విజయ

సుధాకర్, అలివేలు దంపతులు. మగ పిల్లాడి కోసం ఎదురు చూస్తూ, అయిదు మంది ఆడపిల్లలని కన్నారు.పెద్ద జమిను కాబట్టి ఎదో పిల్లలకు ఉన్నంతలో బాగానే చదువు చెప్పించి, మంచి సంభంధాలే చూసి పెళ్ళిళ్ళు జరిపించారు. పుష్ప, సుగుణ, సావిత్రి, తర్వాత నాలుగోది విజయ. అయిదో అమ్మాయి సురేఖ, ఆరవ వాడిగా అబ్బాయి పుట్టాడు కానీ అతను కొన్ని అవకరాలతో పుట్టడం వల్ల సుధాకర్ గారు మనో వ్యధ తో మంచం పట్టారు.
అయితే నాలుగో అమ్మాయి విజయని మాత్రం ఇల్లరికం ఉంచుకోవాలి అని అనుకున్నాడు. ఎందుకంటే పిల్లాడు సరిగ్గా లేడు కాబట్టి. అలంటి సంబందం చూడాలి అని అనుకున్నాడు. అలా చాలా సంబంధాలు వెతికాడు. కానీ, ఇల్లరికం అంటే అంత సులువుగా దొరకరు కదా…. చివరికి ఎలాగో ఒక వ్యక్తిని వెతికారు సుధాకర్ గారు పంతులు సహాయంతో.
పాపం అతని పేరు హరి అతనికి ఒక ముసలి తల్లి తప్ప ఎవరూ లేరు. పెద్ద ఆస్తి పాస్తులు కూడా లేవు. కాబట్టి, ఇంట్లో ఉంటూ తమ మనిషి లాగా అన్ని పనులు పట్టించుకుని చేస్తాడు అని అనుకుని పెళ్లి చేసాడు సుధాకర్ గారు. విజయకు పెళ్లి అయిన కొన్నాళ్ళకు సురేఖకు కూడా బయట సంభందం చూసి పెళ్లి జరిపించారు.
అందరి కంటే చిన్న వాడు అయిన వాసు మాత్రం ఎదగ కుండాకాళ్ళు చేతులు వంకరగా పుట్టి మాటలు కూడా సరిగా రాకపోవడంతో ఎన్నో వైద్యాలు చేయించాడు. తను మంచం పట్టి ఉన్నా కూడా తనకు ఉన్న పరిచయాలు తెలిసిన వ్యక్తుల ద్వారా వాసుని ఒక కొలిక్కి తీసుకుని వచ్చాడు. అతనికి సహాయం చేసింది విజయ భర్త హరి ఒక్కడే దాంతో అతని మీద సదభిప్రాయం కలిగి అన్ని పనులు, వ్యవహారాలు అతనికి అప్పగించారు
కొన్ని రోజులు అయ్యాక హారి తల్లి కన్ను మూసింది. ఇక హరికి మనసులో దుర్భుద్ధి మొదలు అయింది. తను మామగారి ఇంట్లో పని చేస్తున్నట్టుగా నటించి తనకు కావాల్సిన సొమ్మును దొంగతనంగా తీసుకుంటూ అతని సరదాలు తీర్చుకుంటూ ఉండేవాడు. అయితే ఈ విషయాన్నీ ఎవరూ కనిపెట్టలేదు. కొన్ని రోజులకు పొలం మీద వచ్చే రాబడి తగ్గడంతో విజయను పిలిచిన సుధాకర్ గారు తనకు పొలం మీద వచ్చే రాబడి తగ్గినట్టుగా అనుమానం వస్తుంది.
ఇది నీ భర్తని అనుమానించడం కాదమ్మా నేను రేపో, మాపో రాలిపోయే వాడిని ఇక నీ తల్లికి బయట ప్రపంచం తెలియదు వండి పెట్టడం తప్ప లెక్కలు అవి తెలియవు. నీ అక్కలు బావలు ఎప్పుడేమి దొరుకుతుందా అది తీసుకుని వెళ్దామా అని గోతి కాడ నక్కల్లా చూసే వాళ్ళు. కాబట్టి నువ్వు నీ భర్తని ఈ ఇంటి ని అన్ని సమంగా చూసుకోవాలి అని హితవు చెప్పిన రోజు రాత్రే అతను కన్ను మూసాడు..
విజయ పాపం అప్పటి వరకు తండ్రి తల్లి భర్త చాటు ఆడపిల్లగా పెరిగింది. లోకం పోకడ తెలియనిది కావడం వల్ల ముందు ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు. పెళ్లి కాకముందు అప్లయ్ చేసిన అంగన్వాడి టీచర్ ఉద్యోగం తండ్రి చనిపోయిన పది రోజులకు వచ్చింది. అప్పుడు తల్లిని, తమ్మున్ని, భర్తని వదిలి ట్రైనింగ్ కి వెళ్ళాలి అంటే విజయకు మనసు ఒప్పలేదు.
విజయ

కానీ హరి మాత్రం మనసులో సంతోషించి, విజయ నువ్వు అదృష్టవంతురాలివి. నీకు ప్రభుత్వ ఉద్యోగం రావడం నిజంగా అదృష్టమే. దాన్ని వదులుకోకు. నేను ఇక్కడ అన్ని పనులు జాగ్రత్తగా చూసుకుంటాను. మీ వాళ్ళని నా వాళ్ళుగా చూసుకుంటా నువ్వు దిగులు పడకుండా వెళ్ళు అని దైర్యం చెప్తున్నా భర్తను చూసి నిట్టూర్చి అప్పటికే కొన్ని విషయాలు అతని గురించి తెలియడం వల్ల ఆమె మనసులో ఓక నిర్లిప్తత చోటు చేసుకోసాగింది.
ఆ రాత్రి వెళ్ళాలా వద్దా అనేహి చాలా సేపు ఆలోచించింది. ఎప్పటికైనా తమ్ముడు తన ఆస్తిని అడగవచ్చు ఎన్ని రోజులు ఇలా పుట్టింటిలో ఉన్నా తనకు విలువ ఉండదు. అదే ఒక ఉద్య్యోగం ఉంటె ఎలాగైనా బతక వచ్చు తన తమ్ముడికి లోక జ్యనం లేదువాడిని అలాగే వదిలేస్తే అస్తి మొత్తం అక్కల పరం చేసుకుంటారు. అక్కలు మన వారు అయినా బావలు మన వాళ్ళు కారు కదా.పైగా తన తండ్రి తన మిద తల్లిని తమ్ముడు బాధ్యతను పెట్టి వెళ్ళాడు వాడికి ఎదో ఒక దారి చూపించాలి అంటే ఈ ఆస్తిని కాపాడాలి.
అలాగే తను వాళ్ళ మిద బతుకుతున్న అనే పేరు రాకుండా చూసుకోవాలి అంటే ఈ ఉద్యోగానికి వెళ్ళాలి తప్పదు అని అనుకుని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కళ్ళు మూసుకుంది.
తెల్లారి తల్లికి తమ్మున్ని భర్తకు అప్పగించి, తను తన బట్టలు అవి తీసుకుని ట్రైనింగ్ కి వెళ్ళింది విజయ. విజయ వెళ్ళాక హరి కి స్వేచ్చ వచ్చినట్టుగా అయ్యింది. విజయ వచ్చే వరకు అతనికి ఒక రాజ్జ్యం అతను దానికి రాజుల భావించి ఆడింది ఆటగా పాడింది పటాగా మెలగ సాగాడు. అత్తను, బావమరిదిని గాలికి వదిలి డబ్బు తీసుకుని తాగడం, తినడం అలాగే భార్య తీర్చే కోరికలను డబ్బు ఇచ్చి ఒకవిడను భార్యగా ఉంచుకుని ఆమెకు డబ్బుని విచ్చల విడి గా ఖర్చు పెట్టాడం మొదలు పెట్టాడు .
అత్త అది గమనించినా కూడా అల్లుడు అని మర్యాద ఇచ్చి ఏమి అనలేక పోయింది. ఇక వాసు అతని లోకమే వేరు అతను ఏమి పట్టించుకునే వాడు కాదు. అలా అతని సరదాలు తీర్చుకునే అవకాశం కూడా విజయే అతనికి ఇచ్చినట్టుగా అయ్యింది.
నెల రోజులు ట్రేనింగ్ అయ్యాక విజయ భర్తకు కబురైనా చెయ్యకుండా తన ఊరికి వచ్చింది. విజయ ట్రైనింగ్ లో ఉన్నప్పుడు భర్త హరి గురించి కొన్ని నిజాలు అంతకు ముందే తెలిసినా మళ్ళి ఇప్పుడు కొత్తగా కొన్ని తెలియ సాగాయి. అయినా ఆమె తన కల్లారా అదేంటో చూడాలి అని కళ్ళ తో చూడకుండా దేన్నీ నమ్మకుడదని భావించి చెప్ప చేయకుండా ఇంటికి బయలుదేరి వెళ్ళింది
విజయ అక్కడికి వెళ్ళే సరికి తల్లి, తమ్ముడు ఇద్దరు బయట వరండాలో నిలబడి ఉన్నారు. లోపల తలుపులు వేసి ఉన్నాయి. తమ్ముడు కాళ్ళు, చేతులను ఒక స్తంబానికి కాటేసి ఉన్నాయి. వాడు దాన్ని విడిపించుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉండగా, తాడు తెగి రక్తం కారుతుంది. తల్లి అది చూస్తున్నా కూడా ఏమి మాట్లాడకుండా నిశబ్దంగా శూన్యం లోకి చూస్తూ కూర్చుంది. విజయ గబుక్కున వచ్చి తమ్ముడి కట్లు తెంపి, అమ్మా ఏం అయ్యింది అమ్మ? ఇక్కడ ఎందుకు ఉన్నారమ్మా? లోపల ఎవరూ ఉన్నారు? అని అడిగింది తల్లిని..
కానీ, తల్లి విజయ వైపు ఒక్కసారి చూసి మళ్ళి తల దించుకుంది. విజయను చూస్తూ తమ్ముడు వాసు, అక్క, బావ లోపల అని ఎదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ, మాటలు రావడం లేదు. విజయ తల్లిని గమనించింది ఆమె చెంప కమిలి పోయినట్టుగా ఉంది. ఏమి జరిగి ఉంటుందో అని ఆలోచించిన విజయకు పిచ్చి కోపం వచ్చి తలుపులను ఒక్క తన్ను తన్నింది.
అవి ఆమె తన్నిన తన్నుకు తెరుచుకున్నాయి. తనలో అంత బలం ఉందని గుర్తించని విజయ కూడా ముందు ఆశ్చర్య పోయి, తేరుకుని లోనికి వెళ్ళింది. అక్కడ తన మంచం మిద తన భర్త ఇంకొక ఆవిడ తో పడుకున్న దృశ్యం చూసి శివంగిల వంటింటి లోకి వెళ్ళి కట్టి పితను తీసుకుని వచ్చింది. తను వచ్చిన అలికిడి అయినా కూడా వాళ్ళు లేవకుండా అడ మరిచి నిద్రపోవడం చూసి కాలి తో మంచాన్ని తన్నడంతో ఉల్లిక్కి పడి లేచిన ఆ యువతి విజయని ఆమె చేతి లోని కత్తి పిటని చూస్తూనే గబుక్కున మంచం దిగి కింద పడి ఉన్న తన చిరని తీసుకుని బయటకు పరుగెత్తింది.
ఆమె లేవడంతో మెలకువ వచ్చిన హరి కూడా విజయాని చూసి లేచి తడబడుతూ నిలబడ్డాడు. అతన్ని చంపే ఉద్దేశ్యం విజయకు లేధు. కానీ, తన స్థానాన్ని ఇంకోదానికి ఇచ్చిన వాడిని చంపాలా వద్దా అని ఒక్క నిమిషం ఆలోచించింది. విజయ చంపితే తను జైలుకు వెళ్తుంది. అప్పుడు తన తల్లి, తమ్ముడు ఇద్దరు కూడా ఒంటరి వాళ్ళు అయిపోతారు. తన బావలు వారిని ఇంతకన్నా హీనంగా చూస్తారు. ఆస్థి కోసం చంపినా చంపవచ్చు. కాబట్టి వీళ్ళకు అండగా నేను ఉండాలి. నా జీవితం ఇక్కడితో అయిపోలేదు. నేను వారి కోసమే బతకాలి అని ఆలోచన వచ్చి. హరి ని చిత్కారంగా చూస్తూ తాళలు ఇవ్వు అని అంది కత్తి పిటని ఇంకా బాగా పట్టుకుంటూ… అతను తాళాలు ఇచ్చాడు. ఇంకేమైనా ఉన్నాయా అని అడిగింది లేవు అని అన్నాడు. లేదు ఇంకేం ఉన్నాయి. నువ్వు ఎంత దాచుకున్నావు అని అంది .
