శీలం 1

శీలం

శీలం
శీలం

అను : అవునే శీలం అంటే ఏంటి అడిగింది వకిల్ సాబ్ సినిమా చూసి వచ్చిన నా స్నేహితురాలు

మను: శీలం అంటే ఏంటో నువ్వు ముందు చెప్పు

అను: శీలం అంటే ఏంటని అడిగితే నన్ను చెప్పమంటావు  ఏంటి నువ్వు చెప్పు

మను: సరే చెప్తా విను  శీలం అంటే జాలి, దయ, ప్రేమ అనురాగం, ఆప్యాయత, మానవత్వం, ఈ సుగుణాలను శీలం అంటారు.. ఇవేవీ లేని వాళ్లను మానవత్వం లేని వాళ్ళు అంటారు . ఇప్పుడు నువ్వు చెప్పు

అను: అబ్బా సోది శీలం అంటే నికు తెలిసింది ఇదేనా అయినా నాకు తెలిసి శీలం అంటే ఇది కాదనుకుంటా

మను :  మరెంటో చెప్పు

అను: శీలం అంటే అమ్మాయి కి సంభందించిన విషయం శారీరకం గా ఎవరినైనా కలిస్తే పోయేది శీలం అని నాకు తెలుసు ..

మను:   మరీ తెలిస్తే నన్నెందుకు అడిగావు

అను : నువ్వు ఇంకేదైనా  కొత్తగా చెప్తావు ఏమో అని అడిగాను

మను : అవునా సరేలే

అను ;  మరి శీలం అంటే అమ్మాయికి మాత్రమే ఉంటుందా అబ్బాయికి ఉండదా

మను: నీ పిచ్చి మొహం శీలం అందరికీ ఉంటుందే సినిమాలో చూసి అపోహ పడకు..

అను: అవునా మరి అబ్బాయిలు ఎంత మంది అమ్మాయిల దగ్గరికి వెళ్ళినా తెలియదు అంటారు కదా

మను: నీ మొహమే అందరికీ శీలం ఉంటుంది అబ్బాయిలకు కూడా ఉంటుంది

అను: మరి అబ్బాయిలకు శీలం పోయింది అని ఎలా  తెలుస్తుంది.

మను:  ఏముంది వాళ్ళు మొదట ఏ అమ్మాయితో శారీరకంగా కలుస్తారో  వాళ్ళ దగ్గరే పోతుంది.

అను: అంటే అమ్మాయిలకు బ్లీడింగ్ అయినట్టు అబ్బాయిలకు కూడా అవుతుందా

మను: అవును అవుతుంది అమ్మాయిలకు తెలుస్తుంది కానీ అబ్బాయిలకు తెలియదు అంతే

అను: అవునా తెలియదా అంటే ఎలా

మను: అబ్బా నీ సందేహాలు  నువ్వూ ఎలా ఏముంది యూరిన్ లో పోతుంది..  ఇక నన్ను అడగకు

అను: అబ్బా ప్లీజ్ ఓకే ఒక్క సందేహం…

శీలం

శీలం
శీలం

మను: సరే ఏంటో చెప్పు

అను:  అబ్బాయిలకు ఎలా బ్లీడింగ్ అవుతుందో చెప్పు చాలు

మను : అదా మొదటి సారి అమ్మాయికి ఎలా శారీరకంగా కలిస్తే కన్నెపొర చిరుగుతుంది కదా అలాగే అబ్బాయిలకు కూడా స్కిన్  చిరిగిపోతుంది దాంతో బ్లీడింగ్ అవుతుంది కాకపోతే తక్కువగా అవుతుంది. అమ్మాయిలకు కూడా ఓ మోస్తరుగా అవుతుంది.

అను:  ఓ అవునా అంటే అబ్బాయిలు కూడా శీలం పోతుంది అన్నమాట

మను: అవును పోతుంది  కానీ ఒకటి ఏంటంటే అందరికీ అలా జరగాలని ఏం లేదు గోడలు ఎక్కినప్పుడు  లాంగ్ జంప్ చేసినప్పుడు కూడా చిరిగి పోతుంది దాన్ని ఒక మామూలు చర్యగా అనుకోవాలి తప్ప మూర్ఖంగా వాదించకూడదు అలాగే బ్లీడింగ్ అవ్వక పోతే వాళ్ళు స్వచ్చoగా లేరు అని అనుకోకూడదు.

అను: హేయ్  అదిగో బస్ వస్తుంది మన మధ్య ఈ సంభాషణ జరగడం చాలా బాగుంది అవును నువ్వు అలాంటిది ఏదైనా ఫేస్ చేసావా

మను: అవును చేశాను

అను :అవునా మరి చెప్పవా

మను:ఇప్పుడు కాదు లే

అను ; మరి ఎప్పుడు

మను :మళ్లీ  ఇంకొక రోజు  దాని గురించి మాట్లాడుకుందాం

అను : సరే పద మళ్లీ క్లాస్ లేట్ అయితే ప్రొఫెసర్ ఊరుకోరు

మను : పద …..

అంటూ  ప్రణవ్ మెడికల్ కాలేజీ  బస్ ఎక్కారు అమ్మాయిలు..

Related Posts

1 Comment

Comments are closed.