వలపుల వల

వినయ్ విమలకు పెళ్ళయ్యి నెల దాటింది. ఆషాడం మాసం అయ్యాక శోభనం  జరిపించాలి అని  పెద్దలు నిర్ణయించారు వినయ్ ప్రమేయం ఏమి లేకుండానే పెళ్ళయ్యి  శోభనం కాకపోతే మగాడి పరిస్థితి ఎలా ఉంటుందో పెళ్ళైన మగాళ్ళకి తెలుస్తుంది.అలా తనని అడగకుండానే పెద్దలు నిర్ణయం మిద వినయ్ విమలని పుట్టింట్లో వదిలేసితాను మాత్రం  హైదరాబాద్ కి వెళ్ళిపోయాడు ఆఫీస్ లో పెట్టిన సెలవు అయిపోవడం తో తిరిగి ఉద్యోగం లో జాయిన్ అయ్యాడు.

రోజు విమల ఫోన్ చేసినా కూడా  పెద్దవాళ్ళ మిద కోపం తో మాట్లాడడం లేదు.అయినా విమల ఫోన్ లు చేయడం మానలేదుమెసేజ్ లు చేస్తూనే ఉంది.వినయ్ మాత్రం వెతికి స్పందించడం లేదు.

రోజులు గడుస్తున్నాయి.వినయ్ ఆఫీస్ లో లేని సమయం లో మధుమిత ఆఫీస్ లో జాయిన్ అయ్యింది . విషయం వినయ్ కి తెలియదు .ఒక రోజు వినయ్ బాస్ వినయ్ ని పిలిచి మధుమితని పరిచయం చేసాడు. వినయ్ థిస్ ఇస్ అవర్ న్యూ ఎంప్లొయ మధు మిత హాయ్ అన్నాడు వినయ్ మధుమితని చూస్తూ ఇక ఇద్దరి పరిచయాలు అయిన తర్వాత మీరిద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్ చేయాలిఅది మన కంపెనీ లోనే మంచి ప్రాజెక్ట్ అవ్వాలి  అంటూ చెప్పారు బాస్. 

వాళ్ళిద్దరూ ప్రాజెక్ట్ వల్ల కొంచం దగ్గరయ్యారు.మధుమితకి వినయ్ బాగా నచ్చాడు మంచి ఉద్యోగం ఆస్థి ఒక్కడే కొడుకు ఇలాంటి మంచి విషయాలు అన్ని మధుమితకి కనిపించాయి ఒక ఆడపిల్లకి ఇంతకన్నా మంచివాడు ఎక్కడ దొరుకుతాడు చెప్పండిపైగా అందగాడు కూడా వినయ్ తన పెళ్లి విషయం ఆఫీస్ లో ఎవరికీ చెప్పాక పోవడం వల్ల తనకి పెళ్లి అయిన విషయం ఆఫీస్ లో ఎవరికీ తెలియదు.

అందుకే మధుమితకి కూడా ఎవరూ చెప్పలేదు.చివరికి వినయ్ కూడా ఎంతైనా  మగాడు ఒక అమ్మాయి ముందు బిల్డప్ లు ఇచ్చుకోవాలి అని అనుకుంటాడు తప్ప తనని తను తక్కువ చేసుకోడు కదా అందుకే వినయ్ కూడా మధుమిత ముందు హీరో లా బిల్డప్ ఇచ్చడు.వాటికే పడిపోయిందా  మధుమిత అంటే ఒక అమ్మాయికి హీరో లాంటి భర్త ఒక సెక్యూర్ లైఫ్  కావాలి అనుకుంటుంది తప్ప ఇంకేం కావాలని కోరుకోదు కదా మధుమిత కూడా వినయ్ గురించి ఇవే కలలు కంటుంది.అందువల్లే అతనితో ప్రేమలో పడిపోయింది….

ఇద్దరూ తమ తమ ఇష్టా ఇష్టాలు చెప్పుకున్నారు కలిసి పనిచేస్తున్నారు కాబట్టి చనువు బాగా పెరిగి పోయింది అనే కంటే పెంచుకున్నారు అని అనుకోవచ్చు.ఇంకో పక్క వినయ్ విరహం కూడా పెరిగి పోతుందిమరి పెళ్ళైన బ్రహ్మ చారి కదా అందుకే మరి పెద్ద వాళ్ళ మిదో విమల మీదో కోపమా అవును ఎందుకు కోపం ఉండాలి తనకి చెప్పకుండా తెలియకుండా శోభానన్ని కాన్సిల్ చేసారు అనో  ఏమో లేదా మగతనాన్ని ఫ్రొఫ్ చేసుకోవాలనే తొందర్నో కానీ ఒక రోజు మధు వినయ్ లు ఇద్దరూ వినయ్ ఫ్లాట్ లో హద్దులు మిరిపోయారు.

