అక్షర కొరకు
అంశం:ఉపాధ్యాయ దినోత్సవం
శీర్షిక:విలువలు లేని విలాసాలు (వ్యాసం)
ప్రారంభం:మొన్ననే ఒక వార్త చూసాను,అదే ఒక ప్రిన్సిపాల్ హత్య
అది ఎవరు చేసారు? ఎందుకు చేసారు? ఎలా చేసారు ? డబ్బు కోసమా ? లేదా పాత కక్షలా ?
ఇలా ఎన్నో అనుమానాలు పోలీసుల విచారణలో ఎన్నో అడ్డంకులు అసలు మూసి ఉన్న ఇంట్లోకి ఎవరు వచ్చారు ? ఎలా వచ్చారు ? ఎలా చంపారు ? తెలిసిన వాళ్ళా ? తెలియని వాళ్ళా ఇలా ఎన్నో సందేహాలతో పోలీసులు తలలు పట్టుకున్నారు,ఇల్లంతా గాలించారు,చుట్టూ ఉన్నవారిని ఎన్నో ప్రశ్నలు అడిగారు. ఆమె చాలా మంచిదని అందరు చెప్పారు, అమెకేవరు శత్రువులు లేరని బంధువులు చెప్పారు. మరి ఎవరు చేసి ఉంటారు అని అనుకున్న సమయంలో ఆమె నడుపుతున్న ఒక స్కూల్ పిల్లలు అనుకున్నారు. కానీ పిల్లలు ఇలా చంపుతారా? అసలు చంపరు అని అనుకున్నారు, కానీ పోలీసులు విచారణ చేస్తున్నప్పుడు ఒక అబ్బాయి అది కూడా పదో తరగతి అబ్బాయి బళ్ళో ఫోన్ వాడడం చూసి మందలించిందని వాళ్ళు తెలుసుకున్నారు.అదే అబ్బాయి గత నాలుగు రోజులుగా బడికి కూడా రాలేదని తెలియడం తో అతని కోసం వెతికారు.
అందర్నీ తనిఖి చేస్తున్న సమయంలో ఒక వాహనం రాంగ్ రూట్ లో రావడం చూసిన పోలీసులు దానిని ఆపి వారిని పక్కకు తీసుకుని వెళ్ళారు. హెల్మెట్ లేదు,పైగా తాగి ఉన్నారు,ఎలాంటి కాగితాలు లేవు,అసలు బండి నడిపే వయస్సు కూడా కాదు. అలాగే వారి దగ్గర కొంత డబ్బు కూడా దొరికింది,దాంతో పాటే ఒక కొత్త ఇ ఫోన్ కూడా కనిపించేసరికి పోలీసులకు అనుమానం వచ్చి స్కూల్ సీ.సీ టివి లలో ఉన్న వారితో పోల్చారు.దాంతో వాళ్ళే వీళ్ళు అని తెలియడం తో అందరూ ఆశ్చర్యపోయారు.
వారిని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం విని అందరూ షాక్ అయ్యారు.తమ టీచర్ తనను ఫోన్ తెచ్చావని అవమానించి పంపిందని, అలాగే వారికీ మత్తు పదార్ధాల అలవాటు కోసం, కొత్త బైక్ ,ఫోన్ కోసం డబ్బులు కావాలని ఇంట్లో అడిగితే ఇవ్వలేదని కానీ ప్రిన్స్ పాల్ దగ్గర ఆ రోజు ఫీజులన్ని వసులయ్యిన వాటిని ఇంట్లో పెట్టిందని తెల్సుకున్న వాళ్లు బాగా రెక్కి చేసి ఆమె నుండి కేవలం డబ్బులు తీసుకోని వెళ్ళాలని అనుకున్నారు.అదే సమయంలో ఆమె ఇంట్లో వెనక తలుపు నుండి వెళ్ళారు.ఆమె ఫోన్ మాట్లాడుతుండడం గమనించి కత్తి తో బెదిరించి డబ్బులు తీసుకున్నారు ఆ పెనుగులాటలో ఆమె అతన్ని చూసింది.ఆ పిల్లాడు తనను గుర్తుపట్టిందని మత్తులో ఆమెని ఏకంగా ఇరవై రెండు సార్లు పొడిచాడు.ఆమె చనిపోయిందని తెల్సుకున్నాక డబ్బులు తీసుకుని వెళ్ళిపోయి బట్టలు పారేసి బార్ కి వెళ్లి బాగా తాగి, ఆ తర్వాత కొత్త ఫోన్, కొత్త బైక్ కూడా కొన్నారు అని తెల్సిన పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
ముగింపు: తల్లి,తండ్రి తర్వాత స్థానం గురువుది కానీ ఈ కాలంలో ముఖ్యంగా రెండువేల రెండు తర్వాత పుట్టిన పిల్లలో చాలా మార్పులు వచ్చాయి.వారికీ ఏది కావాలంటే అదే కావాలి నచ్చింది ఇవ్వకపోతే మారాం చేయడం ఒక్కడినే కనడం వాడిని అతి గారాబంగా అడిగిందల్లా కొనివ్వడం చేసి తల్లిదండ్రులు పాడు చేస్తున్నారు.కానీ తమ పిల్లలు ఇలా అవుతారని ఎవరు అనుకోరు మరి తమ పిల్లలు ఏమి చేస్తున్నారో ఎవరితో తిరుగుతున్నారో తెలుసుకునే కనీస బాధ్యత కూడా తల్లిదండ్రులకు లేదా అంటే లేదు వాళ్ళు సంపాదనలో పడి వారికి దూరం అవుతున్నారు.వాళ్ళు ఏం చేస్తున్నారో తెల్సుకోలేకపోతున్నారు.చివరికి ఇలాంటివి జరిగితే అప్పుడు అయ్యో అని బాధపడితే ఏం లాభం లేదు కనీసం ఇలాంటివి విన్నప్పుడు అయినా తమ పిల్లలు ఎలా ఉన్నారని చూస్తున్నారా అంటే అది లేదు మా పిల్లలు బంగారం అంటూ వేనేకేసుకుని వస్తున్నారు తప్ప మా వాడు చెడు అలవాట్లు చేసుకున్నాడు కాస్త కొట్టి , కంట్రోల్ చేయండి అని ఉపాధ్యాయులకు చెప్పేవారే లేరు, పైగా దండిస్తే వారే వచ్చి ఎన్ని బూతులు తిట్టి పోతున్నారో, ఎలా దాడులు చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం ,వింటున్నాం ,కొట్టినా కాదు కనీసం బెదిరించే హక్కు కూడా లేదు టీచర్స్ కి.
పైగా తిడితే జీతాలు కట్, లేదా ఉద్యోగం ఉడిపోవడం జరుగుతుంది. ఎందుకిలా జరుగుతుందని ఆలోచిస్తే మాత్రం మన చిన్నప్పుడు మన ఉపాధ్యాయులు మనల్ని కొట్టినట్టు ,మనకు సంస్కారం నేర్పినట్టు ఇప్పుడు లేదు,ఏమంటే జనరేషన్ మారింది అంటారు ,ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు ఉంటె ఎవరితో ఎలా మెలగాలి, ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి అనేది తెలిసేది,కాని ఇప్పుడు అసలు కుటుంబమే లేదు మేము మాకోక్కడు అనే చిన్న కుటుంబం వలన పిల్లల్లో ఒంటరి అనే భావన దానికి తోడూ మత్తు పదార్ధాల అమ్మకం,దానికి తోడు విపరీత అశ్లీల చిత్రాల వెబ్ సిరిస్ లు, ఇక ఆటలు అంటే ఆరుబయట ఆడే ఆటలు లేవు ఫోన్ లో కొట్టడం,నరకడం వంటి ఆటలకు బానిసలూ అయ్యి చనిపోయిన విద్యార్ధులు ఉన్నారు.అశ్లీల చిత్రాలు చూసి అత్యాచారం చేసిన వాళ్ళు ఉన్నారు.దినంతటికి కారణం ఏమిటి సమాజం లో జరుగుతున్న మార్పులా? సాంకేతికత పెరగడం మా ? తల్లిదండ్రులు బాధ్యతగా ఉండకపోవడమా ? ఉమ్మడి కుటుంబాలు లేకపోవడమా ? ఇలా ఎన్నో ప్రశ్నలు కానీ ఇందులో ఒకటి ఇలా హత్యలు,అత్యాచారాలు,దొంగతనాలు చేసేవారు ఉన్నారు,ఆట,పాటల్లో తమ ప్రతిభను చూపుతున్న వాళ్ళు ఉన్నారు ,మరేంటి ఈ వివక్ష అందమా లేకుంటే దీనికి కారణం ఏమై ఉంటుందని ఆలోచిస్తూ తలలు బద్దలు కొట్టుకుందామా ? అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది ? ఈ ప్రశ్నలకు బదులేది ? సమాధానం మీరే చెప్పండి ?
ఈ వ్యాసం నా సొంతమే అని హామీ ఇస్తున్నాను
భవ్యచారు