అక్షర కొరకు
అంశం:ఉపాధ్యాయ దినోత్సవం
శీర్షిక :విద్య జీవనశైలి
విద్య జ్యోతిర్ముఖి
హృదయంలో రగిలించే
విజ్ఞాన విప్లవం
మనస్సు పొంగిపొర్లే
విలువల జీవితం
చైతన్య స్రవంతి !
మనస్సు పరిమళభరితం
హృదయం మార్థవం
జీవితం సుందరమయం
రగిలే జ్ఞాన సముపార్జనలో
అంతర్ముఖంలో ఆత్మజ్ఞానం
నడత నయనానందకరం
జీవితం సఫలీకృతం విద్యతో !
మూర్ఖత్వం మటుమాయం విద్యతో
అక్షరాలు తీర్చిదిద్దేను శీలం
జీవన నైపుణ్యాలు నేర్పు విద్యాలయం
అజ్ఞానం పటాపంచలవును
వెలుగులు చిందే జ్ఞానజ్యోతి కింద
పరిపక్వమవును జీవితం !
నిరుపేదలకు అక్షరం కల్పతరువు
అక్షరం అంబులపొదిలో బాణం
అభాగ్యులకు అక్షరం వెన్నుదన్ను
మనోవైకల్యాలను మానిపేది అక్షరం
అక్షరాలే విప్లవాలకు జీవం !
అపరాజిత్
సూర్యాపేట