వెంకీ అట్లూరి(తెలుగు చలన చిత్ర దర్శకుడు, రచయిత, నటుడు)

వెంకీ అట్లూరి, తెలుగు సినిమా దర్శకుడు, నటుడు. ఇతడు మూడు సినిమాలకు దర్శకత్వం వహించాడు.
వెంకీ అట్లూరి 1988, ఆగస్టు 10న హైదరాబాదులో జన్మించాడు.
వెంకీ అట్లూరి 2023 ఫిబ్రవరి 1న పూజాను వివాహం చేసుకున్నాడు.
వెంకీ, 2007లో వచ్చిన జ్ఞాపకం సినిమాలో తొలిసారిగా నటించాడు. 2010లో వచ్చిన స్నేహగీతంలో నటించడంతోపాటు సంభాషణలు కూడా రాశాడు. 2011లో వచ్చిన ఇట్స్ మై లవ్ స్టోరీ సంభాషణలు, 2015లో వచ్చిన కేరింత సినిమాకు రచనా సహకారం అందించాడు. వరుణ్ తేజ్ హీరోగా 2018లో వచ్చిన తొలిప్రేమ సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు. 2019లో అక్కినేని అఖిల్ హీరోగా మిస్టర్ మజ్ను సినిమా, 2021లో నితిన్ హీరోగా రంగ్ దే సినిమాలకు దర్శకత్వం చేశాడు.

2007 జ్ఞాపకం
2010 స్నేహగీతం
2011 ఇట్స్ మై లవ్ స్టోరీ
2015 కేరింత
2018 తొలిప్రేమ
2019 మిస్టర్ మజ్ను
2021 రంగ్ దే
2023 సార్
2024 లక్కీ భాస్కర్

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *