వేదన

మాది ఒక అందమైన కుటుంబం నేను అమ్మా నాన్న ఇంకా చుట్టాలు పక్కలు బందువులంతా కలసి ఉండేవాళ్ళం వారంతా ఎప్పుడో ఒకసారి కలిసే వారు కానీ మా చిన్ని ప్రపంచంలో మేము మాత్రమే ఆనందంగా గడిపేవాళ్ళం మా నాన్నగారు తన వ్యాపారానికి వెళ్లొచ్చి సాయంత్రం ముగ్గురం కలిసి పార్క్ కో లేదా సినిమాకో వెళ్లి బయట హోటల్లో తినేసి వచ్చేవాళ్ళం లేదా ఇంట్లోనే అమ్మ వంట చేస్తూ ఉండగా నేను నాన్న ఇద్దరం అమ్మ వెనకాలే ఉంటూ చిలిపి పనులు చేస్తూ అమ్మ కొప్పుడుతూ ఉంటే మేము నవ్వుకుంటూ అమ్మకి సహాయం చేసేవాళ్ళం…..

వంట అంతా తెచ్చుకుని ఆరుబయట వెన్నెల్లో కూర్చుని ఒకరికి ఒకరం తినిపించుకుంటూనో లేదా అమ్మ మాకు పెడుతుంటే ఆనంద పడుతూ తినేవాళ్ళం అలాంటి ఒక రోజు ఎప్పటిలా నాన్నగారు రాగానే బయటకు వెళదాం అని అన్నారు నేను అమ్మా రెడి అయ్యాము.

బయటకు వెళ్లి కొత్త సినిమా చూసి రెస్టారెంట్లో డిన్నర్ చేస్తుండగా వాన మొదలయ్యింది కాలంకానీ కాలంలో వాన ఏమిటండీ అని అంటూనే ఉంది అమ్మా ఏమోనే అని అప్పుడప్పుడు అలా పడుతుంటాయి లే ఏమి భయపడకు అన్నారు నాన్న డిన్నర్ చేసి కారులో మళ్ళీ ఇంటికి వస్తుండగా మా కారుకు ఒక కుక్క అడ్డుగా వచ్చింది దాన్ని  తప్పించబోయి కారుని ఒక రాయికి గుద్దుకుని పల్టీలు కొడుతూ వెళ్లి డివైడర్ ని గుద్దింది కారు

నాకు మెలకువ వచ్చే సరికి నేను ఆసుపత్రిలో ఉన్నాను నాన్నగారు నన్ను కనిపెట్టుకుని చూస్తూ ఉన్నారు చుట్టూ చూసాను అమ్మ కోసం అమ్మ నాకు కనిపించలేదు నేను నాన్నని అడగాలని అనుకున్నా కానీ నోట్లో పైపు ఉండడం వల్ల అడగలేకపోయాను మా నాన్న నా చూపులు గమనించి అమ్మ లేదమ్మా అని అంటూ కళ్ళు తుడుచుకుని బయటకు వెళ్లి పోయారు

నాకు అది అర్థం కావడానికి మూడు రోజులు పట్టింది యాక్సిడెంట్ లో ముందు కూర్చున్న మాకు బెలూన్స్ ఓపెన్ కావడం వల్ల ఏమి కాలేదు కానీ వెనక కూర్చున్న అమ్మ డోర్ కు లాక్ సరిగ్గా పడకపోవడం వల్ల పల్టీలు కొట్టినప్పుడు తలకు బలమైన దెబ్బ తగిలి అక్కడికక్కడే చనిపోయింది అని నేను సృహలో లేకపోవడం  వల్ల చివరి సారిగా అమ్మను చూసే భాగ్యాన్నికి కూడా నోచుకోలేకపోయాను నేను

చాలా రోజుల వరకు అదే డిప్రెషన్లో ఉన్నాను నా బాధ చూడలేక మా నాన్న గారు నాకు  ఫోన్ కొనిచ్చారు దాంతో నేను ఫోన్ తో కాలక్షేపం చేసేదాన్ని డిగ్రీ వరకు చదువుకున్న నేను అందులో మంచి యాప్ ఎదో కనిపిస్తే నచ్చి దాన్ని ఇంస్టాల్ చేసుకొని  దాంట్లో ఎదో వీడియోలు చేస్తూ  టైమ్ పాస్ చేస్తూ నా బాధని మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండేదాన్ని నేను చేసే విడియోలలో కంటెంట్ మంచి మెసేజ్ ఉండడం వల్ల అది చాలా మందికి నచ్చి నా వీడియోని వైరల్ చేయడం జరిగింది దాంతో నాకు లైక్లు ఫాలోవర్లు పెరిగిపోయారు అది కొందరికి నచ్చక నా వీడియోలను పోర్న్ విడియోలుగా చేసి వాటిని అందులోనే పెట్టారు ఎలాగో మా అమ్మ ఫోటో కూడా పెట్టి ఆమె గురించి చాలా చెత్త గా చెడు మాటలతో రాతలు రాసారు

అది చూసి నేను బాధ పడుతుంటే వాళ్ళు నవ్వుతూ వీడియోలు చేస్తూ పెడుతున్నారు ఇదంతా చూస్తున్న మా ఇంట్లో ఉన్న నౌకరు రామయ్య నన్ను ఓక ప్రశ్న అడిగాడు అవసరమా తల్లి నీకు ఇదంతా అని అడిగాడు అప్పుడు నాలో మొదలయ్యింది వేదన 

అవును నిజమే నాకు ఇది అవసరమా నాన్న నాకు ఫోన్ కొని ఇచ్చింది బాధని మర్చిపోవడానికి దాన్ని నేను విషయం అయినా నేర్చుకోవడానికి ఉపయోగించుకుంటే ఎంత బాగుండేది ఇలా వీడియోలు చేయకపోయి ఉంటే ఎంత బాగుండేది వీడియోలు చేయడం వల్ల నే కదా వాళ్ళకు నా తల్లి ఎవరో తెలియదు చనిపోయిన ఆవిడ మీద ఇలా బురద చల్లె బూతులు రాసే అవకాశం ఉండేది కాదు కదా ఇదంతా ఎవరికోసం చేసాను

ఎందుకు చేసానా అని ఇప్పుడు బాధ పడుతున్న నేను చేసిన తప్పేంటి నేను నా బాధని మర్చిపోవడానికి వీడియోలు చేయడమే నా తప్పా వాళ్ళు నా తల్లిని అలా అంటుంటే నాకు కన్నీళ్లు ఆగడం లేదు నా తల్లి చనిపోయిందని బాధ పడాలా లేదా నా మీద కోపంతో నా తల్లిని బయటకు లాగిన వాళ్ళ గురించి ఆలోచించాలా అనేది అర్థం కాలేదు నాకు 

వాళ్ళు వీడియోలు పెట్టడం దేశం అంతా నా తల్లిని ఇలా చూసింది నా తల్లిని  తిట్టించడం  కోసమేనా  నేను ఇలా చేసింది దీనివల్ల నేనేం లాభం పొందాను నాకు మిగిలిన కొద్దీ సంతోషాన్ని మనశాంతిని దూరం చేసుకున్నాను ఇదంతా వదిలెయ్యాలి అని అనుకుని నేను చేసిన విడియోలన్ని తీసేసి యాప్ ని కూడా డిలీట్ చేసేసి ఇక జీవితం లో ఫోన్ వాడవద్దు అని నిర్ణయం తీసుకున్న తర్వాత నా మనసుకు తృప్తిగా అనిపించింది…..

Related Posts