అక్షర కొరకు
అంశం : ట్రేండింగ్
శీర్షిక : విలువలు
నిజమైన విలువలకు
చోటే ఇది ఇక్కడ.
ఎదోకటి ఒక డైలాగ్
దొరికితే చాలు,
వందల రీల్స్ చేస్తారు.
డాన్స్-లు రాక పోయినా
స్టెప్పులు వేస్తారు.
పాటలు రాకపోయినా
గొంతులు కలుపుతారు.
ట్రెండ్ ఫాలో అవ్వకపోతే వెనకబడి పోతామని,
అందరూ ఒకేలాంటి పనులు చేస్తున్నారు.
క్షణంలో మారేదే
ట్రెండింగ్ అంటారు.
అంటే సోషల్ మీడియా సృష్టించిన సుడిగుండాలు,
ప్రతి ఒక్కరు ట్రెండింగ్ కోసం ప్రయత్నిస్తున్నారు.
డా. సరికొండ రమాదేవి
ఇది నా స్వీయ రచన