శక్తి

హత్రాస్ బాలిక పైన జరిగిన సంఘటన మిద ఒక కథ రాయాలని అనుకున్నా కానీ ఎక్కడ మొదలు పెట్టాలి అనేది నాకు అర్ధం కాలేది ఎందుకంటే ప్రతి రెండు నిమిషాలకు ఒక సారి ఎక్కడో ఒక చోట అమ్మాయిల మిద అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి,వీటికి అంతు లేదు మరి ఎక్కడుంది లోపం మన సమాజంలోనా,లేదా పెంపకం లోనా ,లేకపోతే ఇంకా కుల మత పిచ్చి తో బతుకుతున్న మూర్ఖుల వల్లనా ఏది ఏమైనా కష్టం మాత్రం ఆడదానికే అది వయసులో ఉన్నదా లేక నడివయస్సున ఉందా,లేక పండుముసలి అయినా పసిపాప అయినా ఇది మాత్రం నిత్యకృత్యం అయిపోయింది

కొన్నాళ్ళ క్రితం ఒక ఆడదాని నిపైన మానభంగం జరిగితే అయ్యో పాపం అని అనేవాళ్ళు జాలి చూపించే వాళ్ళు ఆ అమ్మాయిని వాడికి ఇచ్చే పెళ్లి చేసేవారు వాడు ఒప్పుకుంటే అదే భాగ్యం అని అనుకునే వాళ్ళు అది ఎప్పుడో ఒకసారి జరిగేది దాని గురించి మాట్లాడడానికి కూడా ఇష్టపడలేక పోయేవారు కానీ ఇప్పుడు ఆ రేప్ ఎలా జరిగింది.

ఎందుకు జరిగిందనే  కాక ఎంతమంది ఎన్నివిధాలుగా ఎలా ఏ భంగిమల్లో చేసారు,ఎక్కడ మొదలు పెట్టారు,ఎక్కడ ఆపేశారు ? అప్పుడు ఆ అమ్మాయి ఒంటి మిద బట్టలు ఉన్నాయా లేవా ?నలుగురు చేస్తే తట్టుకుని బతికేఉందా?అని అంటూ మాట్లాడుకుంటున్నారు.

జనాలకు ఇదంతా ఒక మామూలు విషయంలా మారిపోయింది ఒకవేళ స్పందించినా అవికొవ్వత్తులతో ఆగిపోతున్నాయి,కొంచం ముందుకువెళ్తే తప్పు చేసిన వారు ఒకరైతే శిక్ష ఇంకొకరికి వేస్తున్నారు,వారు నిజాలు బయట పెడతారేమో అని వారికీ ఎన్కౌంటర్ చేస్తున్నారు.

అవును మీరు విన్నది నిజమే నాకు,నాకేంటి ఖర్మ చాలా మందికి ఉన్నాయి కొన్ని అనుమానాలు ఎక్కడ అంటారా అదేనండి మన దిశకేసులో పాపం ఆ అమ్మాయి దారుణంగా చెరిచి చంపారు కానీ వెనక జరిగింది వేరు అని గుసగుసలు ఉన్నాయి.

ఉన్నాయి కాదు నిజమే  కావచ్చు కూడా ఆవిడను కొందరు పెద్దల కొడుకులు కన్నేసి రేప్ చేసి చంపేసి దానికి వేరే వాళ్ళను ఒప్పించి వారికీ డబ్బు ఆశ చూపి పోలీసులకు పట్టించారు పాపం వాళ్ళు డబ్బుకు ఆశపడి ఒప్పుకుంటే వాళ్ళు నిజాలు ఎక్కడ చెప్తారో అని ఎన్కౌంటర్ చేసారు

