వెన్నెల రాత్రి..మాయ

 వెన్నెల రాత్రి  – మాయ
 

పచ్చని వాకిట్లో చుక్కల ముగ్గు లో ఉన్న పువ్వులా చందురూడు యెద విరుచుకున్నాడు
సిగ్గుల మొగ్గవుతూ రతి దరి చేరింది
అతని యెద లో వాలిపోవలని
తనలో ఇమిడిపోయి తన భారాన్ని దించుకోవాలనే ఆశతో
కోరికతో,అతని కెన్నో చెప్పాలని
తనతో యెన్నో పంచుకోవాలని
తన మదిలో దోబూచులాడుతున్న
తపనంతా తమకంతో తీరాలని
అడుగులో అడుగేసుకుంటూ
తనువంతా మమకంతో నింపుకుని
మనసంతా ప్రేమను నింపుకుని
కన్నుల నిండా కాంతి నింపుకుని
తానే నేనుగా పూవు తావిగా మలుచుకుని
దగ్గరగా వెళ్తుంటే ఒక్కసారిగా ఒళ్ళు విరుచుకున్న
చందురూడు దూరంగా తళుక్కుమని మెరుస్తున్న
కొత్తగా నిండు కాంతితో వెలిగిపోతున్న ఆకాశ
తార వైపుగా సాగాడు,రతి కాంక్షలన్ని ఆవిరయ్యాయి
ఎన్నాళ్ళుగానో చెప్పలనుకున్నవి చెప్పకుండానే
చందురూడు మరలి పోయాడు మరో కాంతి వైపు …గా
రతి బిత్తరపోయింది చందురూడు మాయ చేశాడని
భవ్య చారు
ఈ రచన నా సొంతమే అని హామీ ఇస్తున్నాను

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *