సకల కళలలో ధీశాలి మహిళ

మహిళా జీవనజ్యోతి
జగత్తుకు మాతృమూర్తి
చదువుల తల్లి సరస్వతి
మగాడి హృదయంలో నెలవైన ఇల్లాలువి
అఖండ జ్ఞానజ్యోతులు పుత్రికలు,సుపుత్రులు
సంసార జంజాటకంలో సతమతమవుతూ
ఉద్యోగం ఇతర వ్యాపకాలలో
ఆరితేరిన శారీరక మానసిక శ్రమలతో
కుటుంబానికి, సామాజిక చైతన్యంలో
నీవు బ్రతుకుబండికి ఇంధనమై
మగవాడి సుఖమయ జీవనయానంలో
అర్దనారీశ్వరీ తత్వంగా
సాలోచనల అక్షరాలలో ఉద్గ్రంథాలు లిఖించి
సామాజిక దిశానిర్దేశం చేస్తున్న కవయిత్రివి
పల్లెటూళ్ళలో మగాళ్లతో సమానంగా
వ్యవసాయంలో కాయకష్టం చేస్తూ
సకల విద్యలలో మేటివని కీర్తింపబడుతూ
శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం
ఉపయోగించే నైపుణ్యంలో మేటివి
కర్మాగారాలలో కార్మికురాలివై
సైనికురాలివై దేశానికి భద్రత నీవై
వినీల గగనంలో వ్యోమగామివై
క్రీడలలో దేశ పతాకాన్ని వినువీధిలో ఎగరేసిన ధీశాలివి
నీకు నీవే సాటివని నిరూపించుకుంటున్న
బహుదూరపు జీవనరాగాలను మీటుతున్న
వెలుగుల సూరీడువు,,,,,

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *