వాలు జడ

 

చిన్నప్పటి నుండి నాకొక పెద్ద కోరిక అదేంటంటే పెద్ద జుట్టు పెంచుకోవాలని దానితో జడ వేసుకోవాలని అందరితోనూ వాలుజడ అమ్మాయి అని పిలిపించుకోవాలని చాలా కోరిక గా ఉండేది.

దీనికి కారణం ఉంది మా చిన్నప్పుడు మేము ఒక బ్రాహ్మణ విధిలో ఉండే వాళ్ళం, అక్కడ సుస్మిత అనే ఒక అందమైన బ్రాహ్మణ అక్క ఉండేది.

ఆమె చాలా అందంగా ఉండేది పెద్ద పెద్ద కళ్ళు, కాటుకతో ఇంకా పెద్దగా కనిపించేవి. బూరేల్లాంటి బుగ్గలు, అందమైన నాసిక మన సినిమాల్లో బాపు గారి హీరోయిన్ లు కూడా అంత అందంగా ఉండరు అనుకుంటా, ఆమె వేసుకునే లంగా ఓణీలు కూడా అందంగా ఉండేవి బాగుండేవి.

అంటే తన అభిరుచికి అచ్చెరు పొందే వారిమి ఇప్పుడు దాన్నే కలర్ కాంబినేషన్ అంటారు కదా అలా తానూ వేసుకునే దుస్తులు ప్రత్యేకంగా కనిపించేవి.

అలా బట్టలతోనూ, అందంతోనే కాకుండా ఆవిడకు ఉన్న ప్రత్యేకత ఇంకొకటి ఏంటంటే పెద్ద వాలు జడ అదే ఆమెకి ప్రత్యేక ఆకర్షణ, అయితే వారి ఇంటికి ఎవరు వచ్చినా వాలుజడ అమ్మాయి ఇల్లు ఎక్కడ అంటే ఎవరైనా యిట్టె చెప్పడం పరిపాటిగా మారింది.

ఇంకొకటి ఏంటంటే ఆ వీధిలోని బ్రాహ్మణ అబ్బాయిలే కాకుండా మిగిలిన వారు కూడా ఆమె అందంతో పాటు వాలు జడని మెచ్చుకునేవారు, ఆమెని ఆరాధించేవారు. ఒక్క సారి ఆమె చూపు పడినా చాలు అని అనుకుంటూ ఆమె ఎక్కడికి వెళ్ళినా ఆమె వెంట వెనకాలే పది మందికి తక్కువ కాకుండా అనుసరించేవారు.

కాని, ఎవరు ఆమెని ఇబ్బంది పెట్టె వారు కాదు అలా చాలాకాలం ఆమెని ఆరాధించిన వారికీ పెళ్ళిళ్ళలో తమకు కాబోయే అర్దాంగి కి కనీసం ఆమెలా జడ ఉన్నా చాలు అనుకున్నారు, చివరికి ఆమె లా జుట్టు పెంచుకోమని సలహా ఇచ్చారు.

దానికి వారికి కావలసిన సరంజామా కూడా తెచ్చి ఇవ్వడంతో వారి భార్యలు భర్తల కోరికను తీర్చడంలో పడి పోయారు అది వేరే విషయం, కానీ సుస్మిత అక్క ని చూస్తునప్పుడల్లా ఆమె కి ఉన్న ఫ్యాన్ ఫాల్లోయింగ్ ని చూసి నేను కూడా అలా జుట్టు పెంచుకోవాలని అనుకోవడంలో తప్పు లేదుగా అయితే ఆవిడ జుట్టు మోకాళ్ళ కింది వరకు వచ్చేది, అప్పట్లో వాళ్ళ బామ్మ గారు తనకి కుంకుడు కాయలతో రెండురోజులకు ఒకసారి తల స్నానం చేయించేవారు.

ఆపైన ఏవేవో నూనెలు పెట్టి గట్టిగా జడ వేసేవారు, ఆ నూనె ఏమిటో కానీ వాసనా చాలా బాగుండేది. నేను ఆవిడలా జుట్టు పెంచుకోవాలని అనుకున్నా తర్వాత ఇక నా జుట్టుని కత్తిరించలేదు.

అప్పటికే నాకు రెండు పిలకలు వేయడానికి బద్దకించిన మా అమ్మ నాకు బేబీ కటింగు చేయించింది అది పెరగాలి అంటే అక్కలా అవ్వాలి అంటే నాకు ఎన్ని సంవత్సరాలు పట్టాలి అని తెగ భయపడిపోయి ఆ తర్వాతి నెల మా అమ్మ కటింగు చేయిస్తా అంటే వద్దని నేను మా స్నేహితురాలి ఇంట్లో దాచుకున్నా అమ్మకు దొరక్కుండా అది కనిపెట్టిన అమ్మ వచ్చి నన్ను బుజ్జగిస్తూ నీకు ఇష్టం లేకుంటే చేయించను.కానీ ఇలా కనిపించకుండా వేళ్ళకు అంటూ ముద్దు పెట్టుకుంది.

అలా నా కటింగు ఆగిపోయినందుకు నాకు చాలా సంతోషం వేసింది. అయితే మా అమ్మకు నేను ఇంకో విధంగా తల నొప్పిని తెచ్చి పెట్టాను అదేంటంటే ప్రతి రెండు రోజులకు తల స్నానం పోయ్యమని అది అవ్వగానే పట్టించిన కొబ్బరి నూనెలో ఏవేవో వేసి పెట్టమని అంటూ తెగ సతాయించే దాన్ని.

దాంతో అమ్మకు చాలా చిరాకు వచ్చేది నన్ను విసిగిస్తున్నావు అంటూ నా విపు విమానం మోత మొగించేది. అయినా సరే నేను మళ్ళి అదే పాట పడేదాన్ని అంటే నాకు జుట్టు అంటే అంత ఇష్టం అన్న మాట, మా అమ్మ అలా చేయకున్నా నేనే అంటే నాకు నేనే నెత్తి పై నుండి కుంకుడు రసం పోసుకుంటూ చేసేదాన్ని.

ఆ రసం నా కంట్లో పడి మంటలు పెడుతున్నా ఏడవకుండా చేసేదాన్ని, నా స్నానం అయ్యాక నా కళ్ళు ఎర్రగా అయిపోయేవి, మా నాన్నతో చెప్పి కొబ్బరి నూనె పట్టించుకుని వచ్చాను దాన్ని నెత్తి పై గుమ్మరించుకునేదాన్ని, ఇక మా అమ్మ నా అవస్థ చూడలేక వచ్చి నాకు మొట్టికాయలు వేస్తూనే, తిడుతూనే నూనె పెట్టేది.

అమ్మా తిట్టినా, కొట్టినా నాకు కావాల్సింది అక్కలా జుట్టు పెరగడమే కదా అందుకే ఏం అంటున్నా పట్టించుకునేదాన్ని కాదు, మొత్తానికి అలా నా జుట్టుని కత్తిరించకుండా పెంచుకుంటున్నా ఇది చూసి మా అక్కలు ఇద్దరు నీకు ఇదేం పిచ్చే అంటూ ఆటలు పట్టించేవారు అయితే నేను నా జుట్టుకు తీసుకున్న సంరక్షణ అంతే కుంకుడు కాయలు, కొబ్బరి నూనె రాసాను.

కొన్ని రోజులకే, నా ఖర్మ కాలి, ఆ దేవుడికి నేను జుట్టు పెంచుకోవడం ఇష్టం లేక, నాకు టైఫాయిడ్ ని తెప్పించాడు. దాంతో నెల రోజులు నేను జ్వరంతో చాలా బాధపడ్డాను. జ్వరం వల్ల నేను పెంచుకున్న జుట్టు అంతా పోయేసరికి ఆ దిగులు తోనూ, జ్వరం తోనూ నేను చాలా చిక్కిపోయాను.

ఇక నాకు జుట్టు పెరగదు అంటూ పెద్దగా, ఏడుపులు పెడబొబ్బలు పెట్టేసరికి, మా నాన్న గారు నాపై కోప్పడ్డారు, జుట్టు ముఖ్యమా, ప్రాణాలు ముఖ్యమా అంటూ, జుట్టు గురించి మర్చిపోయి జ్వరాన్ని తగ్గించుకోవడంలో మునిగిపోయాను. ఆ తర్వాత జ్వరం తగ్గగానే నన్ను హాస్టల్ లో వేస్తున్నాము అంటూ నా తల్లిదండ్రులు హాస్టల్ లో వేసారు.

దాంతో నేను హాస్టల్ లోనే ఉండిపోయాను. అక్కడ జుట్టు కత్తిరించనక్కర్లేదు కాని తల స్నానం వారానికి ఒకసారి చెయ్యాలి అని తెలిసి, బాధ పడినా, ఇక చేసేది ఏం లేకపోవడంతో అలా వారానికి ఒకసారి చెయ్యడం మొదలు పెట్టాను.

