శ్రమజీవులు

శ్రమజీవులు

శ్రమని నమ్ముకుని జీవించే వలస జీవులు, ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్లి డేరాలేసుకుని పనిచేసుకు బ్రతుకుతుంటారు..

వాతావరణం వలన ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ వలస జీవులు ..
కానీ ఉండే చోట లేదు ఉపాధి తప్పదు కడుపు నింపుకోవడానికి ఊరూరు తిరక్క కొందరికి..

కొన్నిచోట్ల పెత్తందారుల అహంకారపు చేష్టలను తట్టుకోలేక ఊరు వదిలి వలస వెళ్లే మనుషులు కొందరు ..

వాగులు వంకలు ఉన్నచోట ప్రకృతి ప్రళయాలను దాటుకోడానికై ప్రాణాలైనా దక్కితే చాలని ముసలాముతగా పిల్లాపాపలను తీసుకొని సురక్షితమైన చోటకి వలస వెళ్ళే వాళ్ళు కొందరు …

దేశాల మధ్య యుద్ధాలు జరిగి ప్రాణాలు పోయే పరిస్థితి సామాన్యులకు వస్తే జీవితం దుర్లభం అవుతుంది తిండి , నీరు లేక వలస బయలుదేరే వాళ్ళు మరికొందరు .

దానికోసమై శ్రమను లెక్క చేయక ఎంత కష్టమైనా అనుభవిస్తూ ప్రశాంతమైన ప్రదేశానికి రావడానికి ప్రతి వారు ప్రయత్నం చేస్తారు .

నోరులేని పక్షులే కాదు నోరు మనసు అన్నీ ఉన్న మానవుడికి కూడా అదే శ్రేయస్కరం కాబట్టి ఉన్న జీవితాన్ని సౌకర్యవంతంగా జీవించటానికి మంచి మార్గమని ఎంచుకున్నారు.

ఆ చిత్రంలోని ప్రజలు కూడా వారి కుటుంబాన్ని క్షేమంగా సౌకర్యంగా ఉంచుకోవడానికి వలస వెళుతున్నారు…

ఆలపాటి సత్యవతి

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *