విరహ వేదన (The Actual Pain of Separation 4)

విరహ వేదన

విరహ వేదన
విరహ వేదన

లలిత కొంచెం ఈ ఫ్యాన్ వేసి వెళ్ళవా అని పిలిచింది రాధాబాయి.వస్తున్న అత్తాయ్యా అని అంటూ చేతిలో ఉన్న పనిని వదిలేసి గబగబా వచ్చి అత్తయ్య దగ్గరగా ఉన్న ఫ్యాన్ చేసి వేసి అత్తయ్య చీర సరి చేసి నీకు ఎందుకమ్మా ఇవన్నీ ఒక పనిమనిషిని పెడితే చూసేది కదా అని అంది.

 

ఆ మాటలు విని అక్కడే కూర్చుని అమ్మ పని మనిషి డబ్బు కోసం మాత్రమే పనిచేస్తుంది అనే మమకారంతో చూసే చూపు మనసుకి తృప్తి కలిగిస్తుంది.ఇంకెప్పుడూ అలా అనకండి మా అమ్మ ఇలా ఉంటే నేను చేసే దాన్ని కాదా మీరు నా కన్నతల్లి కంటే ఎక్కువ ఉన్నది ఇద్దరమే కదా మీ పనులన్నీ అయ్యాక నా పని చేసుకుంటా ..

 

నన్ను నన్ను కోడల్ని చేసుకుని నాకు జీవితాన్ని అర్ధాన్ని పరమార్ధాన్ని కలిగించిన మీరు నాకు సంఘంలో ఒక గుర్తింపు ఇవ్వడం ఇదంతా నీ చలవే అమ్మ అని అంటున్న కోడల్ని అపురూపంగా చూసింది రాధాబాయి.

 

ఇంతలో పోస్ట్ అనే కేక అది ఎక్కడి నుండో  తెలిసిన లలిత మొహం ఎర్రబారింది బుగ్గల్లోకి కెంపులు కళ్ళల్లో నీలాలు తళుక్కున మెరిసి మాయం అయ్యాయి  కోడలి మొహం లో మారిన భావాలను దగ్గరగా చూస్తూ ఏదో గుర్తొచ్చి పెదవులమీద దరహాసం వెల్లివిరిసింది.

 

వెళ్లమ్మ వెళ్ళు నీకు కావాల్సింది నువ్వు ఎదురు చూస్తున్నది వచ్చేసింది అని బయటకు పంపింది రాధాబాయి లలితను పరుగున వెళ్లి పోస్ట్మాన్ వదిలి వెళ్ళిన ఉత్తరాన్ని తీసుకొని సిగ్గుతో లోపలికి పరుగెత్తి న లలిత తలుపులు వేసేసి ఉత్తరాన్ని తీసుకొని బరువు చూసింది

 

ఉత్తరం ఎంత బరువుగా ఉంటే దాంట్లో అంత విరహం ఉందని అర్థం. దాన్ని అలాగే గుండెలకు హత్తుకుని మంచం మీద బోర్లా పడుకుంది తన గుండెల మీద ఎదో బరువు ఉందనే భావన తో గుండెల వైపు చూసుకుంది అక్కడ రాజేష్ కళ్ళు చిలిపిగా నవ్వుతూ ఉన్నట్టుగా అనిపించి ఉలిక్కిపడి వెల్లకిలా తిరిగింది.

 

ఉత్తరం ఆకాశాన్ని చూస్తున్నట్లుగా ఉంది దాన్ని గుండెల పై నుండి తీసి చేతిలో తో అర చేతిలో పెట్టిన రాజేష్ వేలు గుర్తొచ్చి కిలకిలా నవ్వింది తెలియకుండానే

విరహ వేదన

 

ఆమె నవ్వుతున్నప్పుడు కదిలిన కదలికలకు ఉత్తరం పలుచని, ఉందా లేదా అన్నట్టుగా ఉన్న ఆమె పొట్ట మీద పడి అక్కడ రాజేష్ తన మిల్ట్రీ మీసాలతో చేసిన చిలిపిపని గుర్తొచ్చి మెలికలు తిరిగింది లలిత తిరిగి ఉత్తరాన్ని తీసి చేతిలో పట్టుకుంటే తొలిరాత్రి రాజేష్ తనకు ఎన్ని ముద్దులు పెట్టాడో గుర్తొచ్చి చెంపల్లో కెంపులు విరిశాయి.

