వలస పక్షులు

వలస పక్షులు

“వలస పక్షుల ఓలె!, నేడు కుటుంబ వ్యవస్థ
చిన్న భిన్నమై ‘గాజా ‘లోని కథన రంగాన్ని తప్పించుకుని, సురక్షిత ప్రాంతాలకు పెట్టే బేడా సర్దుకుని నిరంతర శ్రమతో, మైళ్ళ దూరాలు జీవితమనే ఆశతో” బ్రతుకు జీవుడా! అని కదిలిపోవడం, ‘ఇజ్రాయిల్ పాలస్తీనా” ప్రాంత వాసు లకు నిత్య కృత్యం అవుతున్నది.

తరాల తరబడి కూడకట్టుకున్న, ఆస్తులను వదిలి, ముసలి ముతక, చిన్నపిల్లల ఆకలి
రోదనలతో,, అనారోగ్య బాధలతో, తల్లిదండ్రులు చంటి పిల్లల భారం మోస్తూ, చేస్తున్న ఆక్రందనల
తో పుడమి దద్దరిల్లింది.

“రష్యా ఉక్రెయిన్ల “మధ్య రగులుతున్న కాష్టం తో
వేలాది కుటుంబాలు సర్వనాశనమై, ‘బ్రతికి ఉంటే
బలసాకు తినవచ్చునని! అనుకుంటూ
వలస పక్షుల వోలే సురక్షిత ప్రాంతాలకు కదిలిపోయే!

‘ప్రపంచ దేశాలు ‘సన్నిహితమై దారుణ మారణకాండను, తక్షణమే ఆపి సర్వజాతి
సుఖశాంతులక పాటుపడవలె!!!.

వేల్పూరి లక్ష్మీ నాగేశ్వరరావు

వలస పక్షులు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *