శేషమ్మ కోరిక
శేషమ్మకు ఐదుగురు పిల్లలు వాళ్లకి పెళ్లి చేసి పంపించేసింది. ఆరోగ్యం కారణంతో తన భర్తగా రెండు సంవత్సరాల క్రితం చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత పిల్లలకు ఎవరి వాటా వాళ్లకి పనిచేసి , తనకోసం కొంత పొలం కొంత డబ్బు ఉంచుకుంది.
ఒక సంవత్సరం తర్వాత రవణమ్మ భర్త చనిపోవడంతో… శేషమ్మ దగ్గరికి వచ్చి ఉంటుంది. రవణమ్మకి ఒక కొడుకు అతని పేరు సుందర్.
ఈ విషయం తెలిసిన ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుర్లు తన దగ్గర ఉన్న కాస్త పొలం డబ్బులు ఇచ్చేయమని అడిగారు.
ఇవి నా అనారోగ్యం కోసం దాచి పెట్టుకున్నాను అంతే తప్ప మీకు ఇవ్వడం కోసం కాదు అని తెగేసి చెప్పేసింది శేషమ్మ.
అప్పుడే తన కూతుర్లు శేషమ్మ పొలం ఎవరైనా కొనాలి అనుకుంటే…? మాత్రం చంపేస్తాము అని బెదిరించి వెళ్లిపోయారు.
అప్పుడప్పుడు సుందర్ , శేషమ్మ పెద్ద కూతురు కొడుకు కుమార్ వీళ్ళిద్దరూ అప్పుడప్పుడు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు.
ఈ గొడవ అయిన తర్వాత ఒకసారి కలిసి మాట్లాడుకున్నారు ఈ పరిస్థితులను ఎలా చక్కదిద్దాలో అర్థం కావట్లేదు? అని ఆలోచనలో పడ్డారు.
అప్పుడే రోడ్డుపైన ఇంటికి వెళ్తున్నప్పుడు , ఒక పిచ్చి ఆమెని తీసుకెళ్లడానికి ఒక ట్రస్ట్ వాళ్ళు వచ్చారు.
కానీ , ఆమె వీళ్ళకి భయపడి వాళ్లతో వెళ్ళట్లేదు. బాగా ఆలోచించి అతనిలో ఒక అతను ,
ఆమె చేస్తున్నట్టుగా చేసి వాళ్లతో వచ్చేలా చేశాడు ఆ పిచ్చి ఆమెని.
అది చూడగానే సుందర్ లో ఒక ఆలోచన వచ్చింది వెంటనే ఈ విషయం కుమార్ కి చెప్పి ఇంటికి వెళ్లి పోయారు.
అదే రోజు రాత్రి శేషమ్మను చంపడానికి ముసుగులో ఒకరు వచ్చారు.
కానీ చంపేలోపు చేతిలో ఒక ఫోటో చూసి కన్నీళ్లు కారుస్తూ వెనక్కి వెళ్లిపోయారు.
నెల రోజుల తర్వాత ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్లు వచ్చి అందరూ ముందు క్షమాపణ చెప్పి ,
“అమ్మ! నీ కష్టార్జితంతో సంపాదించిన పొలం డబ్బు మాకేం ఇవ్వద్దు? నీ దగ్గరే ఉంచుకో నీ ఆరోగ్యం మంచిగా చూసుకో అప్పుడప్పుడు మేము వచ్చి వెళ్తూ ఉంటాం” అని చెప్పి వెళ్ళిపోయారు.
తన పిల్లల్లో వచ్చిన మార్పుని చూసి ఆశ్చర్యపోయింది శేషమ్మ , రవణమ్మ. అది చూసి సుందర్ కుమార్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుకొని వెళ్ళిపోయారు.
ఆరోజు రాత్రి ముసుగులో వచ్చింది ఎవరో కాదు శేషమ్మ పెద్ద కూతురు?
ఆరోజు రాత్రి శేషమ్మ చేతిలో ఉన్న ఫోటో వాళ్ళ కుటుంబంతో దిగిన ఫోటో అందులో తన తండ్రిని , పిల్లలను తలుచుకొని కన్నీళ్లు కారుస్తూ నిద్రపోయింది అన్న విషయం అర్థమై , తాను చేస్తూనే తప్పు అని తెలుసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. శేషమ్మ కోరిక నెరవేరాలతో తనలో చిరునవ్వు వికసించింది.
శేషమ్మను చూడటానికి అప్పుడప్పుడు వాళ్ళ పిల్లలు వస్తూ పోతూ ఉండేవాళ్ళు వాళ్ళ ఆలనా పాలన ఉన్నన్ని రోజులు చూసి ఆనందంగా ఉండేది.
ఆస్తి కోసం తల్లిని తండ్రిని అన్నదమ్ములను చంపడం న్యాయమేనా! అలా చంపడం వల్లే బంధాలు దారం కన్నా బలహీనంగా అయిపోతున్నాయి. అది గుర్తుపెట్టుకుని నడుచుకోండి.
గొడవలు జరగని కుటుంబాలు ఉండవు అని ఆ గొడవలకు పరిష్కారాన్ని వెతికి కలిసిపోవడం బంధమని తెలుసుకోండి.
మాధవి కాళ్ల