సంధ్యా నౌక

అక్షర కొరకు

అంశం : ఐచ్ఛికం

శీర్షిక : సంధ్యా నౌక

ఆకాశమంతా పసిడి రంగులు పూసె…
సందె వెలుగులు నీటిపై నవ్వులేసె…

ప్రకృతి ఒడిలో పడవ సాగె మెల్లగా…
గాలిలో తేలే మేఘం తోడుగా…

ఒడ్డున తాటి చెట్లు వరుసై నిలిచె…
వాటి నీడలు నదిలో చిత్రమై మెరిసె…

మనసు పరవశమై తేలే ఈ వేళ…
ప్రయాణమే ఒక పాట, జీవమే ఒక లీల…

దూరాన సూరీడు జారె కొండ చాటుకు…
వెలుగు పరచె చివరి ముద్దు నీటి మాటుకు…

తెడ్డు చప్పుడు లయగా మోగే తీరాన..
ఆ లయలోనే హృదయం సాగె ధీరాన…

ఏ తీరం చేరాలో తెలియకున్నా..
సాగిపోవడమే బాగుంది అనిపించెనా…

ఈ క్షణమే శాశ్వతమై నిలిచిపోతే..
ఆకాశం,నది,మనసు ఒకటై పోతే…

నది వెంటే మన బతుకు సాగిపోయే..
కలల తెడ్డుతో ముందుకు తేలిపోయే…

గరిగిపాటి శ్రీ లక్ష్మీ నారాయణమ్మ
ఏలూరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *