విలియం షేక్స్పియర్ (ఆంగ్లము : William Shakespeare) ( 1564 ఏప్రిల్ 26 న బాప్తిస్మం పొందినాడు – 23 ఏప్రిల్ 1616న మరణించాడు, ఒక ఆంగ్ల కవి, నాటక రచయిత, నటుడు. ప్రస్తుతము చాలామంది ఇతన్ని గొప్ప ఆంగ్ల రచయితగానూ, ప్రపంచ నాటక రచయితలలో మిన్నైన వానిగానూ గుర్తిస్తున్నారు. ఇతన్ని తరచూ ఇంగ్లాండు జాతీయ కవిగానూ, బార్డ్ ఆఫ్ అవాన్ (కవీశ్వరుడు) గానూ పిలుస్తారు. ఇతని రచనల్లో ప్రస్తుతం 37 నాటకాలు, 154 చతుర్పాద కవితలు (సొన్నెట్ – పద్యాలు), రెండు పెద్ద వ్యాఖ్యాన కవితలు (narrative poems), ఇంకా చాలా ఇతర కవితలు లభిస్తున్నాయి. ఇతని నాటకాలు ప్రపంచంలోని అన్ని ముఖ్య భాషల్లోకీ తర్జుమా చెయ్యబడినాయి, అంతే కాకుండా ఏ ఇతర నాటకాలూ ప్రదర్శించనన్నిసార్లు ప్రదర్శించబడినాయి.
షేక్స్పియర్ స్ట్రాట్ఫోర్డ్-అపాన్-అవాన్ లో జన్మించాడు. ఇక్కడనే పెరిగి పెద్దవాడయినాడు. పద్దెనిమిది సంవత్సరాల వయసులో అన్నే హాథవేను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం, మొదటి కానుపులో సుసాన్నా హాల్ అనే అమ్మాయి, తరువాత కానుపులో హామ్నెట్, జూడిత్ క్వినే అను కవలలు జన్మించారు. రమారమి 1585 – 1592 ల మధ్య కాలంలో స్వంత ఊరినుండి లండన్ వెళ్ళి నటుడు, రచయిత,, చాంబర్లేన్ ప్రభువు మనుషులు) (తరువాతి కాలంలో ఇదే కంపెనీ రాజు గారి మనుషులు కింగ్స్ మెన్ అను నాటకాల కంపెనీలో భాగస్వామిగా విజయవంతమైన జీవితం కొనసాగించాడు. 1613లో తిరిగి స్వంత ఊరికి విశ్రాంత జీవితానికి వెళ్ళినట్లు తెలుస్తుంది. ఆ తరువాత మూడు సంవత్సరాలకు అక్కడే మరణించాడు. షేక్స్పియర్ వ్యక్తిగత జీవితం గురించిన ఆధారాలు కేవలం కొన్ని మాత్రమే లభిస్తున్నాయి. మిగిలిన శూన్యాన్ని భర్తీ చెయ్యడానికి ఎన్నో కల్పనలు కల్పించబడినాయి. ఈ కల్పనల్లో అతని శృంగార జీవితం, ధార్మిక జీవితం, అతని రచనలు నిజంగా అతనే వ్రాశాడా అన్నటువంటి అనుమానాలు ఉన్నాయి.
ప్రస్తుతం లభిస్తున్న రచనల్లో చాలావరకూ 1590, 1613ల మధ్య వ్రాసినవి. తొలినాళ్ళలోని షేక్స్పియర్ నాటకాలు, హాస్యరస ప్రధానమైనవీ, చారిత్రక నేపథ్యం కలవి ఉన్నాయి. పదహారవ శతాబ్దంలోనికి ఇతని రచనల్లోని కళాత్మకత, నాణ్యత గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఆ తరువాత ఇతను 1608 వరకు ఎక్కువగా హామ్లెట్, లియర్ రాజు, మాక్ బెత్ వంటి విషాద నాటకాలు వ్రాసినాడు. ఈ నాటకాలు ఆంగ్ల భాషలోనే గొప్పవిగా కొనియాడబడుతున్నాయి. జీవితపు చివరి అంకంలో ఇతను షేక్స్పియర్ విషాదాస్య నాటకాలు రస ప్రధాన (tragicomedies) నాటకాలు వ్రాసినాడు. ఇంకా ఇతర నాటక రచయితలతో కలిసి కొన్ని రచనలు చేసాడు. ఇతని నాటకాలలో చాలావరకూ తన జీవిత కాలంలోనే ప్రచరించబడినాయి, కాకపోతే ఒక ముద్రణ నుండి మరొక ముద్రణకు మధ్య చాలా తేడాలు ఉన్నాయి. 1623 వ సంవత్సరంలో ఇతని నాటక కంపెనీలో సహచరులు ఇతని మొదటి పూర్ణ రచనా సంపుటిని ప్రచురించారు. ప్రస్తుతం షేక్స్పియర్విగా గుర్తించబడిన నాటకాల్లో రెండు తప్ప అన్నీ ఇందులో ఉన్నాయి.
“విలియం షేక్స్పియర్” తండ్రి పేరు జాన్ షేక్స్పియర్. తల్లి పేరు మేరీ ఆర్డెన్. తండ్రి జాన్ షేక్స్పియర్, ఓ విజయవంతమైన చేతి తొడుగుల వ్యాపారస్తుడు (గ్లోవర్ – glover), పెద్ద అధికారి ( alderman – మేయర్ తరువాత పెద్ద సభ్యుడు). జాన్ షేక్స్పియర్ అసలు ఊరు స్నిట్టర్ఫీల్డ్. విలియం షేక్స్పియర్ తల్లి మేరీ ఆర్డెన్ పెద్ద మోతుబరి రైతు కుమార్తె. షేక్స్పియర్ తన తల్లిదండ్రుల ఎనిమిదిమంది సంతానంలో మూడవవాడు, జీవించిన వారిలో పెద్దవాడు. విలియం షేక్స్పియర్ స్ట్రాట్ఫోర్డ్-అపాన్-అవాన్ లో జన్మించాడు. 26 ఏప్రిల్ 1564న బాప్టిజం పొందినాడు. ఇతని కరక్టు పుట్టిన రోజు మాత్రం తెలీదు. కానీ సంప్రదాయానుసారం ఇతని పుట్టిన రోజు ఏప్రిల్ 23 సెయింట్‌జార్జి దినం నాడు జరుపుతారు. దీనికి ఎటువంటి చారిత్రిక ఆధారాలూ లేవు. ఈ సంప్రదాయం పద్దెనిమిదవ శతాబ్దంనాటి ఓ విద్వాంసుడి పొరపాటుగా తేలుతుంది. ఏప్రిల్ 23 నే షేక్స్పియర్ మరణించిన విషయం గమనార్హం . షేక్స్పియర్ చదువుకున్న స్కూలు గురించి ఎటువంటి స్పష్టమైన ఆధారాలూ లభించకపొయినా ఇతని జీవిత చరిత్ర వ్రాసినవారిలో ఎక్కువ మంది 1553లో ప్రారంభం అయిన ఉచిత బడి అయిన స్ట్రాట్ఫోర్డ్ లోని రాజుగారి కొత్త బడి (కింగ్స్ ఫ్రీ స్కూల్ ) లో చదివినాడు అను విషయంలో ఏకీభవిస్తున్నారు. ఈ బడి షేక్స్పియర్ ఇంటినుండి పావు మైలు దూరంలో ఉంది. ఎలిజబెత్ యుగంలోని వ్యాకరణ బళ్ళు నాణ్యత విషయంలో ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉండేవి, కానీ సిలబస్ మాత్రం ఇంగ్లాండు మొత్తం ఒకటే ఉండేది. ఆ ప్రకారం మనం షేక్స్పియర్ చదివిన విద్యాలయంలో ల్యాటిన్ వ్యాకరణం, పౌరాణిక శాస్త్రాలు (క్లాసిక్స్) బాగా చదివించి ఉంటారని చెప్పవచ్చు.
18 సంవత్సరాల వయసులో షేక్స్పియర్ 26 సంవత్సరాల వయసుగల అన్నే హాతవే అను ఆమెను పెళ్ళి చేసుకున్నాడు. వోర్సెస్టర్ లోని డియోసెస్ లోని కన్సిస్టరీ కోర్టు వారు 1582 నవంబరు 27న వీరి పెళ్ళికి లైసెన్సు ఇచ్చారు. తరువాత రోజు ఇద్దరు పక్కింటివాళ్ళు ఈ పెళ్ళికి ఎటువంటి అడ్డంకులూ, ఆటంకాలూ లేవని సాక్ష్యమిచ్చారు. బహుశా ఈ పెళ్ళి చాలా తొందరలో చేసుకొని ఉంటారు, అందుకనే వోర్సెస్టర్ చాన్సెలర్ పెళ్ళి ప్రమాణాలు సాధారణంగా చేసే మూడు పర్యాయాలను బదులు ఒక్కసారి చెయ్యడానికి అనుమతించారు అన్నే మూడు నెలల గర్భం ఓ కారణమయి ఉండవచ్చు. పెళ్ళి తరువాత అర్నెళ్ళకు మొదటి కూతురు సుసన్నా హాల్ జన్మించింది. 1583 మే 26 న సుసన్నా బాప్టిజం పొందినది. ఆ తరువాత రెండు సంవత్సరాలకి కవలలు హామ్నెట్ షేక్స్పియర్ (అబ్బాయి), జుడిత్ క్వినే (అమ్మాయి) జన్మించారు. సుమారు రెండు సంవత్సరాల తర్వాత 1585 ఫిబ్రవరి 2న వీరిద్దరూ బాప్తిజం పొందినారు. హామ్నెట్ 11 సంవత్సరాల వయసులో 1596 ఆగస్టు 11 న మరణించాడు, కారణాలు తెలీదు.
ఈ కవలలు జన్మించిన తర్వాత నుండి 1592లో లండన్ థియేటర్లో ఇతని పాత్ర గురించి తెలిసే మధ్య కాలంలోని షేక్స్పియర్ జీవితం గురించి ఎటువంటి ఆధారాలు లేవు. విద్వాంసులు ఈ 1585, 1592ల మధ్యగల సంవత్సరాలను కోల్పోయిన వత్సరాలు (lost years) అని అంటారు. ఈ కాలంలోని షేక్స్పియర్ చరిత్రను లిఖించాలని ప్రయత్నించిన జీవితచరిత్రకారులకు అభూత కల్పనలు, అర్థ వాస్తవాలూ ఎదురైనాయి. నికోలస్ రోవే అనే అతను షేక్స్పియర్ జీవిత చరిత్ర వ్రాసిన వారిలో మొదటివాడు. ఇతను స్ట్రాట్‌ఫోర్డ్‌వాసులు చెప్పుకునే ఓ కథను ఉటంకించాడు, దాని ప్రకారం షేక్స్పియర్ చట్టవిరుద్ధంగా జింకలను వేటాడిన నేరాన్ని తప్పించుకోవడానికి లండన్ నుండి పారిపొయినట్లు ఉంది. మరొక 18వ శతాబ్దం చెప్పుకోలు ప్రకారం షేక్స్పియర్ నాటక జీవితం నాటకాలు చూడటానికి వచ్చిన వారి గుర్రాలు కట్టివేశే పనితో మొదలయింది. జాన్ ఆబ్రే చెప్పడం ప్రకారం అయితే షేక్స్పియర్ బడి పంతులుగా పనిచేసాడు. కొంతమంది ఇరవయ్యో శతాబ్దపు విద్వాంసులు చెప్పడం ప్రకారం షేక్స్పియర్ లాంక్షైర్కు చెందిన అల్క్సాండర్ హోంగ్టన్ బడి పంతులు ఉద్యోగం ఇచ్చాడు. ఇతను కాథలిక్ మతస్తుడు, భూస్వామి. ఇతని విల్లులో ఒక విలియం షేక్సాఫ్ట్ను పేర్కొన్నాడు. ఈ కథలకు ఎటువంటి ఆధారాలూ లభించలేదు, షేక్స్పియర్ మరణించిన తర్వాత నల్గురూ చెప్పుకునే మాటలు తప్ప.
మరణానికి కొన్ని సంవత్సరాల ముందు షేక్స్పియర్ స్ట్రాట్ఫోర్డుకి పదవీ విరమణ చేసి వెళ్ళినాడని మనకు చెప్పిన తొలి చరిత్రకారుడు రోవే. కానీ ఈ రోజుల్లోలా ఆ రోజుల్లో పూర్తిగా బాధ్యతలనుండి తప్పుకోవడం అంటూ ఉండదు. లండన్ అప్పుడప్పుడూ వస్తూపోతూ ఉండేవాడు. 1616 ఏప్రిల్ 23 న షేక్స్పియర్ మరణించాడు. ఇతనికి అప్పుడు భార్యా ఇద్దరు కుమారులు ఉన్నారు. సుసన్నా డాక్టరు అయిన జాన్ హాల్‌ను వివాహమాడినది. రెండవ కుమార్తె జుడిత్, షేక్ప్సియర్ మృతికి రెండు నెలలకు ముందు వైన్ అమ్మే థామస్ క్వినేను వివాహం చేసుకున్నది.
షేక్స్పియర్ తన వీలునామాలో ఆస్తిలో ఎక్కువ భాగం పెద్ద కుమార్తెకు చెందేట్టు వ్రాసినాడు. అలాగే ఆస్తి ఎటువంటి నష్టం లేకుండా సుసన్నా మొదటి కొడుక్కు చెందేట్టు నియమం పెట్టినాడు. క్వినేకు ముగ్గురు సంతానం, కానీ వారిలో అందరూ పెళ్ళికి ముందే మరణించారు. హాల్‌కు ఒక్కరే సంతానం – ఎలిజబెత్, వీరు రెండు మార్లు వివాహం చేసుకున్నారు, కానీ ఎటువంటి సంతానం లేకుండానే 1670లో మరణించారు. దానితో షేక్స్పియర్ వంశం అంతం అయినది. షేక్స్పియర్ వీలునామాలో భార్య గురించి కేవలం అరకొరగా మాత్రమే వ్రాయబడింది. అన్నెకి బహుశా మూడవ వంతు ఆస్తి ఆటోమేటిగ్గా వచ్చి ఉంటుంది. కాకపోతే షేక్స్పియర్ వీలునామాలో ఓ చోట మాత్రం తన భార్యకు తన రెండవ ఉత్తమ మంచం చెందాలి అని వ్రాసినాడు. ఈ వాక్యం వల్ల చాలా కల్పనలు వచ్చినాయి, కొంతమంది విద్వాంసుల ప్రకారం ఇది అన్నెను అవమానించామే, కానీ మరి కొంతమంది మాత్రం రెండవ ఉత్తమ మంచం పెళ్ళి నాటిదై ఉంటుందనీ, తద్వారా షేక్స్పియర్ భార్యపై ప్రేమను ప్రకటించినాడనీ చెప్తారు.
షేక్స్పియర్ మరణాంతరం రెండు రోజులకు హోలీ ట్రినిటీ చర్చి (పవిత్ర త్రిమూర్తిత్వ చర్చి)లో అంత్యక్రియలు జరిగినాయి. 1623 కు ముందు ఈ ప్రాంతంలో ఓ స్మారక చిహ్నం నెలకొల్పినారు. దీనిపై షేక్స్పియర్ విగ్రహం నడుము వరకూ ఉంచారు.
తొలినాటి నాటకాలు ఏ కంపెనీ కోసం వ్రాసినాడో చెప్పడానికి ప్రస్తుతం సరియైన ఆధారాలు లేవు. కానీ టిటస్ ఆండ్రోనికస్ నాటకం యొక్క 1594 ముద్రణలో ఈ నాటకాన్ని మూడు ట్రూపులు వేసినట్టు వ్రాయబడింది. 1592 – 1593 ప్లేగు వ్యాధి బీభత్సం తర్వాత షేక్స్పియర్ నాటకాల్ని తమ స్వంత కంపెనీలోనే ప్రదర్శించడం మొదలుపెట్టినాడు. ఈ ప్రార్శనలు థేమ్స్ నదికి ఉత్తరాన ఉన్న కర్టన్ ఇన్ షోర్డిచ్ థియేటర్లో ప్రదర్శించేవాడు. లండన్ వాసులు ఇతని నాటకం నాల్గవ హెన్రీ చూడటానికి బారులు తీరేవారు. క్లియోనార్డో డిగ్ చెప్పినట్లు ఈ థియేటర్ భూయజమానితో గొడవల్లో చిక్కుకున్నప్పుడు ఇక్కడి థియేటర్ మొత్తం కూల్చేసి ఆ కలపను గ్లోబ్ థియేటర్ నిర్మాణానికి ఉపయోగించారు. ఇది నటీనటుల చేత నటీనటులు కొరకు నిర్మించబడిన మొదటి థియేటరు. దీనిని థేంస్ నది దక్షిణపు ఒడ్డున సౌత్‌వార్క్ దగ్గర నిర్మించారు. ఈ థియేటర్ 1599 తర్వాత చాలా వరకూ షేక్స్పియర్ ప్రధాన నాటకాలన్నీ గ్లోబ్ థియేటర్ కొరకే వ్రాసినాడు. హాంలెట్, ఒథెల్లో లియర్ రాజు వీటిలోనివే.
చాంబర్లైన్ ప్రభువు యొక్క మనుషులు కంపెనీకి రాజుగారి మనుషులుగా పేరు మార్చిన తర్వాత వీరు ఆ నాటి క్రొత్త రాజు అయిన జేమ్స్ ప్రతేకమైన సంభందంలోకి ప్రవేశించారు. ఆ ప్రదర్శనాధారాలు కొద్ది కొద్దిగానే లభించినప్పటికీ రాజు గారి మనుషులు కంపెనీ 1604 1605 నవంబరు 1 అక్టోబరు 31ల మధ్య మొత్తం ఏడు ప్రదర్శనలిచ్చారు. ఇందులో మర్చంట్ ఆఫ్ వెనిస్ ప్రదర్శనే రెండు సార్లు ఉంది. 1608 తర్వాత వీరు శీతాకాలంలో బ్లాక్ ఫెయిర్ ఇండోర్ థియేటర్లోనూ వేసవి కాలంలో గ్లోబ్ థియేటర్లోనూ ప్రదర్శనలిచ్చేవారు. ఇండోర్ థియేటర్లోని ఆకర్షణీయమైన అనువైన సెట్టింగులు షేక్స్పియర్ ప్రతేకాకర్షణగల సీన్లు పెట్టడానికి వీలు కల్పించింది. ఉదాహరణకు సింబర్లిన్లో జుపిటర్ భూమికి అవధరించునప్పుడు ఉరుములు మెరుపులతో కూడి ఓ గ్రద్దపైనుండి వస్తాడు, వచ్చీ రాగానే ఓ పిడుగు విసిరేసి దయ్యాలను మోకాళ్ళపై నిలబడేట్టు చేస్తాడు.
షేక్స్పియర్ నాటకాల ప్రదర్శనల్లో హీరోలుగా ప్రఖ్యాతిగాంచిన రిచర్డ్ బర్బేజ్, విలియం కెంపే, హెశ్రీ కాండెల్, జాన్ హెమింగ్స్ మొన్నగు వారు నటించారు. మూడవ రిచర్డ్, హాంలెట్, ఒథెల్లో నాటకాల్లో బర్బేజ్ ప్రధాన పాత్ర పోషించాడు. ప్రముఖ హాస్య నటుడు విల్ కెంపే, రోమియో, జూలియట్లో పీటర్ సేవకుని పాత్ర, మచ్ అడో అబవుట్ నథింగ్లో డాగ్ బెర్రీ పాత్రా పోషించాడు. ఇవే కాకుండా ఇంకా చాలా షేక్స్పియర్ పాత్రల్లోనూ కెంపే నటించాడు. పదహారవ శతాబ్దారంబంలో కెంపే పాత్రల్లో రాబర్ట్ ఆర్మిన్ నటించడం మొదలుపెట్టినాడు. ఇతను ‘as you like’ లో టచ్‌స్టోన్ గానూ, ‘లియర్ రాజు’లో మూర్ఖుని పాత్రలోనూ నటించాడు. 1613వ సంవత్సరంలో సర్ హెన్రీ వాట్టన్ వ్రాసిపెట్టిన ప్రకారం ఎనిమిదవ హెన్రీ చాలా సందడి సందడిగా మొదలయింది. జూన్ 29న ఒక ఫిరంగి ప్రమాదవశాత్తూ పేలి గ్లోబ్ థియేటర్ పూర్తిగా నేలమట్టం అయినది.
1623లో షేక్స్పియర్ యొక్క ఇద్దరు మితృలు జాన్ హెర్నింగ్స్, హెన్రీ కాండెల్ లు షేక్స్పియర్ నాటకాలను ఓ పుస్తకంగా ప్రచురించారు. ఇందులో మొత్తం 36 షేక్స్పియర్ రచనలు ఉన్నాయి, వాటిలో 18 తొలిసారి ముద్రించబడినాయి. షేక్స్ప్యర్ రచనలు ఈ 1623కు ముందే చిన్న చినన్ పుస్తకాలుగా మురించారు. అయితే షేక్స్పియర్ ఈ ప్రచురణలకు అనుమతి ఇచ్చినట్టు తెలీదు. ఈ విషయాన్నే 1623లో ముద్రించబడిన పుస్తకం ఈ చిన్న చిన్న పుస్తకాలను దొంగిలించి ముద్రించినవిగా, తప్పుల తడకలుగా, అభివర్ణించారు. అల్ఫ్రెడ్ పోలార్డ్ ఈ చిన్న పుస్తకాలను చెడ్డ చిన్న పుసకాలు అని అబివర్ణించాడు. వీటిలోని పాఠ్యము తప్పుల తడకగా చెప్పినారు. బహుశా ఇవి విని గురించుకోని వ్రాసినవి కావచ్చు. ఈ చిన్న పుస్తకాల్లో ఒకే నాటకం వివిధ ముద్రణల్లో వివిధ రకాలుగా ఉంది. ఈ తేడాలు ముద్రణా దోషాలు, నకలు దోషాల వల్ల జరిగి ఉండవచ్చు. ఇంకా కొన్ని సందర్భాలలో, ఉదాహరణకు హాంలెట్, ట్రోయిలస్, క్రిస్సీడా, ఒథెల్లోల విషయంలో చిన్ని పుస్తకాలను 1623 ముద్రణకు నడుమ షేక్స్పియర్ తన పాఠ్యాంశాన్ని సరి చేసుకోని ఉండవచ్చు. 1623 ముద్రణలోని లియర్ రాజు 1608 నాటి చిన్ని పుస్తకంలో చాలా తేడాలు ఉన్నాయి. అందుకని తరువాత “ఆక్స్ఫర్డ్ షేక్స్పియర్” రెంటీనీ ముద్రించ్నది.
1593, 1594 ల మధ్య్ అప్లేగు వ్యాధి కారణంగా థియేటర్లు మూసేసినప్పుడు శృంగార రస ప్రధానమైన రెండు పెద్ద వ్యాఖ్యాన కవితలు ముద్రించ్నాడు. అందులో మొదటిది వీనస్, అడోనిస్ రెండవది లుక్రీస్ మానభంగం. వీటిని సౌతంటన్ ఎర్ల్ అయిన హెన్రీ వ్రియోత్న్లీకి అంకితం ఇచ్చాడు. వీనస్, అడోనిస్లో అమాయకురాలయిన అడోనిస్, వీనస్ యొక్క ప్రేమ – శృంగారాలకు నిరాకరిస్తుంది. లుక్రిసీ మానభంగంలో కన్య అయిన లుక్రిసీని దుర్మార్గుడు టార్కిన్ పాడు చేస్తాడు. ఈ రెండూ కూడా నిరోధించలేని కామకోరికలను ఓవిడ్ యొక్క మెటామోర్ఫోస్చే ప్రేరణ పొంది రచించాడు. ఈ రెండు కవితలు కూడా చాలా విజయవంతం అయినాయి. షేక్స్పియర్ కాలంలోనే చాలా పునర్ముద్రణలు పొందినాయి. మూడవ వ్యాఖ్యాన కవిత ప్రేమికురాల పిర్యాదు (A lovers complaint) 1609 చతుర్పాద కవితా (sonnet) ముద్రణలో ముద్రించబడింది. ఇందులో ఓ యువతి తనను అనుభవించినవాని గురించి వ్యధ చెందుతూ వ్యక్తం చేసిన ఘోష ఉంది.
చాలా మంది విద్వాంశులు ఇప్పుడు ఈ ప్రేమికురాలి పిర్యాదు షేక్స్పియర్ వ్రాసినట్టు అంగీకరిస్తారు. విమర్శకులు ఈ కవితలోని విషాద, శోక రాగాలు అద్భుతంగా ఉన్నాయని అంగీకరిస్తారు. . 1601లో రాబర్ట్ చెస్టర్ ముద్రించిన love’s martyr లో “the phoenix and the turtle”, 1599లో The passionate piligrimనందు రెండు చతుర్పాద కవితలు, 138, 144 లు, షేక్స్పియర్ అనుమతి లేకుండా ముద్రించబడినాయి. The phoenix and the turtle లో ప్రియురాలి మరణానికి, ఫీనిక్స్ పక్షి మరణానికీ, నమ్మకమైన తాంబేలు (turtle ) మరణానికి చెందే వ్యధను వర్ణించాడు.
తొలి నాటి షేక్స్పియర్ నాటకాలు ఆనాటి సంప్రదాయబద్దమైన శైలిలో వ్రాయబడినాయి. కానీ త్వరలోనే ఈ సంప్రదాయ బద్దమైన శైలిని షేక్స్పియర్ తన స్వంత అవసరాలకు అనుగుణంగా మార్చుకోవడం మొదలుపెట్టినాడు. మూడవ రిచర్డ్‌లో మొదతి సీన్లో అంతర్మధతానికి మధ్య యుగం నాటి నాటకాల్లో స్వయం పరిచయం శైలో మూలాలు దాగున్నాయి. అదే సమయంలో రిచర్డ్ యొక్క స్వయం తెలివితేటలు, ఆత్మ జ్ఞానం (self awareness), షేక్స్పియర్ యొక్క అంతర్మథనంలో పరిణితి చెందిన శైలి కంపిస్తుంది. ఏ ఒక్క నాటకం కూడా సంప్రదాయ శైలికి పూర్తి భిన్నంగా నడవలేదు. షేక్స్పియర్ తన అన్ని నాటకాల్లోనూ సంప్రదాయ శైలినీ, స్వేచ్ఛాశైలిని ప్రభావశీలంగా కలిపి ఉపయోగించాడు.
రోమియో, జూలియట్, ఇలా శైలులు కలపడానికి చక్కని ఉదాహరణ. 1590 దశకం మధ్య కాలానికి అనగా రోమియో, జూలియట్ రెండవ రిచర్డ్, ఓ నడి వేసవి రాత్రి కల నాటికి షేక్స్పియర్ సహజ సిద్ద కవిత్వం వ్రాయడం మొదలు పెట్టినాడు.
హాంలెట్ తర్వాత షేక్స్పియర్ తన కవితా శైలిని మరింత మార్చాడు. తరువాత కాలం నాటి శైలిని సాహితీ విమర్శకుడు ఏసీ బ్రాడ్లీ మాటల్లో “మరింత చిక్కనైనదీ, వేగవంతమైనదీ, క్రమబద్దమైనదీ, ఎప్పుడోగానీ ట్విస్ట్ చేసినదీ, లేదా ఎల్లిప్టికల్ కానిదీ షేక్స్పియర్ రచనాకాలం చివర్లో ఈ ఎఫెక్ట్లు సాధించడానికి రకరకాల టెక్నిక్కులు ప్రయోగంచాడు. వీతిలో ran on lines, క్రమము కాని చోట ఆగుట, నిలుపుటలు, వాక్య నిర్మాణంలో సైజులో తీవ్రమైన విభిన్నత్వమూ, వంటివి ఉన్నాయి. ఉదాహరణకు మక్ బెత్ లో భాష ఒక సంబంధంలేని మెటాఫర్ నుండి మరొక స్మైలీకి వేగంగా మారుతుంది.
షేక్స్పియర్ సృజించిన రచన తరువాత చాలా కాలం వరకూ ఆంగ్ల కవిత్రంలోను, సాహిత్యంలోనూ, నాటకాల్లోనూ తన అమోఘమైన ప్రభావం చూపించింది. ఇతను పాత్ర చిత్రణ ఇతివృత్త నిర్మాణము, భాష, genre ల శక్తి సామర్ద్యాలను విశాలం చేసాడు. ఉదాహరణకు రోమియో జూలియట్ వరకూ శృంగార రసాన్ని విషా రసం కోఅం ఉపయోగించడం పనికొచ్చేదిగా చూడబడలేదు. అంతర్మథనం కేవలం పాత్రల గురించిన సమాచారం ఇవ్వడానికి ఏదన్నా సంఘటన గురించిన సమాచారం ఇవ్వడానికి మాత్రమే ఉపయోగంచేవారు, కానీ షేక్స్పియర్ ఈ అంతర్మధనాన్ని పాత్రల మనసులను వివరించడానికి విరివిగా వాడుకున్నాడు. షేక్స్పియర్ రచనలు తరువాతి తరాల కవులపై తీవ్ర ప్రభావం చూపినాయి. రొమాంటిక్ కాలంలోని కవులయితే ఏకంగా షేక్స్పియర్ వచన నాటకాలను కవిత్వంలో ంపునర్లిఖించడానికి ప్రయత్నించారు. కాకపోతే ఈ ప్రయత్నం పెద్దగా విజయవంతం అవలేఉ. జార్జ్ స్టెయినర్ అను విమర్శకుడు “కొలెరిడ్జ్ నుండి టెన్నిసన్ వరకూ వచ్చి అన్ని ఆంగ్ల నాటకాలూ షేక్స్పియర్ నాటకాలను బలహీనమైన (చప్పని?) అనుకరణలూ, మర్పులూ” అంటూ వ్రాసినాడు.
థామస్ హెర్డీ విలియం పాల్క్నర్, చార్లెస్ డికిన్స్ వంటి నవలా రచయితలను కూడా షేక్స్పియర్ చాలా ప్రభావం చూపినాడు. డికిన్స్ అయితే తన నవలల్లో ఇవరై ఐదింతికి పేర్లు షేక్స్పియర్ నుండి ప్రేరణ పొంది పెట్టినవే. అంతే కాకుండా డికిన్స్ తన నవలల్లో తరచూ షేక్స్పియర్ను ఉటంకించేవాడు.
అమెరికా దేశపు నవలా రచయిత హెర్మన్ మెల్విల్లే యొక్క రచనల్లోని అంతర్మధనాలు పై షేక్స్పియర్ ప్రభావం సుస్పష్టము. మెల్విల్లే నవల మోచీ డిక్ లోని నాయకుడు అహబ్ షేక్స్పియర్ లియర్ రాజు నుండి చాలా ప్రేరణ పొందినది.
షేక్స్ప్యర్‌కి తన జీవిత కాలంలో ఎటువంటి బిరుదులూ, సన్మానాలూ లభించలేదు, కానీ పలువురు తన జీవిత కాలంలోనే మెచ్చుకున్నారు. 1598 లో క్లెరిక్, రచయిత అయిన ఫ్రాన్సిస్ మియర్స్ ఆనాటి ఆంగ్ల రచయితల్లో హాస్యం, విషాదం లలో బ్రహ్మాండమైన నైపుణ్యం గలవాడని వ్రాసినాడు.
కేంబ్రిడ్జ్ లోని సెయింట్ జాన్కాలేజీలో పర్న్సాస్ నాటక రచయితలు షేక్స్పియర్ని చాసర్, గోవర్, స్పెన్సర్‌లతో సమ ఉజ్జీగా భావించాడు. మొదతి షేక్స్పియర్ ప్రచురణలో బెజ్ జాన్సన్ షేక్స్పియర్ని అప్పటి తరానికి ఆత్మగా, ఆనాటి స్టేజ్‌కి ఆనంద ప్రదాయినిగా, పొగడ్తల గ్కారకుడిగ అభివర్ణించాడు. కాకపోతే మరొక చోట ఇదే జాన్సన్ షేక్స్పియర్ తన కళకు సానపట్టాలి అని కూడా చెప్పినాడు.
1660 లో రాజరికాన్ని పున్స్థాపించడం నుండి పదిహేడవ శతాబ్దం చివర వరకూ క్లాసికల్ ఆలోచనలు vogue గా ఉన్నాయి. దీని ఫలితంగా ఆ కాలంలోని విమర్శకులు షేక్స్పియర్ రచనలను జాన్ ఫ్లెచర్, బెన్ జాన్సన్ ల తర్వాత స్థాయిగా చెప్పేవారు. ఉదాహరణకు థామస్ రెమర్ షేక్స్పియర్ హాస్యాన్నీ, విషాదాన్నీ కలిపి నాటకాలు వ్రాస్తున్నడని విమర్శించాడు. కానీ కవి, విమర్శకుడు అయిన జాన్ డ్రెడెన్ షేక్స్పియర్ని ఉన్నత స్థానంలో నిలబెట్టినాడు. ఇతను “నే ంజాన్సన్ను ఆరాధిస్తాను, కానీ షేక్స్పియర్ని ప్రేమిస్తాను” అని చెప్పినాడు. చాలా దశాబ్దాలు రెయర్ మాటలే ఎక్కువమంది అంగీకరించారు, కానీ పద్దెనిమిదవ శతాబ్దం నాటికి విమర్శకులు షేక్స్పియర్ని అతని దారిలోనే అర్థం చేసుకోవడం ప్రారభించారు. వీరు షేక్స్పియర్ని ఓ సహజ జీనియస్‌గా గుర్తించారు. ఇతని పనులుపై వివిధ పండితులు చేసిన పరిశోధనలు వ్రాసిన పుస్తకాలు పెరుగుతున్న షేక్స్పియర్ ప్రాభవాన్ని మరింత పెంచినాయి. 1765లో శామ్యూల్ జాన్సన్, 1790 లో ఎడ్మండ్ మలోనే వీరిలో ముఖ్యులు. 1800 సంవత్సరానికి షేక్స్పియర్ ఆంగ్ల జాతియ కవిగా స్థిరపడినాడు. 18, 19 వ శతాబ్దాలలో ఇతని కీర్తి ప్రతిష్ఠలు విదేశాలలో కూడా వ్యాపించినాయి. వాల్టెయిర్, గోతే, స్టెంథల్, విక్టర్ హూగోలు షేక్స్పియర్ను అభిమానించిన రచయితల్లో కొందరు.
రొమాంటిక్ యుగంలో కవి, సాహితీ తర్వవేత్త అయిన శామ్యూల్ టేలర్ షేక్స్పియర్ని కొలెరిడ్జ్ మెచ్చుకున్నాడు. అలాగే ఈ కాలంలోని విమర్శకుడు ఆగస్టు విల్హెల్మ్ షెల్గల్ షేక్స్పియర్ నాటకాలను జర్మన్ భాషలోనికి in the spirit of german రొమాంటిసిజంతో అనువదించాడు.
షేక్స్పియర్ మరణించిన 150 సంవత్సరాల తర్వాత, అతని రచనలు నిజంగా షేక్స్పియరే వ్రాసినాడా! అనే అనుమానాలు మొదలయినాయి. ఫ్రాన్సిస్ బకాన్, క్రిష్టోఫర్ మార్లోవే, ఎడ్వర్డ్ డి వెరే, ఆక్స్ఫర్డ్ యొక్క ఎర్ల్ వంటి చాలా పేర్లు పరిశీలించబడినాయి. కానీ ఈ సిద్దాంతాలన్నీ విద్వాంసుల వేత కొట్టివేయబడినాయి. కాకపోతే ఆక్స్ఫర్డ్ థీయరీ మాత్రం 21 వ శతాబ్దంలో కూడా కొంత ప్రాముఖ్యం వహించింది.
1623వ సంవత్సరంలోని మొదటి ముద్రణలో మొత్తం 36 నాటకాలు ముద్రించబడినాయి. ఈ ముద్రణలో మొత్తం నాటకాలను మూడు రకాలుగా వర్గీకరింఛినారు. అవి: హాస్యం, విషాదం, చారిత్రకాలు. షేక్స్పియర్ తన రచనల్లోని ప్రతి పదమూ అతనే వ్రాయలేదు, ఆ కాలంలో సాధారణంగా జరిగినట్టే ఇతని నాటకాలు ఇతరులతో కలిసి వ్రాసిన చిన్నెలు కంపిస్తాయి. ప్రథమ సంపుటిలో రెండు నాటకాలు ముద్రించబడలేదు. ……ఈ రెండూ కూడా ఇప్పుడు షేక్స్పియర్ రచనలుగా అంగీకరిస్తున్నారు. ఇప్పుడు వీటిలో సింహభాగం షేక్స్పియర్ వ్రాసినట్టు పండితులు విశ్వసితున్నారు. ప్రథం సంపుటిలో ఎటువంటి కవితలూ కలపబడలేదు.
19 వ శతాబ్ది చివర్లో ఎడ్వర్డ్ డౌడెన్ చివరి నాలుగు హాస్య రస ప్రధాన నాటకాలను రొమాన్సెస్ గా వర్గీకరించాడు. ఈ నాలుగు నాటకాలనూ ఇప్పుడు అందరూ విషాదాస్యాలు అని పిలుస్తున్నారు. అప్పుడప్పుడూ రొమాన్సెస్ అని కూడా పిలుస్తారు. ఈ దిగువ జాబితాలో ఈ విషాదాస్యాలను * గుర్తుతో సూచించడమైనది. 1896లో ఫెడ్రిక్ యస్ బోస్ సమస్యా నాటకాలు అని మరో వర్గాన్ని నిష్పాదించాడు. ఈ వర్గంలో నాలుగు నాటకాలు చేర్చాడు. 1.2.3.4…..ఈ పదంపై చాలా వాద ప్రతివాదాలు జరిగినాయి. నేడు ఇతర నాటకాలకి కూడా ఈ పదాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ దిగువ జాబితాలో సమస్యా నాటకాలను ()గుర్తుతో సూచించడమైనది. షేక్స్పియర్ పాక్షికంగా వ్రాసిన నాటకాలు () గుర్తుతో సుచించడమైనది. ఇతర రచనలు షేక్స్పియర్ వ్రాసిన వాటిగా చెప్పబడుతున్నప్పటికీ అవి అన్నీ అలభ్యం.
మాధవి కాళ్ల
సేకరణ