ఆమె ధనువు అయితే అతను బాణంలా మారిపోయారు ఇద్దరూ స్వర్గ సుఖాలు అనుభవించారు. మొట్ట మొదటి సారిగా పురుష  స్త్రీ స్పర్శను పొందిన ఇద్దరూ రాత్రి ఒట్టు వేసుకున్నారు ఒకర్ని ఒకరు వదలొద్దు అనిఇక వారు రోజు వారి తాపం తీరే దాక మంచం మీదున్న పరుపు నలిగే దాక స్వర్గపు అంచుల్ని చేరే దాక ఆమె లోని లోతు పాతుల్ని కొలిచే దాక వదలలేదు ఇద్దరూఅలా స్వర్గం లో విహరిస్తున్న సమయం లో 

ఒక రోజు విమలని తీసుకుని వచ్చాడు వినయ్ తల్లిదండ్రులు అక్కడ వినయ్ తో పాటు ఉన్న విమాలని చూసి జరిగింది ఏమిటో గ్రహించగలిగారు. బయట నుండి వచ్చిన వినయ్ తల్లిదండ్రులని చూసి గతుక్కుమన్నాడు.తల్లిదండ్రులు ఇద్దరు ఇదేంటని అడిగారు వినయ్ ని 

ఏముంది మీరు నా జీవితాన్ని అదే నాకు చెప్పకుండా నా శోభానాన్ని వాయిదా వేసిన ఫలితం ఇది అన్నాడు నిర్లక్ష్యంగా ఒరేయి అది సంప్రదాయం రా దాన్ని కాదనే హక్కు నీకు నాకే కాదు ఇక ఎవరికీ లేదుఅంత చిన్న విషయానికే నువ్వు పని చేసావు అంటే నువ్వెంత ముర్ఖుడివో అర్ధం అవుతుంది.పెద్దల్ని సంప్రదాయాన్ని కాదనే నిన్ను మా కొడుకువి అని చెప్పుకోవడానికే కూడా మాకు ఇష్టం లేదు.ఇంత చిన్న విషయానికి అగ్ని సాక్షిగా తలి కట్టిన భార్యని వదిలేస్తావా అన్నారు తల్లిదండ్రులువదిలేస్తా అని ఎవరూ అన్నారు ఇద్దరూ ఉంటారు అని అన్నాడు తాపీగా” ..

ఛి నువ్వు ఒక మనిషివేనా ఎం మాట్లాడుతున్నావ్ రేపొద్దున మాకు తల కొరివి పెట్టమని అన్నా కూడా నువ్వు దాన్ని వేరే విధంగా మలుచుకుంటావు కావచ్చు ఛి నీలాంటి వాడ్ని మేమెలా కన్నమో మాకు అర్ధం కావడం లేదు .ప్రపంచ దేశాలన్నీ మనల్ని మన సంప్రదాయాన్ని కొనియాడుతూ ఉంటెఇక్కడ పుట్టి ఇక్కడే పెరిగిన  నువ్వు మాత్రం ఇలా శాస్రాన్ని సంప్రదాయాన్ని కాదంటావా ?ఛి ఛి నీ చావు నువ్వు చావు ఇద్దరు ఉంటారు అంటఛి అమ్మా విమల నీకింకా  వాడు విధoగానూ భర్త కాదుపదమ్మా  మేమే నీకు తల్లిదండ్ర్లమై నీకు ఒక మంచివాడిని చూసి పెళ్లి చేస్తాము

అరేయి వెధవ జరిగిన పెళ్లి మన మధ్యే జరిగింది కాబట్టి దాని గురించి లాయర్ తో మాట్లాడి ఎదో ఒకటి చేస్తాము. కానీ అంత వరకు నువ్వు మా వైపు కానీ మా ఇంటి వైపు కానీ మా  కూతురు విమల వైపు కానీ కన్నెత్తి చూసినా నీ చావు నా చేతిలోనే అంటూ విమల చెయ్యి పట్టుకుని విసా విసా బయటకు నడిచారు వినయ్ తల్లిదండ్రులు.

వారు వెళ్ళిన తర్వాత వినయ్ అబ్బా వాన వెలిసినట్లు గా అయ్యిందిహ పద మధు మనం మన స్వర్ఘ ద్వారాన్ని తెరుద్దామంటూ మధుమిత చేయి పట్టుకున్న వినయ్ ని చిత్కారంగా  చూస్తూ ఛి నువ్వేదో మంచి వాడివి అనుకున్న కానీ నా దగ్గర నీకు పెళ్లి అయ్యింది అన్న విషయాన్నీ దాచి నన్ను మోసం చేసి నన్ను వాడుకున్న నిన్ను ఉరికే ఒదిలిపెట్టను ని అంతు చూస్తా అంటూ చేయి వదిలించుకుని బయటకు వెళ్లిపోయింది మధు మిత . 

అటూ కట్టుకున్న విమలకు దూరమైకన్నవారికి కళంకం తెచ్చిప్రేమించిన ఆడదాని చిత్కారం పొందిన వినయ్ దిక్కు తోచని వాడిలా గది మద్యలో నిలబడ్డాడు రెంటికి చెడిన రేవడిలా అయ్యింది వినయ్ పరిస్థితి తన వలపు వల లో పడిన మధుమిత కూడా తనని చీ కొట్టాడo తో వినయ్ ఒంటరి పక్షిలా మిగిలిపోయాడు………        

Related Posts