అయితే నేను రెండు జడలు వేసుకునే స్థాయికి (పిలకలే) అయినా నాకు అది ఎంతో గొప్పదే అనిపించేది. జుట్టు పెరుగుతుందని సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. ఎవరికో ఉన్న పుండ్లు నా తలలోకి వచ్చాయి. దాంతో పాటు పేలు కూడా, పుండ్లు, పేల వల్ల మా హాస్టల్ వార్డెన్ మాకు మళ్ళి కటింగ్ చేయించారు.

దాంతో ఇక నాకు అర్ధం అయిపొయింది. జన్మలో జుట్టు పెరిగే అవకాశం లేదని. పెరిగినా ఇలా ఎదో ఒక అవరోధం వచ్చి, జుట్టుని కత్తిరించవలసి వస్తుందని అయినా ఎక్కడో నమ్మకం పెంచుకుంటాను అని. అదే నమ్మకంతో నేను నా పదవ తరగతి పూర్తి చేసేవరకు ఊరికి కూడా వెళ్ళలేదు.

పదవ తరగతి పూర్తి అయ్యాక అమ్మా, నాన్న వచ్చారు తీసుకొని వెళ్ళడానికి. అంతకుముందు సెలవులకి కూడా వెళ్లలేదని నేను ఇంటర్ లో చేరే సమయానికి జుట్టు పెంచుకోవాలి అనే పట్టుదలతో అమ్మతో కుంకుడు కాయలు కొనిపించుకొని మరీ ఊరికి బయలుదేరాను.

అలా చాలా రోజుల తర్వాత మళ్ళి ఊర్లోకి వస్తున్న నాకు, మొట్టమొదట కనిపించింది ఒక శవయాత్ర కొంతమంది ఏడుస్తూ, తీసుకొని వెళ్తున్నారు. అది చూసి మా అమ్మ, నాన్న ఒక పక్కగా, ఆగిపోయారు. వారిని వెళ్ళనిచ్చి చివర వస్తున్న ఒక వ్యక్తిని అడిగారు మా నాన్న గారు, ఎవరు పోయారని, దానికి ఆ వ్యక్తి అయ్యో మీకు తెలియదా బాబు పోయింది వాలుజడ అమ్మాయి. ఈరోజు ప్రొద్దున ఎదో పరిక్షకి అంటూ, ఒక్కతే వెళ్ళింది.

అది అయిపోయాక తన అన్నయ్యని రమ్మందట బైకు మీద. అతను తీసుకురావడానికి వెళ్ళాడు. ఇద్దరు పరీక్ష రాసిన సంతోషంలో కబుర్లు చెప్పుకుంటూ వస్తున్నారట, ఇంతలో ఆమె వాలుజడ మోటర్ బైకు లోని వెనక చక్రంలో ఇరుక్కొని ఆ అమ్మాయి వెనక్కి పడిపోయిందట, అతను చూసేలోపే, వెనక నుండి వస్తున్న లారి, తనని గుద్దేయడంతో, ఆమె అక్కడికి అక్కడే ప్రాణాలు విడిచింది.

తన వాలు జడే, తన ప్రాణాలు తీసింది. పాపం ఒక్కగానొక్క కూతురు, ఎలా తట్టుకుంటారో ఏంటో, అంటూ ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. నాన్నగారు వచ్చి, ఇదంతా చెప్తుండగానే నా కళ్ళలోనుండి నీళ్ళు, నా చేతిలో నుండి కుంకుడు కాయల పొట్లం రెండూ, నా చెయ్యి జారిపోయాయి.

Normal
0

false
false
false

EN-US
X-NONE
HI

/* Style Definitions */
table.MsoNormalTable
{mso-style-name:”Table Normal”;
mso-tstyle-rowband-size:0;
mso-tstyle-colband-size:0;
mso-style-noshow:yes;
mso-style-priority:99;
mso-style-qformat:yes;
mso-style-parent:””;
mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt;
mso-para-margin-top:0in;
mso-para-margin-right:0in;
mso-para-margin-bottom:10.0pt;
mso-para-margin-left:0in;
line-height:115%;
mso-pagination:widow-orphan;
font-size:11.0pt;
mso-bidi-font-size:10.0pt;
font-family:”Calibri”,”sans-serif”;
mso-ascii-font-family:Calibri;
mso-ascii-theme-font:minor-latin;
mso-hansi-font-family:Calibri;
mso-hansi-theme-font:minor-latin;
mso-bidi-font-family:Mangal;
mso-bidi-theme-font:minor-bidi;}

Related Posts

2 Comments

  1. Nice story kani valu jeda valla chanipovadam nachaledu 😫😭 , ala tanaki ayindani manaku avtundi emo ani alochinchi juttu penchukokapote murkatvam antanu anthe 😂

Comments are closed.