 

ఉత్తరాన్ని మెల్లిగా విప్పుతుంటే రాజేష్ తన వస్త్రాలను ఒక్కొక్కటిగా తీసి వేస్తున్న సన్నివేశం గుర్తుకొచ్చింది ఏమో ఉత్తరాన్ని తెరవకముందే ఇంతలా వేడి పుట్టిస్తున్న భర్త చిలిపి పనులకు మత్తు గావించుకొని అప్పుడే నా అన్నట్టుగా బుంగమూతి పెట్టింది ఎన్ని ఫోన్లు వీడియో కాల్స్ చేసుకునే వీలు ఉన్నా కూడా తమ ఇద్దరికీ ఇలా ఉత్తరాలు రాసుకోవడం ఇష్టం

 

ఎందుకంటే ఎవరూ చదవరు ఈ రోజుల్లో ఉత్తరాన్ని ఎవరు చదువుతారు, ఉత్తరం పైగా చెప్పాలనుకున్నవి చెప్పాల్సినవి లోపలి నుండి వచ్చే ఇష్టాలు అయిష్టాలు అన్ని అందులో రాసి పంపి అది చదివిన తర్వాత వారు అనుకుంటున్నారు వారి అభిప్రాయమేమిటో అని ఎదురు చూస్తూ వారి సమాధానం కోసం నిరీక్షిస్తూ ఉండడం లోని సంతోషం సుఖం ఎదురుచూపులోని హాయి ఎంతమందికి అర్థం అర్థమవుతుంది కదా

 

అందుకే తాను రాజేష్ కి ఈ సలహా ఇచ్చింది దానికి రాజేష్ కూడా సంతోషంగా ఒప్పుకున్నాడు.
పెళ్లికి ఆరు నెలలు సెలవు పెట్టి వచ్చాడు సెలవు అయిపోగానే వెళుతున్న అతని లగేజీ తో పాటు ఉత్తరాల కట్ట కూడా పెట్టింది. దానికి రాజేష్ నవ్వుతూ అబ్బా రాణి గారికి అప్పుడే విరహం మొదలైందే అన్నాడు

 

తనను కౌగిలిలో బంధించి ఉక్కిిబిక్కిరి చేస్తూ గుర్తుకు రాగ తన భర్త చిలిపి పనులను తల్చుకుంటూ ఉత్తరాన్ని సుతారంగా విప్పుతున్న లలితకు తమ మొదటి రాత్రి సంఘటన జ్ఞాపకం రాగా బుగ్గలు అరుణమను దాల్చాయి, అదేంటంటే ఆ రోజు అతని షర్ట్ బటన్స్ ఇలాగే సుతారంగా విప్పుతుంటే రాజేష్ చిలిపిగా ఇక ఈరోజు మన శోభనం జరిగినట్లే అని తనని ఆటపట్టించడం గుర్తొచ్చి సిగ్గుల మొగ్గయ్యి, ఉత్తరాన్ని విప్పింది.

 

అక్షరాల వెంట కళ్ళు పరుగులు పెట్టాయి ప్రియా నాలో సగభాగం నా బాధ్యతలు మోస్తున్న నా అర్ధనారి నీకు నమస్సులు చెప్పాలంటే నా కంటే చిన్నదానివి అని తలచి నా డార్లింగ్ ఎలా ఉన్నావు నీ అందమైన అధరాలు ,కెంపులు విరజిమ్మే బుగ్గలు అవును ఇక్కడ ఆపిల్ ను చూసినప్పుడల్లా నాకు నీ బుగ్గలే గుర్తొచ్చి కసుక్కున కొరకేస్తా,

 

ఏంటో అనుకుంటున్నావా యాపిల్స్ ని నన్ను చూడగానే నీ కళ్ళల్లో మెరుపులు నీ అందమైన తెల్లని సంపెంగ లాంటి ముక్కు చిన్న, ఎర్రని పెదాలలతో ఉం డే నీ చిన్ని నోరు శంఖాని కే అసూయ పుట్టేలా ఉన్న మెడ, కాస్త కిందుగా రెండు ఎత్తయిన కొండల మధ్య పారే సెలయేరులా ఉన్న నాభి,

 

అందులో పాలు పోసి తాగొచ్చు తెలుసా అంత లోతు మరి అందమైన కటి భాగం ఆతరువాత మానవజన్మకు మూలమైన సృష్టి రహస్య భాగం, అందమైన బలమైన తొడలు తమలపాకులాంటి పాదాలు వాటికి నువ్వు రాసుకునే పసుపు పసుపు కే అందం తెచ్చే మువ్వలు ఆ పాదాలను చూస్తూ జీవితాంతం గడపాలి అంటే నువ్వు నవ్వుతావ్ ఏమో

 

కానీ ప్రియా ఇక్కడ నాకు నువ్వు గుర్తుకురాని క్షణం లేదంటే నమ్ము,మనం మొదటి రాత్రి ఎంత ఉల్లాసంగా గడిపాము నిండైన ఆకాశంలో నాకు చందమామ లా నువ్వు కనిపిస్తుంటే ఆ రాత్రి చుక్కలను లెక్క పెట్టలేక సుదూరాన ఉన్న నా అర్థ శరీరంశరీరం నాలో సగభాగం తలపుకు వచ్చి

 

విరహాన్ని తాళలేక లేచి అటు ఇటు తిరుగుతూ ఉంటే, నాలాగే విరహాన్ని అనుభవిస్తున్న నా సావాసగాళ్ళు పాటలు వింటూ ఇదిగో నీకు కేటాయించిన పెట్టెలో నువ్వు పెట్టిన, రాసిన ఉత్తరాలు తీసి చదువుతూ నీకు సమాధానం రాస్తున్నా ఇప్పుడు సమయం ఎంతో తెలుసా ప్రియా ఒకటిన్నర అంటే పొద్దున కాదు రాత్రి ఈ సమయంలో ఎటునుండి ఏ శత్రువులు దాడి  చేస్తారో అన్నీ తెలిసి ఉన్నా ప్రమాదం ముంచుకొస్తుందని అనుమానం కలిగిన దూరంగా తుపాకుల శబ్దాలు వింటూ.

 

ఆ చప్పుడుకు వెన్నులో వణుకు వస్తున్నా నీ మీద నా దేశం మీద నాకున్న ప్రేమ ను తెలియజెప్పాలని నీకు ఇంత రాత్రి జాబు రాస్తున్నా ఇక్కడ పనిలో ఉండి కాస్త లేట్ అయినా నీకు నా జాబు అందుతుందని నా నమ్మకం, ప్రియా నా అనువణవున దేశభక్తి ఎలా ఉప్పొంగుతున్న దో నీ మీద నా ప్రేమ కూడా అంతే నా శరీరం నీ పొందు కోసం తహతహలాడుతున్న నా మనసులో మాత్రం ఇదే నీ కర్తవ్యం అంటూ హెచ్చరిస్తుంది.

 

లల్లి మనకు అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుడితే ఇలాగే జవాన్ నీ చేద్దాం ఏమంటావ్ నాకు తెలుసు నీ ఇష్టం అనే కదా నువ్వు అనేది సరే అదిగో మూతిని అలా పెడితే సున్నాల చుడితే చటుక్కున కోరికెయ్యలనిపిస్తుంది నీ గుండెల మీద తలవాల్చి పని చేసే చప్పుడు వింటూ నేను కట్టిన తాళి తో ఆడుకుంటుంటే

 

నువ్వు నా జుట్టులోకి వేళ్ళు పెట్టి ఉంటే ఆ క్షణాలు అపురూపము కదా మళ్లీ ఆ క్షణాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను వచ్చాక ఉత్తరాల్లో రాసిన ప్రతి మాట నిజం చేస్తానని నీ అందమైన నీలాల కనుపాపల మీద ప్రమాణం చేస్తున్నా అదిగో అప్పుడే అందరూ లేచారు చూశావా నీ జ్ఞాపకాలలో నీకు జాబు రాస్తూ నాకు సమయమే తెలియలేదు.

 

మరి ఉండనా కోటి ముద్దులతో నీ సమాధానం కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తూ నీ ప్రియ విభుడు ….

 

అది చదివిన లలిత భర్తతో నిజంగానే కళ్ళకు కట్టినట్లుగా మాట్లాడిన మాటలు శరీరాన్ని వేడిగా మార్చి  లోపలి నుండి శరీరాన్ని దహించి వేస్తునన్నట్లుగా అనిపించి, శరీరాన్ని మనసును అదుపులోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉత్తరాన్ని మూసి మెల్లగా లేచి ఉత్తరాన్ని బెడ్ కింద  పెట్టేసి బాత్రూంలోకి వెళ్లి షవర్ కింద నిలబడి తన శరీరా తాపాన్ని తీర్చుకుంటోంది…… లలిత ..

 

 

 

Related Posts