వచనం

వచనం

వచనం

ప్రేమలోను పెండ్లిలోను కల్తి
పాలు పసుపులోను!
నీటిలోను నేతలలో కల్తి
కల్తిలేని చోటు కానరాదె!!

పప్పుచారైన ఉప్పునైన
వైద్యమైన విద్యయైన
ఓట్లైన నోట్ల కట్టలైన
కల్తిలేని చోటు కానరాదె!

నెయ్యమైన నెయ్యియైన
మందైన మటనైన
బియ్యమైన వియ్యమైన
కల్తిలేని చోటు కానరాదె!

విత్తనాలైన విత్తమార్జనైన
బెల్లమైన అల్లమైన!
కూడు కూరగాయలైన
కల్తిలేనిచోటు కానరాదె!

రంగులైన రాజకీయమైన
కంటిచూపైన కారమైన
పురుగుమందైన పొరుగు వారైన
కల్తిలేనిచోటు కానరాదె!

మంచినీరైన మాటలైన
పూలైన పూజలైన
టిఫినైన టీపొడియైన
కల్తిలేనిచోటు కానరాదె!!

ఆశయాలైన ఆశయమ్మైన
నమ్మకాలైన నరులైన
చదువుసంధ్యలైన సంస్కారమైన
కల్తిలేనిచోటు కానరాదె!!

భార్యభర్తలైన బంధుమిత్రులైన
పాలుపెరుగు పసిడి కల్తి!
వాస్తవాలైన వస్తువులైన
కల్తిలేనిచోటు కానరాదె!!

మతములోను మానవత్వములోను
చెలిమిలోను చేయూతలోను
దయలోను దాతృత్వములోను
కల్తీలేనిచోటు కానరాదె!!

గడ్డం కృష్ణారెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *