"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

సముద్ర తీరంలో ఒక అందమైన ఇల్లు

సముద్ర తీరంలో ఒక అందమైన ఇల్లు

సముద్ర తీరంలో ఒక అందమైన ఇల్లు కట్టుకొని
సముద్ర తీరాన్ని ఆస్వాదిస్తూ
అలలుతో ఆడుకుంటూ
ప్రకృతి ఒడిలో స్వేద తీరుతూ
ఒంటరిగా ఏ టెన్షన్స్ లేకుండా
సముద్రం నుండి వచ్చే స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ
అక్కడే కొన్నాళ్లు ఉండిపోతే ఎంత బాగుంటుందో
ఎన్నోసార్లు సముద్రతీరానికి వెళ్లి అక్కడ ఒంటరిగా గడపాలి అనుకున్నానో…
పరిస్థితులు అనుకూలించక నేను వెళ్ళలేకపోయాను…
ఆ సముద్రతీరంలో నా పక్కన నా భాగస్వామి ఉంటే
ఒడ్డున మేమిద్దరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే
అలలు వచ్చి మన కాళ్ళకు తగులుతూ ఉంటే. సముద్ర తీరంలో ఒక అందమైన ఇల్లు
ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది వర్ణించలేనిది కూడా..
అందమైన సముద్రతీరంలో పూరి గుడిసెలో ఉన్న ఆనందంగానే ఉంటుంది…
సముద్రానికి దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది సముద్రాన్ని చూడలేదు అనేది కోరిక తీరిపోతుంది..
అంత పెద్ద సముద్రం చూశాక నా సమస్యలు కూడా చిన్నవిగా కనిపిస్తున్నాయి నాకు…
ఆ సమస్యల నుంచి ఈజీగా బయట పడొచ్చు అనే ధైర్యం వస్తుంది…
కానీ కోపం వస్తే మాత్రం ఈ ప్రపంచాన్నే నాశనం చేసేస్తుంది ఆ సముద్రం..
అక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం.. 
మనల్ని హాని చేసేవాళ్ళు మన చుట్టూ ఎంతమంది ఉన్నారో అని చెప్పలేము గాని
హాని చేసే వాళ్ళు మాత్రం తప్పకుండా ఉన్నారు.. సముద్ర తీరంలో ఒక అందమైన ఇల్లు
సముద్రాన్ని చూస్తే ఏదో తెలియని అనుభూతి , ఆనందం కలుపుతుంది..
ఒకసారి సముద్ర తీరం దగ్గరకు వెళ్లి అలలుతో ఆడుకోవాలని ఉంది…

సముద్ర తీరంలో ఒక అందమైన ఇల్లు

మాధవి కాళ్ల

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *