దాహం,,,,,, దాహం అంటే దాహం తీర్చేది మహిళ
ఆకలి,,,,,,, ఆకలి అంటే అన్నం పెట్టేది అమ్మ మహిళ
నీ కామకోర్కెలను తీర్చేది ఇల్లాలనే మహిళ
పురిటి నొప్పులతో బిడ్డకు జన్మనిచ్చేది ఓ తల్లి అని మరువకు!!
ఈ పురుషస్వామ్య వ్యవస్థలో మహిళ చదరంగంలో పావు అయింది
పెళ్ళితో మహిళ కోరుకునే భవిష్యత్తుపై ఆశలు అడియాశలై
మగాడి చేతుల్లో బంధీయై సర్వస్వము కోల్పోయేది మహిళ
మగాడికి పట్టిన ధన పిశాచి వరకట్నం!
మగాడు శ్రమించి సంపాదించే తత్వం లేక తన ఆధిక్యత కోసం
అబలలను కట్నం కోసం పీల్చి పిప్పి చేసే మృగం మగాడు,,,,,!
తన మెడలోని తాళి ఎగతాళియై బుసకొడుతుంటే
తన తల్లిదండ్రులు కట్నం ఇచ్చుకునే స్థితి లేక కన్నీరు మున్నీరవుతుంటే
తాముకూడా ఆడవాళ్ళమని మరచిన అత్తా ఆడబిడ్డలు చూపించే నరకం ఓ అగ్నికుటీరం తన అత్తారిల్లు !
అదే మహిళ చదువుకుని ఉన్నత ఉద్యోగం చేస్తే
ఆమె జీతం రాళ్లన్నీ వాడి చేతుల్లో పడాలి
మహిళ ఒక బంగారు గుడ్లు పెట్టే బాతు వాడికి!
ఈ సృష్టికి మూలమైన స్త్రీమూర్తికి పడరాని పాట్లు
వాడు వాడి తల్లిదండ్రులతో అగ్నికి ఆహుతి అయ్యేది మహిళ
మహిళ అబల కాదు ఆడపులియై గర్జిస్తే నీ కొంపకే కొరివివి పెట్టగలదు ఇది గుర్తుంచుకో!!
అపరాజిత్
సూర్యాపేట