వంకాయ కూర

సుప్రజ సిద్దూ లది పెద్దలు కుదిర్చిన పెళ్లిఇద్దరు పట్నం లో కాపురం పెట్టి నెల రోజులే అయ్యింది.కాపురానికి పంపేటప్పుడు చాలా జాగ్రత్తలు చెప్పి పంపించింది తల్లి సుప్రజకు భర్త కు అనుకూలంగా ఉండాలి అని భర్తకు ఏదీ ఇష్టమో దాన్ని కనుక్కుని చేసి పెట్టాలనిఅతను తిన్న తర్వాతనే తినాలి అనిఇక ఏమి అడిగినా నాకు రాదు అని అనకుండా చేసి పెట్టమని అలా చేస్తే భర్త నీ కొంగు పట్టుకుని ఉంటాడు అని హితబోధ చేయడం తోసుప్రజ కాపురం పెట్టింది మొదలు సిద్దూ కు అన్ని చేసి పెట్టడం మొదలు పెట్టింది.

సిద్దూ కూడా తనకు కావాల్సినవన్ని భార్య కు చెప్పివండించుకుని తింటూ ఎంజాయ్ చేయసాగాడు.ఇలా రోజులు హాయిగా సంతోషంగా గడిచిపోతు ఉండగా ఒక రోజు సిద్దూ ఆఫీస్ నుండి వస్తుంటే దారిలో అతని చిన్న నాటి స్నేహితుడు ఒకరు వ్యవసాయo చేసే అతను తన తోటలో కాసిన వంకాయలు తెచ్చిప్రేమగా ఇచ్చాడు.

వాటిని ఇంటికి తీసుకుని వచ్చాడు సిద్దూ వాటిని భార్య చేతికి ఇచ్చిమంచి కూర చెయ్యమని తాను స్నానానికి వెళ్ళాడు. సుప్రజ వాటిని బాగా కడిగికోసిమసాలా దట్టించి వండడం మొదలు పెట్టింది.ఆమె వండుతూ ఉండగానేవాసనకు కడుపులో ఆకలి కరకరలాడింది సిద్దూ కు  వెంటనే స్నానం చేసి వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు.

సుప్రజ కూడా వంకాయ కూర అనగానే ఆకలి బాగా వేసింది. సరే లే సిద్దూ తిన్న తర్వాత ఎలాగూ తింటాను కదా అని అనుకుని సిద్దూ కు అన్నం వడ్డించికూర వేసింది.సిద్దూ కూరని అన్నం లో కలిపి నోట్లో పెట్టుకున్నాడుఅంతే అబ్బా అమృతం అంటే ఎక్కడో లేదురా వంకాయని సృష్టించిన వాడే ఇందులో వేసి ఉంటాడు అని అనుకునిఆ ముద్ద ని నోట్లో పెట్టుకున్నాడు అది పెట్టుకోగానే  కరిగిపోయింది..

రెండు నిమిషాల్లో కూర అయిపోయింది. వెయ్యి అన్నాడు సుప్రజాని చూస్తూ సిద్దూ సుప్రజ వేస్తూనే ఉంది కంచం లో కూర అయిపోతూనే ఉంది. అలా తింటూనే ఉన్నాడు కంచం.లో కూర అన్నం అయిపోతూనే ఉన్నాయి.ఇంకాఇంకా ఇంకా అంటూనే ఉన్నాడు వెయ్యి అన్నాడు సుప్రజాని చూస్తూ సుప్రజ కన్నీళ్ల  తో భర్త ని చూడసాగింది. వెయ్యమంటే వెయ్యవేంటి అని అంటూ గిన్నెల్లోకి చూసాడు..

పాపం అక్కడ గిన్నెలు రెండూ ఖాళీగా కనిపించాయి.అది చూసిన సిద్దూ గతుక్కుమన్నాడు తాను దాదాపు కిలో వంకాయలు తిన్నాడా అని ఆశ్చర్య పోయాడు. సుప్రజ ని చూస్తూ సారి సుప్రజకూర బాగా చేసావుదాంతో నేను మొత్తం తినేసాను అన్నాడు. సుప్రజ కోపంగా గిన్నెలు తీసి సిద్దూ నెత్తి మీద ఒక్కటిచ్చింది.. తర్వాత ఏమైందో అని నన్ను అడగకండి..:-)))

Related Posts