అంగబలం అర్ధబలం లేకపోవడం వల్ల వాళ్ళ కుటుంబాలు ఏమి చేయలేక ఇచ్చిన డబ్బుతో బతుకుతున్నాయి,పోయిన వాళ్ళు రారు పైగా పైసా అంటే ఎవనికి ఇష్టం ఉండదు చెప్పండి దాంతో పైసా కోసం వారి ప్రాణాలు పణంగా పెట్టారు సరే పోనీ అదంతా కానీ ప్రతి సారి ఆడదాని మిద అత్యాచారాలు చేసేది ఒక పెద్ద కులం వాళ్ళో లేదా రాజకీయంగా బాగా పేరున్న వాళ్ళో తప్ప మిగతా వారు ఎవరు కారు లేరు ఒకవేళ ఉన్న కేసు అవ్వగానే వాళ్ళు రాజికి వచ్చి  పెళ్లి చేసుకోవడమో లేదా డబ్బు ఇచ్చో లేకపోతె ఇదంతా కాదనుకుంటే నోర్లుమూసుకుని ఉంటారు.

ఎక్కడో ఒక దగ్గరే ఇది బయటకువచ్చినా చాలావరకు వాళ్ళను బెదిరించో,భయపెట్టే కేసుని పేట్టనివ్వకుండా చేస్తారు భయపడి వాళ్ళు పోయిన శీలం ఎలాగు రాదు కాబట్టి కేసు పెట్టి నలుగురిలో పరువు తీసుకోలేక కొందరు ఎలాగో నోర్లు ముసుకుంటారు,ఇక కొందరు అయితే రేప్ జరిగినది అని తెలిస్తే హ అదేంచేసిందో వాడితో ఏమితిరిగిందో,అంతా తిరిగిన తర్వాత ఇప్పుడు కాదంటే వాడేందుకు ఉరుకుంటాడు అని అంటారు.

చాలా కామన్ గా దిన్ని మాట్లాడుకుoటారు,ఎవరో కాదండీ మన ఆడవాళ్లే అంతెందుకు నేనే అనొచ్చు కూడా హ ఫ్రెండ్ అనిఅంత తిరిగితే ఫ్రెండ్ అంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు అని,అనొచ్చు ఎందుకంటే మన సంస్కారం అంతే అంతకంటే ఎక్కువ అలోచించం మనం ఓ పెద్ద రచయితవు కదా ఆమాత్రం సంస్కారం లేదా అంటారా?చూడండి రచయిత కంటే ముందు నేనొక సగటు ఆడదాన్ని నేను ఆలోచించను అప్పుడు నాకేం అనాలనిపిస్తే అది అనేస్తా,నేనే కాదు చాలామంది అంతే ఏదైనావిషయం తెలియగానే పుసుక్కున ఒకమాట అనేస్తారు

మళ్ళిదాన్ని కవర్ చేసుకోవడానికి ఏవేవో చెప్తారు,చేస్తారు అది చాలా మామూలు విషయం.ఇక అత్యాచారాల విషయనికి వస్తే తనకు రేప్ జరిగింది అని వచ్చిన బాధితురాలిని పోలీసులు రకరకాల మాటలతో వారిని హింసించి హింసించి చంపినా కొంచం గట్టి ప్రాణాలు అయితే తట్టుకుని నిలబడి నాకు ఇలా జరిగింది అని చెప్పుకుంటారు.

కేసు పెడతారు దైర్యంగా ఆ తరువాత డాక్టర్ పరిక్షలు అంటూ పిచ్చి ప్రశ్నలతో వారిని ఇబ్బంది పెట్టినా కూడా తెగించి నిలబడితే చివరికి కోర్టులో విచారణ పేరుతో ఇబ్బంది కరమైన ప్రశ్నలు వేసి,పాత సినిమాల్లో చూపిస్తారు కదా వాడు ఇక్కడ ముట్టుకున్నాడా,అక్కడ చేయి వేశాడా,ముందు చీర లాగాడా ముద్దుపెట్టాడా అంటూ అలాంటివి అడిగి కేసు నీరు కార్చాలని చూస్తారు,

డబ్బుతో సాక్ష్యాలను కొని చివరికి అసలు ఆ సమయంలో వారక్కడ లేనే లేరని అంటారు ఇప్పుడు ఈ కేసు అంటే హత్రాస్ కేసులో రాము అనే వ్యక్తి ఆ సమయంలో కంపెని లోనే ఉన్నాడు అని చెప్పినట్టుగా,అసలు ఆమె మీద వేరెవరో చేసిన పనికి మామీద కక్షకట్టి చెప్తున్నారంటూ చేసిన వాడికి మద్దతు ఇస్తారు పెద్ద మనుషులు.

ఇక ఈ విషయం బయటకు రావడమే గొప్ప అయితే వాళ్ళను అరెస్టు చేసి జైలుకి పంపడం ఒక ఎత్తు,ఒక వేళ పంపినా వాడికి అక్కడ సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి రాజభోగాలు అన్ని అమర్చి వాడు పెద్ద ఘన కార్యం చేసినట్టుగా వాడిని చూస్తారు,ఎక్కడో ఒక దగ్గర మాత్రం వాడిని పురుగులాచూసినా మూడుపుటలు తిండిపెట్టి వాణ్ణి పోషిస్తున్నారు.

కొన్నాళ్ళకు అందరు మర్చి పోతారు.కొత్త విషయం ఏదైనా బయటకు వస్తే దాన్ని గురించి మాట్లాడతారు అంతా మరి పాపం ఆ రేప్ కి గురయ్యిన అమ్మాయి పరిస్థితి ఏమిటి వాడు  జైలుకి వెళ్తే మరి ఇక్కడ ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటో ఎవరికీ అర్ధంకాదు ఆమెకి పెళ్లి అవుతుందా?కాదా?చనిపోతే ఒక బాధ,బతికితే ఒక బాధ ఇన్ని సంఘాలు,మహిళలు పురుషులు కూడా మానభoగం జరిగిందని కోడైకూసి ఆమెకు మద్దతుగా ఉన్నవాళ్ళలో ఒక్కరైనా ఆమెకు కొత్త జీవితాన్ని ఇస్తారా,అసలు ఇవ్వాలి అని అనుకుంటారా?

ఓ ఎదో అయ్యింది,ఎదో జరిగింది ఆమెకు న్యాయం చేయాలి అంటూ అరిచే ఒక్క మహిళా అయినా ఆ అమ్మాయిని తన కోడలుగా చేసుకోగలదా?లేదా కూతురిగా దత్తత చేసుకుని  ఆమెకి పెళ్లి చేయగలదా?,పేస్బుక్ లో , వాట్స్ అప్ లో స్టేటస్ లు పెట్టి వార్తలు రాసి,కవితలు పెట్టె వారిలో ఒక్కరైనా ఆమెకు జీవితాన్ని ఇవ్వగలరా? అసలు ఆ ఆలోచన చెయ్యగలరా?చేస్తారా,? అరిచి పరువు తీసిన వాళ్ళు అరవకుండా మంచిని చేయలేరా?

ప్రశ్నించడం మంచిదే కానీ దాని తర్వాత జరిగే పరిణామాల పరిస్థితి ఏంటని ఆలోచించి ముందు అడుగు వేయాలి,చెప్పేది ఏంటంటే వాడు రేప్ చేయగానే అక్కడే వాడిని చంపి,ఆ సంఘటనని మర్చిపోవాలి,లేదా సమయం చూసివాడిని ఎలాగైనా చంపాలి,?ఇది ఇప్పుడు కావాల్సిన న్యాయం ధర్మం కాదని అంటారా?ఎవరో వచ్చి ఎదో చేస్తారని కాకుండా మనమే  ఒక శక్తిలా మారాలి అప్పుడే ఈ అరాచకాలను అరికట్టగలం…                                                                                                                                                                                                                 

Related Posts