సంసార సాగరం నాది -జీవితం

సంసార సాగరం నాది -జీవితం

సంసార సాగరం నాది.

“సంసార సాగరం నాది,
సమతుల్యం లేని సంపాదన,
‘సంగీత సరిగమల బాల్యం,
ఒడిదుడుకుల యవ్వన కౌమారం!
‘ప్రేమే సర్వస్వం అనే భావన,
చదువులు సాగక, ఉద్యోగాలు రాక,
చాలీచాలని, జీతాలతో
సతమతమైన నా కుటుంబం.”

‘భార్యాభర్తల అనురాగం
పదములలో మాత్రమే’,
‘అత్తమామల ఊడిగాలు,
ఆడపడుచుల
ఈసడలింపులు,
‘భర్త గారి పని ఒత్తిడులో,
‘బడ్జెట్ పద్మనాభ అవతారం!!!’
ఒకటో తారీకు గుండె దడ,
సంసార సాగరం లో నావ ఊగిసలాట,
‘నడుం కట్టిన భార్యామణి ఉద్యోగపర్వం,!
కంటి చూపు కరువైన కుటుంబ కలయిక,

‘సంసార సాగరంలో అలల అలజడి,
పిల్ల చాపల పోషణ తలకు మించిన భారం!! ‘మధ్యతరగతికి శాపనార్థాo,
‘ప్రభుత్వ సహకారాలు
ఆమడ0త దూరం,’
అన్నింటికీ ఒకటే సమాధానం.

“18, సంవత్సరములు దాటిన ప్రతి ఒక్కరూ, ఏ చదువులు చదివిన, ఏదో పని చేస్తు విద్యను అభ్యసించాలి,

“తల్లిదండ్రుల తల నొప్పులకు,
‘మనసామృతంజనం’ రాయాలి!!
ఉజ్వల భవిష్యత్తుకి, క్రమశిక్షణతో పునాదులు వేయాలి!!
అప్పుడే సంసార సాగరంలో, అలల అలజడి తగ్గి ,ప్రశాంత జీవనం కొనసాగుతుంది.
    … . .*””””””**

వేల్పూరి లక్ష్మీ నాగేశ్వరరావు

సంసార సాగరం నాది -జీవితం

 

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *