వేధింపులు…చిన్న పిల్లలు వేధింపులకు గురి అవుతున్నారు.

ఈ రోజు అంశం
వేధింపులు

శీర్షిక
ఇది నిజం

చిన్న పిల్లలు వేధింపులకు గురి
అవుతున్నారు.

ఇది నేనన్న మాట కాదు. ఒక పిల్లవాడు
అన్న మాట. ” చూడండి అంకుల్, అమ్మా-నాన్న నన్ను
ఆడుకోనివ్వటం లేదు. టీవీ
చూడనివ్వటం లేదు. ఎప్పుడూ
చదవమంటూ అరుస్తుంటారు.
టెన్త్ పరీక్షలు రాయటం అంటే ఏదో పెద్ద పని అన్నట్లు మా
మనసులో ఆ పరీక్షల పట్ల
భయం కలిగిస్తారు. ఇరుగు
పొరుగు వాళ్ళు కూడా నేను ఎదురు పడితే మొదట అడిగే
ప్రశ్న ఎలా చదువుతున్నావు
అని. ఫ్రెండ్స్ కూడా అలాగే
తయారు అయ్యారు. ఎప్పుడూ ఏదో ఒక చదువుకు
సంబంధించిన విషయాలే
మాట్లాడతారు. ఇక టీచర్లు
కూడా ఎప్పుడూ చదువుతూ
ఉండమనే చెపుతూ ఉంటారు.
సమయాన్ని సద్వినియోగం చేసుకోమని హిత బోధలు
చేస్తూ ఉంటారు. పరీక్షలంటే
ఒక భయాన్ని నా మదిలో
క్రియేట్ చేసారు. తక్కువ
మార్కులు వస్తే తిడతారు.
ఇంట్లో వాళ్ళేమో కొడతారు.
మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియటం
లేదు. భగవంతుడు కూడా
మమ్మల్ని కనికరించటం లేదు.
అసలు ఆడుతూ పాడుతూ
పదవ తరగతి పరీక్షలు పాస్
అవగలం. అనవసరంగా పెద్దలు మమ్మల్ని టెన్షన్ పెట్టి
వాళ్ళు టెన్షన్ పడుతున్నారు.
ఏమి చేయాలో తెలియటం
లేదు అంకుల్. మీరే ఏదైనా
సలహా చెప్పండి” అని వాపోయాడు. నేను చెప్పే
సలహా ఆ పిల్లవాడికి నచ్చినా
అతని తల్లిదండ్రులకు, సమాజానికి నచ్చదు కాబట్టి
మౌనంగా ఉండవలసి వచ్చింది.

ఈ రచన నా స్వీయ రచన
అని హామీ ఇస్తున్నాను.
వెంకట భానుప్రసాద్ చలసాని

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *