"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

వరద పారని సంద్రమై…!!!

వరద పారని సంద్రమై…!!!

సర్వేంద్రియానాం
నయనం ప్రధానం…
వినోదానికి మానసిక వికాసానికి
ద్వారాలుగా తెరుస్తు మూస్తూ…
మనస్సున దాగిన సుఖ దుఃఖాలను
తెలుపుతు…నిరంతర తడితో
వరద పారని సంద్రమై ఆ కంటి నీలాలు
జగతిని చూచే చిరు దివ్వెలు…

సర్వాంగాల పరమార్థాలను
సరిచేసుకొంటు…నియమం మనిషిలోని
కంటి చూపని దేహాన్ని యాతనకు
గురిచేయక…పదార్థ మెంతటిదో
పరమాణువు అంతగా విభజించ
బడినదని… వైపరిత్యాలలో దాగిన
విధ్వంసకరాలను తెలుసుకున్న జ్ఞానమై…
మనుగడలో గల అవరోధాన్ని ఎరుకగా
వినికిడి చేసుకో…

మట్టితో మమేకం ఈ జీవితమైనా…
మరణంతో ఆ కంటి దీపాలు
ఆరిపోరాదు…వెలుగుల వేల్పులను ప్రకృతి ఆరాధ్యాలను ప్రతి మనిషి
ఆస్వాధించాలని…నేత్ర దానంతో
నయనానందకర జీవితానికి దాతలు
కావాలని అది మనిషిలోని
మానవత్వానికి నిదర్శనమని…

కన్నులు లేక చూడలేని లోకం గుడ్డిది
కారాదని చూపు లేనివారికి లోకాన్ని
చూపించడం గొప్పతనమని…
నిత్య అన్వేషణలతో సంఘమై
కదులుతు ఆధారాలతో హద్దులు దాటని
ప్రపంచ సమీకరణాలకు నిర్వచనమై
చూపుల స్వేచ్ఛలతో వెలుగవుతు…
జాతి ఉద్దేశ్యం కనుపాపలకు రక్షణ
కావాలని కోరుకో…

దేరంగుల భైరవ

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *