వాడిపోయిన జ్ఞాపకాలు

వాడిపోయిన జ్ఞాపకాలు

వాడిపోయిన జ్ఞాపకాలు

హటాత్తుగా నా జీవితం లోకి వచ్చాడు చైతన్య. నేను ఒక్కో అడుగు వేసుకుంటూ నా ప్రయాణం సాగిస్తున్న సమయంలోనే తాను ఒక పెద్ద నటుడు అయినా నా మొదటి సినిమాలో మొదటి రోజు పూజ జరుగుతున్న సమయం లోనే తనని తాను పరిచయం చేసుకుంటూ ఎర్రని గులాబీల బొకే నీ చేతిలో ఉంచాడు.

అంత పెద్దగా నటుడు యే మాత్రం పొగరు లేకుండా కలిసిపోయారు. నాతో అతను చెప్పే మాటలు అతను నాపై చూపించే కేరింగ్ భాష రాకపోతే తాను దగ్గరుండి నేర్పించడం ఇవన్నీ ఆ సినిమా తో మొదలై తర్వాత కూడా మా మధ్యలో ఎన్నో మాటలు ఎన్నో అనుభవాలు, ఎన్నో ముచ్చట్లు పంచుకుంటూ తాను ఎక్కడికి వెళ్లినా నాతోనే నేను ఎక్కడికి వెళ్లినా తాను నాతోనే ఇదంతా స్నేహం అనుకున్నాం మొదట కానీ తర్వాత తెలిసింది ఇది ప్రేమని…

నేను ప్రేమిస్తున్న అని చెప్పక ముందే తాను చెప్పేసాడు. ఇదంతా నమ్మలేకపోయాను. నా మనసులో ఉన్నది చెప్పకుండానే తెలుసుకునే వాడు భర్తగా రావడం అంటే అమ్మాయికి అంతకన్నా కావాల్సింది ఏముంది, దాంతో నేను సరే అన్నాను.

అంతే పెద్దవాళ్ళు మాట్లాడుకోవడం పెళ్ళి జరగడం అయిపొయింది. ఇక నేను తాను ఇద్దరం కలిసి సినిమాలు చేస్తూ, ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకుంటూ మా కేరిర్ నీ మరింతగా మార్చుకోవచ్చు అనుకున్నా, కానీ….

ఒక్క సినిమాలో నటించిన సీన్స్ నచ్చలేదు అన్నాడు. అన్నీ తెలిసి కూడా తను అలా మాట్లాడతాడు అని ఊహించలేదు నేను. తెల్లారి మామగారు పిలిచారు పక్కనే అత్తగారు ఇక నుండి నువ్వు సినిమాలు మానెయ్యాలి అనే మాటలు వినగానే నాకు పెద్ద బండరాయి పడ్డట్టు అనిపించింది.

ఒక్కో మెట్టు ఎదుగుతూ కష్టపడి ఇంత దూరం వచ్చింది సినిమాలు మానెయ్యడానికి కాదు. నేనేంటో నిరూపించుకోవాలి అనే ఉద్దేశ్యం తోనే నా కేరిర్ మంచి స్థితి లో ఉన్నప్పుడు నేనెందుకు సినిమాలు మానెయ్యాలి అదే అడిగాను..

ఈ ఇంటికి కోడలిగా ఉండాలంటే మానెయ్యాలి అన్నారు. నిజమే మంచి కోడలిగా ఉండొచ్చు ఇంత ఆస్థి నేను సంపాదించిన ఆస్థి కూడా చాలానే ఉన్నప్పుడు మానేసి హాయిగా భర్త కు అన్నీ సమాకురుస్తూ ఉండొచ్చు, కానీ.. కానీ ఇంతగా ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చింది మధ్యలో మానేయడానికి కాదు కాద, నేను బ్రతికి ఉన్నన్నాళ్ళు ఇష్టమైన కళ లో రాణించాలనే నా కల కు సమాధి కట్టమని అంటున్నారు, నేను కాదని అన్నాను. అయితే ఇంకోదారి చూసుకో అన్నారు.

ఆయన వైపు చూసాను నిశ్శబ్దం తప్ప ఏమి లేదు. ఏదైతే నాలో నచ్చింది అన్నాడో అది ఇప్పుడు తనకి నచ్చడం లేదు. ఇప్పుడు నేను దూరం అయితే అతన్ని ప్రతిసారి ఎక్కడో అక్కడ చూస్తాను. అతను బాగుంటే చాలు ఇక నాకేం అక్కరలేదు. తనని ప్రేమించాను తన డబ్బుని కాదు. ఆయన మంచితనాన్ని కాబట్టే నాకు డబ్బోద్దని చెప్పాను…

మౌనంగా నా బట్టలు సర్దుకుని బయటకు వచ్చాను. ఎన్నో మాటలు, ఎన్నో అవమానాలు అన్నీ నా ఆరోగ్యాన్ని దెబ్బ తీసాయి. ఆయన ఫోన్ చేస్తాడని చూసాను.లేదు అంటే నన్ను మర్చిపోయాడా, వేరే పెళ్ళి చేసుకున్నాడు మౌనంగా నా హృదయం రోధించింది.

ఈరోజు నా బట్టలు సర్దుతుంటే ఆయన జ్ఞాపకం మొదటి సారి ఇచ్చిన ఎర్ర గులాబీలు నల్లగా మారి వాడిపోయి కనిపించాయి అచ్చం నా జీవితం లాగే… కానీ వాటి పరిమళం నా జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి అందంగా……

భవ్యచారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *