అక్షర కొరకు
టీచర్స్ డే సంధర్బంగా
రచన – ఉమాదేవి ఎర్రం
శీర్షిక – విద్య లేని వాడు
విద్య లేని వాడు వింత పశువు
అన్నారు ఆనాడు..
విద్య ఎక్కువై విపరీత ధోరని లో
ఈనాడు..
నాటి సమాజంలో గురువు దైవం తో
సమానం..
నేటి సమాజంలో గురువును దూషించ
డమే సంస్కారం..
గురువు లేని విద్య లేదు ఆ రోజుల్లో..
అసలు గురువుతో అవసరమే లేదు ఈ రోజుల్లో..
గురువును పూజించడం హిందూ సాంప్రదాయంలో
ఆచారం..
గురువును దూషిస్తూ అగౌరవ పరచడం నేటి
కాలం..
పురాణాల్లో గురువు భోధించిన విద్య నే
నేటికి ఆచరించడం మన ధర్మం..
గురువులను పూజించుకోవడం మన లక్షణం..
డా.సర్వేపల్లి రాధా కృష్ణ జయంతి రోజున
గురు పూజోత్సవం మన సాంప్రదాయం!
గురు పూజోత్సవ సంధర్బంగా గురువు లందరికీ
వందనాలు!
ఇది నా స్వీయ రచన..