లేదు దాచుకోలేదు. అన్ని దానికే పెట్టాను అని చెప్పాడు. అయినా సరే నువ్వు నీ బట్టలు సర్దుకో అని అంది. ఎందుకు విజయ తప్పు అయింది. దయచేసి ఈ ఒక్క సరి నన్ను క్షమించు ఇక ముందు ఇలా చేయ్యను అని అన్నాడు ధీనంగా, ఛి నా పేరు కూడా పలకడానికి నీకు అర్హత లేదు, నువ్వు ఒక మనిషివేనా? నిన్ను ఆదరించి అల్లున్ని చేసుకున్నందుకు నా తల్లినే కొడతావా.. సిగ్గు లేదు? ఛి నీతో మాటలు అనవసరం. పద బయటకు అని అతన్ని ఆ గదిలోంచి బయటకు పంపిసి అక్కడే ఉన్న అతని పెట్టెని తీసుకుని వచ్చి బయట విసిరేసింది. ఇదంతా నిర్లిప్తంగా చూస్తూ కూర్చుంది తల్లి.
హరి చూస్తూ చూడు ఇక ఇక్కడ నీ ఆటలు సాగవు నువ్వు నాకు భర్తగా పనికి రావు. నీకు నాకు ఎ సంబంధం లేదు. వెళ్ళిపో మళ్ళి జీవితం లో నువ్వు నాకు కనిపించాకుడదు అని అంది. అతను ఎదో అనబోయాడు కానీ విజయ వినకుండా కత్తి పిటను అతని కాళ్ళా ముందు పడేలా విసిరి, తల్లిని, తమ్మున్ని తీసుకుని లోపలి వెళ్ళిపోయి. తలుపులు మూసేసింది.
అటూ అక్కా, బావలకు విషయం తెలిసి వాళ్ళంతా వచ్చారు. ఏంటి అని అడిగారు. విజయ ఏమి చెప్పలేదు. కానీ, వాసు మాటల వల్ల నిజం తెలుసుకుని కొంత గ్రహించి మరి ఇప్పుడేమి చేస్తావు అని అడిగారు. ఏమి లేదు నా లోకం వాసు ఒక్కాడే నేను వాడికి తల్లిలా మారాలని అనుకుంటున్నా అని అంది.
వాళ్ళు ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. కానీ, విజయాని మనసులో తిట్టుకుంటూ ఇక విజయ వాసుని తన బిడ్డలా భావించి ఎక్కడేక్కడో తిరిగి అతను మంచిగా మాట్లాడేలా అన్ని అర్ధం చేసుకునేలా అతన్ని తయారు చేసింది. ఆమె ఆ పనిని ఒక యజ్ఞంలా చేసింది. రాత్రి పగలు చదివించి అతన్ని అన్నింటిలోనూ ముందు ఉండేలా శిక్షణ ఇచ్చింది.
వాసుకు అతనికి ఉన్న అంగ వైకల్యం వల్ల ఉద్యోగo తొందర గానే వచ్చింది.ఇక ఆస్తిని అంతా ఒక కొలిక్కి తెచ్చి మగరాయుడిలా అన్ని చూసుకుంది. తండ్రి తన మీద పెట్టిన బాద్యతను నిర్వర్తించి తమ్ముడుకు ఒక పేద పిల్లను, మంచి పిల్లను చూసి పెళ్లి చేసి తన కర్తవ్యాన్నితన తండ్రి తన మిద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసి తన పేరు లోని విజయాన్ని విజయంగా మలుచుకున్న విజయ స్త్రీ జాతికే తలమానికంలా నిలిచి పోయింది…..