనుకున్నా,కానీ మీరు నన్ను ఓదార్చడం,డాక్టర్ గారు గడ్డ వల్ల పిల్లలు కాలేదని చెప్పడం,ఇప్పుడు బాబు ఇవ్వన్నీ చూస్తుంటే నాకు ఆనందంగా ఉందండి అంది సుమతి సంతోషంగా..

అవును సుమతి నీ లోపం మనకు శాపం కాదు.అలా నీకు పిల్లలు కాకపోవడం వల్లే నువ్వు నాకు దక్కినావు,అదే పిల్లలు పుట్టి,నీకు గడ్డ ఉంటే నాకు నువ్వు దూరం అయ్యే దానివి,డాక్టర్ గారి చలువ వల్ల  నువ్వు నాకు దక్కావు అని అంటూ భార్య చేతులని మృదువుగా తాకాడు రామయ్య,వదిన నన్ను క్షమించు ఎదో నోరు జారాను అన్నాడు అప్పుడే వచ్చిన రాజయ్య,నిన్ను తన్నడానికె నాకు కొడుకు పుట్టాడులే అంది నవ్వుతూ సుమతి,ఆమె నవ్వుతో శృతి కలిపారు అందరూ……

Related Posts