"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

విజయ పథాకాన్ని ఎగురవేసేను-స్వతంత్రం

విజయ పథాకాన్ని ఎగురవేసేను-స్వతంత్రం

విజయ పథాకాన్ని ఎగురవేసేను…!!!

మువ్వన్నెల జెండా మురిపెమై
భారతదేశం గర్వించదగ్గ రూపం...
వివక్షతను ఎరుగని వినమృడు
ఆశయం సిద్ధించినదై రాచరిక వ్యవస్థను
కూలదోసిన కారణాలకు అతీథుడు…
దగాకోరుల గుండెలను రజాకారుల
రంపపు కోతలను మొద్దబారుస్తు…
ప్రజాతంత్రాన్ని ప్రజాస్వామ్య పరిచిన
స్వాతంత్ర్య సమర యోధుడు…

నిజాలను మొలకెత్తించిన
నిరాడంబరుడు నిజరూప దర్శనంతో
ఆరడుగుల ఆజానుభావుడు ఆప్తుడు
ఆంగ్లేయులను ఎదిరించిన భారతీయుడు
ఉన్నవాడు లేనివాడనే భేదాన్ని చూపక
సర్వతో ముఖమై ఉప్పు సత్యాగ్రహానికి
ఉద్యమమై కదులుతు…
శాంతి సమరాన్ని రచన చేసిన వ్యూహకర్త
తపనని గెలిపించిన దేశభక్తుడు…

వందన శ్రీకారం కోల్పోయి
భారతావని పరాయి పాలన చేతిలో
వగచరాదని నిండైన హృదయాన్ని
ఒలికి పోనీయక సమైక్యతా భావానికి
బానిసత్వం తోడుకారాదని…
దోసిటిలో దీపమై సమయానికి సూచనై
అడుగు మోపెను పోత పోసిన
ఉక్కు మనిషిగా ఆ గమ్యపు దూరాన్ని
చేజిక్కించు కోవాలని…

వేదాంతాల పారాయణంతో…
పుణ్య భూమిగా సాంప్రదాయాలకు
సత్కర్మలకు నిలయమని…నియమం
తెలిసిన నిరంతరానికి అన్వేషకుడై
మంచి తనంతో మానవత్వానికి
ప్రతి రూపమై సంఘ సంస్కర్తగా
తమ రోజుల ఫలితాన్ని స్వేచ్ఛగా
అనుభవించిన రోజుననే…
అసలైన స్వాతంత్ర్యమని విషయాలకు
వెన్నుచూపని వీరడై విజయ పథాకాన్ని
ఎగురవేసేను…

దేరంగుల భైరవ

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *