సరిగమల సంగీతం  రావాలంటే..

సరిగమల సంగీతం  రావాలంటే..

సరిగమల సంగీతం  రావాలంటే..
సాగరతీరం అవసరమే!
అలల రాగం శ్రవణానందం..
ఆలపించే నా హృదయరాగం..
శుభోదయాన వినిపించే నా గుండెసవ్వడి..
సాగరవాసుడితో పోటీ పడుతుంది..
ఆ జలకన్యలు నా రాగం విని..

సరిగమల సంగీతం  రావాలంటే..నాట్యమాడుతున్నాయి సాగర లోతున..
నేనాలపించే సుమధుర సంగీతం..
ప్రకృతి కాంతను పరవశింప చేస్తుంది..
ఆకాశ మార్గాన వెళ్లే పక్షి జాతి ఒక నిమిషం ఎగరడం ..
ఆగి పోయాయి..
నా పాటనే పాడుతూ మళ్లీ ప్రయాణం సాగించాయి..
అది చూసి ఆకాశరాజు అవాక్కయ్యాడు..
నా గిటారు పాటలో అంత మాధుర్యం దాగుందని నా కప్పుడే
తెలిసింది!!
ఓ పాట నా హృదయంలోనే నిదురించమ్మా!!
ఎక్కడికీ వెళ్లకుండా!!

సరిగమల సంగీతం  రావాలంటే..

ఉమాదేవి ఎర్రం

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *