విషాదం

అరేయ్ ఈరోజు బాగా తాగాలి తాగి ఉగాలి అన్నాడు నరేష్ రాజుతో అవునురా ఈ రోజు తాగాలి అన్న ఈ రోజు దావతులు చేసుకోవద్దని అని అన్నారు కదా మరి ఎలా అన్న అన్నాడు రామ్ అదేం లేదురా గుంపులుగా ఏడ ఉండొద్దుఇంటికి పోదాం రా అయితే మనల్ని ఎవరు పెట్టుకోరు ఈ కరోనా అంటది అందుకే రా పోదాం అంటున్నా అన్నాడు నరేష్  అవును గాని పైసలు ఏడి రా  అన్నాడు రాము.

అరేయ్ ఏందిరా బై నాలుగేళ్ల నుండి జాబు చేస్తున్నావ్  గా  పైసలు కూడా లేవరా  నా దగ్గర రెండు వేలు ఉన్నాయి. నా బైక్ లో పెట్రోల్ కూడా నాదే రా  రాని కి ఫోన్ కి అయితది . ఇక మందు అయితే రెండు వేలు ఉన్నాయి కానీ నువ్వెన్ని ఇస్తావో చెప్పు అన్నాడు నరేష్. అరే నా దగ్గర ఎక్కడిది రా బై పైసల్ అన్నీ మొన్న చెల్లి పెళ్లి కే అయిపాయె ఏదో పోయి వస్తున్న సరే నువ్వు రెండు వేల అంటే నేను రెండు ఇస్తా మరి రాజుగాడు దావత్ కి పోవాలి వాడు ఎన్ని ఇస్తాడు అడుగు రా అన్నాడు రాము అరేయ్ మనం ఎందుకురా పైసలు వేసుకునేది ఇది రాజు గాని దావత్ లా పోవాలి. ఎందుకు రా అంటున్నావు, అన్నాడు రాము.

అరేయ్ రేపు ఆని పుట్టినరోజు రా, ఆడి పుట్టినరోజు నాడు, ఆడు దావత్ ఇయ్యాలి. కొత్త సంవత్సరం నాడు పుట్టిండు. మనకు రెండు దావత్ లు ఇయ్యామని అడగాలి అన్నాడు నరేష్. అన్న అన్న మరి కేక్ కూడా కోస్తారా? అంటూ అడిగాడు ఇదంతా వింటున్న పదేళ్ళ ప్రశాంత్. అరేయ్ బర్త్ డే అంటేనే కేక్ రా భై… ఒక కేక్ కాదు, రెండు కేక్ లు ఉంటాయి. ఒక చాక్లెట్ ఇంకోటి పెయిన్ యాప్పిల్ కేక్. మస్త్ ఉంటది రా భై. ప్రశాంత్ మొన్న నవీన్ గాడి బర్త్ డే కు వల్లోల్లు తెప్పించారు. ఎమన్నా ఉందా… నాకైతే మొత్తం తినాలని ఉండే, కాని దొర్కలేదు రా.. అన్నాడు నరేష్.

అవునన్న అది మస్త్ ఉంటది. జూస్ అంతా లోపలికి జప్ జప్ న ఉరుకుతది. లోపల పెట్టుకొంగానే కరిగిపోతాది అంటూ తింటున్నంత ఆస్వాదిస్తూ చెప్పాడు రాము.అవునన్నా గా చాక్లెట్ కేక్ కూడా మస్త్ ఉంటదే అన్న ఖారా కూడా తెప్పిస్తారా? అడిగాడు ప్రశాంత్. అవ్ రా తెప్పిస్తాము, మందులోకి ఖారా చూడవా కూడా ఉంటది. అన్నాడు నరేష్. అన్న అన్న నేను సుతా మీతోని అస్తనే, నన్ను కూడా తోల్కపొండ్రే అన్నాడు ప్రశాంత్ బ్రతిమిలాడుతూ… అరేయ్ పొడ నువ్వేడికి రా లేదు రా భై నువ్వు వద్దు రా మేమే పోతామో లేదో అన్నాడు ప్రశాంత్ ని వదిలించుకోవాలని.

అది కాదు అన్న అబ్బ అన్న చాక్లెట్ కేక్ తినలేదే ఎప్పుడు, ప్లీజ్ అన్న నేను మీతోని వస్తనే, నన్ను తీస్కపోకపోతే నా మీద వట్టె నేను సచ్సిపోయినట్టే అన్నాడు ప్రశాంత్ నరేష్ చేతిని తలపై వేసుకుంటు, ఓరి పోరాడా ఈడ ఉండి మా మాటలన్నీ ఇని ఇప్పుడు ఒట్టు పెడ్తావ్ ఒద్దు రా ఒట్టు తీసి గట్టు మీనా పెట్టు. ఒట్టు లేదు ఏమి లేదు., పోరా ఈడినుండి, మేము పోతామో లేదో.. అసలు ఆ రాజు గాడు ఉన్నాడో లేదో, అంటూ అరేయ్ రాం గా రాజుగానికి ఫోన్ చెయ్యు రా… అన్నాడు కన్ను కొడుతూ, అరేయ్ గట్లనే చేస్తా అంటూ ఫోన్ తీసాడు రాము.

అమ్మ నాకు తెల్సు అన్న నరేష్ అన్న, నువ్వు కన్ను గొట్టుడు నేను చూసిన తీ, నాకు తెల్సు…. నన్ను మత్పరీయకుoడ్రి నన్ను తోల్కపోవాలే అంతే… నేను ఒట్టు సుత వెట్టిన గంతే అన్నాడు ప్రశాంత్. నెలకు కాలు కొడుతూ… అరేయ్ ఈ పోరడు ఏడ దొరికిండ్రా నీకు వీని నేను అక్కకు అప్పజెప్పి వస్త థీ అన్నాడు రాము నరేష్ ని చూస్తూ… ఇగి అన్న నువ్వు నన్ను తోల్కపోకపోతే నేను మా అవ్వకు కాదు మీ అవ్వకు చెప్తా, తాగానికి పోతున్నారని. అప్పుడు మీ పని అయితది మంచిగా….. తాగుడు ఉండది ఊగుడు ఉండది. ఇంట్లనే పంటారు అన్నాడు వేలు చూపిస్తూ….

ఓరి నీ అవ్వ ఇంత లేవు మమ్మల్నే బెదిరిస్తావా? అరేయ్ ప్రసు గా నీళ్ళు దోల్కవోం గని పడు రూపాయలు ఇష్టం చాక్లెట్లు కొనుక్కొని తిను. కానీ, మా అవ్వకు, అయ్యకు చెప్పకు రా!! అన్నారు ఇద్దరు. అబ్బ ఆశ దోష మీరు నన్ను దోల్కవోతేనే మంచిది. లేకుంటే ఇగో, ఇప్పుడే ఉర్కిపోయి చెప్తా మల్ల… అంటూ వెళ్ళబోతున్న వాడి రెండు చేతుల్లో దోర్కవట్టుకున్న నరేష్ ముచ్కంత లేవు మమ్లను  బెదిరిస్తావార? బెదిరిస్తావా? బెదిరిస్తావా? అన్నాడు గుల గుల చేస్తూ, అరె ఇడువే అన్న అంటూ నవ్వుతూనే, అన్న నిజంగా నేను చాక్లెట్ కేకు ఎప్పుడు తినలేదే, మా అయ్యా లేదు కదా నాకు ఎవరు కొనిస్తారే అన్న అంటున్న వాడిని చూసి జాలిపడుతూనే సరే రా లాస్ట్ లాస్ట్ చెప్తున్నా రాజు గాడు వద్దంటే మాత్రం నిన్ను తోల్కవోము మల్ల, తర్వాత మా పేర్లు మా ఇంట్ల చెప్పొద్దూ అన్నాడు రాము. ఆ గట్లనే గని  మీరు ఫోను నా సాటుకు మాట్లాడొద్దు. నా ముంగిలే మాట్లాడాలె, అన్నాడు షరతు పెడుతూ…

సరే థీ రా ముందు గళ్ళ ఆడు ఇంట్ల ఉన్నడా లేడా అడుగు, అట్లనే పైసలు సుతా ఎన్ని ఇస్తాడో అడుగు అన్నాడు నరేష్.దాంతో రాజుకి ఫోన్ చేసాడు రాము. ఓరి రాజు ఇయ్యాల్ల దావత్ ఇచ్చుడు ఉందా లేదా అని అనగానే రాజు అరేయ్ ఉందిరా మీరు ఏడ ఉన్నారు రా? మా ఇంట్లనే ఉన్నాం రా… అరేయ్ రండ్ర మీకే ఫోన్ చేద్దాం అనుకున్న మేరె చేసిండ్రు, మనోళ్ళంతా అస్తుండ్రు. మీదే లేటు అన్నాడు రాజు. అరేయ్ మాతో పాటు ఇంకోడు వస్తున్నాడు రా అన్నాడు రాము. ఎవ్వర్రా అది నీ బామ్మర్డా అన్నాడు రాజు ఫోన్ లో.. కాదు రా మా పక్కిల్లె అక్క కొడుకు ఆడికి అయ్యా లేదు రా వస్తానంతుండు అన్నాడు నరేష్.

అరేయ్ గా చిన్న పోరడా డానికి అడుగుడు ఏoదిరా భై తోల్కరండ్రి ఆనికి తంసప్ తెప్పిస్తా, గింత తింటాడు అంతే కదా! అంటున్న రాజు మాటల్ని వింటున్న ప్రశాంత్ హే హే నేను వోతనే, నేను వొత, నేను వోతున్న అంటూ ఇంట్లోకి పరిగెత్తి అమ్మ అమ్మ నేను అన్నోల్లతోని ఆళ్ళ దోస్త్ ఇంటికి పోతున్న, అంటూనే ఉన్నదాంతో మంచిగా ఉన్న నిక్కర్, అంగి వేసుకొని గూట్లో ఉన్న పౌడర్ డబ్బా తీసి మొఖానికి పూసుకొని, వచ్చాడు గబా గబా, ఏడికి రా తమ్మి, ఏడికి వోతుండ్రు బువ్వైంది, తిని పోతే గాదా… అంటున్న తల్లి మాటలు వినిపించుకోకుండానే వాళ్ళు ముగ్గురు, బైక్ ఎక్కి వెళ్ళిపోయారు. పోరని పాడుగాను ఉన్న సొట ఉండదు. వీన్ని కాకులకు ఎట్టా వాళ్ళను సతాయించి ఉంటాడు. అందుకే తోల్కవోయిండ్రు అంటూ గోనుగ్గుంటూ లోపలి పోయింది తల్లి.

అరేయ్ సక్కగా కుసో రా గరుం కోటు లేదా రా నీకు, అన్నాడు నరేష్… లేదన్న నాకేం సాలి పెద్టలేదు థీ, నువ్వు సక్కగా కుసో, అంటున్న ప్రశాంత్ ని పోరడు బాగా మాటలు నేర్శిండు రో, అంటూనే బైకు ని రాజు ఇంటిముందు ఆపారు. మాటల్లోనే బైక్ని రాజు ఇంటిముందు ఆపాడు. 25 కిలోమీటర్ల దూరంల్లో ఉన్న రాజు ఇంట్లో, కొత్త సంవత్సర వేడుకలు, పుట్టినరోజు దావత్ చేసుకోనికి వచ్చిన దోస్తులను ఇంట్లోకి తోల్కవోయిన రాజు, చేసిన ఏర్పాట్లని చూసి, దోస్తులు మస్త్ కుషి అయ్యాడు. ఇగ అచ్చిన దోస్తులు డిజే లు, డ్యాన్స్ లతో అదరగొట్టారు. ఎన్నడూ ఇవన్ని చూడని ప్రశాంత్ కూడా అన్నలతో డ్యాన్స్ చేస్తూ, ఎగురుతూ, తమ్స్ అప్ తాగుతూ, ఖారా, చూడవా బుక్కుతూ మస్త్ ఎంజాయ్ చేసాడు.

రాజు ఎవర్తోనో వందించిన చికెన్, చపాతి, భాగారా అన్నం, అందరు కడుపునిండా తిన్నారు. రాత్రి పన్నెండు గంటలకు, చాక్లెట్ కేకు, పెయిన్యప్పిల్ కేక్లు కూడా కోషి అందరు, హ్యాప్పి న్యూ ఇయర్ చెప్పుకున్నారు. ప్రశాంత్ అడగడంతో, పాపం అని చాక్లెట్ కేకు వానికే మొత్తం ఇచ్చారు. అంత అవాడు ఆడుతూ, ఎగురుతూ, కడుపు నిండా సంతృప్తిగా, ఆ కేకుని తిన్నాడు. అంతా అలసిపోయి, ఎక్కడివారు అక్కడ, పడుకున్నారు. ఆ రాత్రి తెల్లారితే మళ్ళి అందరు డ్యూటీ లకి పోవాలి.

కాబట్టి ఎవరికీ ఎంత పడుతందో అంతే తాగారు. ఎక్కువ తక్కువ తాగలేదు. పైగా వాళ్లు ఎప్పుడు తాగరు కాబట్టి, నాలుగు బీర్లకే వాళ్లకి ఎక్కువ అనిపించింది. తెల్లారింది అందరు ఎవరి డ్యూటీ లకి వాళ్ళు సమయం అయ్యింది అంటూ గబగబా అక్కడే మొహాలు కడుక్కొని ఇళ్ళకు వెళ్ళిపోయారు. నరేష్, రాము, ప్రశాంత్ కూడా లేచారు. ప్రశాంత్ ఇంకా పడుకోవడం చూసి, అరేయ్ లేరా అన్నాడు నరేష్. అబ్బా అన్న సలి పెడుతుందే ఇంకొంచం సేపు పంట అన్నాడు ప్రశాంత్. అయితే నువ్వు ఈడనే ఉండు మేము పొతం, మాకు డ్యూటీ లకి టైం అవుతుంది అన్నాడు రాము. ఆ మాట వినగానే చటుక్కున లేచి కూర్చున్నాడు ప్రశాంత్. అన్న వద్దన్నా నన్ను ఇడిషి పోకున్ద్రి, నేను వస్తా పాయె, అంటున్న వాడిని చూసి నవ్వుకుంటూ, బైక్ తీసాడు రాము. అరేయ్ గీడనే కదరా ఇంకా సల్లగానే ఉండి, కొద్దిగా ఆగుండ్రి పోదురు, అంటున్న రాజుని, నువ్వు వోతవార డ్యూటీ కి మా వంతుకు, అంటూ బైక్ స్టార్ట్ చేసి, బాయ్ చెప్పి ముందుకు క్కదిలారు ముగ్గురు.

చలికి వెన్నులోంచి వణుకు వస్తుంది. వెళ్ళు కొంకర్లు పోతున్నాయి చల్లని చలి గాలికి తోడూ, మంచు కూడా విపరీతంగా పడడంతో, అంతా మబ్బు మబ్బు గా ఉండి. ఎదవుతున్న సూర్యుడి జాడ లేదు. బైకును జాగ్రత్తగా నడిపిస్తున్నా, ఎదురుగా ఏమి వస్తుండో తెలియక్క లైట్ వేసాడు రాము. అరేయ్ గుద్దోనివా బె, అంటూ వాడి నెత్తిన ఒక్కటి ఇచ్చాడు నరేష్. అనుకోని సంఘటనకు తోడు ఎదురుగ ఏముందో తెలియని స్థితిలో రాము తడబడ్డాడు. ఇంతలోనే బైక్ వెళ్ళి ఎదురుగా ఉన్న చెట్టుకు గుద్దుకుంది. బైక్ మీద ఉన్న ముగ్గురు ఎగిరి పడ్డారు రాళ్ళ పైన చెల్లా చెదురుగా…

—- భవ్య చారు           

Related Posts

1 Comment

Comments are closed.