వెన్నెలల్లిన చాందిని

వెన్నెలల్లిన చాందిని,,,,,,,!!

కళ్ళు కప్పుకున్న మృదువైన దేహంపై వెచ్చని బ్లాంకెట్,,,,,,,
నిర్మలమైన గులాబీ మోముపై కళ్ళు పాడే రాగాలలో రేయి పుష్పిస్తూ,,,,,,,,,,,
పసిడి చిమ్మిన మోములా చిరుచిరు నగవుల మౌన సంగీతం కనులలో సుందర స్వప్నాలు గాంచే రశ్మికవో,,,,,,,,,,,,,
నీ హృదయం పాడే సుమధుర గానం నీకై నీవు వింటూ ముసిముసి నగవులలో జీవజలములు పారుతున్న మనస్సు పుష్పించిన మరుమల్లియ సోయగం,,,,,,,,,,
చంద్రవదనీ చిన్నారీ మనస్సు గుప్పించు సిరివెన్నెలలు నీ సిరిసంపదలు నిదురించే మృదు మోహినీ లలామ,,,,,,,,,
దివ్యలోకాల్లోంచి దిగివచ్చి పట్టుపానుపుపై పవళించిన మృణాళినీ దివ్యత్వం నింపుకున్న పరిమళించే సౌందర్య తనయిక,,,,,,,,,,
వెల్లువెత్తుతున్న గోదారి నురగల్లో రసరమ్యంగా జలాకాలాడి వచ్చినట్లు పూసిన జాజిమల్లియవో ఓ చిన్నారీ,,,,,,,,,,,
ఇంద్రధనుస్సు రంగులలో పాలవెల్లి నెలవంక పూసినట్లు మోము నిండా కలువలు రసరమ్యంగా పుష్పించినట్లు గీతామనోహరీ,,,,,,,,
రేయి లేత కాంతుల్లో కుంకుమ పువ్వు లాంటి మోము ధగధగలు లక్షణమైన సిరుల సింగారీ లావణ్యవతీ,,,,,,,,,,,

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *