పున్నమి వెన్నెల
నిశ్శబ్ద రాత్రి
పసిడి ఆకుల
సవ్వడితో.. .
శర్మిష్ట లో
కోరికల్ని రగిల్చిన
కాలం
మెల్లగా……
అడుగు
పెట్టింది
లేత ఆకు పచ్చ
రంగులతో….
ఈ….
ఉదయంలోకి
మన్మధ
తాపం తో
కన్ను
మూసినా…
కుదురు లేక
రాక…
రంగుల
కలలో….
చేదిరి
పోయిందొ
చిరునవ్వుల జల్లు
అయినా….
ఎదో ఒక ఆశ
మనసుకి
మనిషి పై
దేవుని
కరుణ పై
వసంతాల కోసం
యుగాలైన
వేచి చూస్తాం…….
స్వప్నంలో
ఇంద్రదనస్సులను
ప్రపంచానికి
కానుక చేసి….
కలిసి బ్రతుకుదాం
కల కాలం
రాజిత
రమణీయమైన
మానవ
హృదయంలా…
ఆడుతూ……
పాడుతూ….
చేసుకుందాం
హోళి …..
ఆనందాల కేళి
ప్రియమైన అందరికి
నా హృదయ పూర్వక
హోళి
శుభాకాంక్షలు.
మీ అల్లావుద్దీన్