సరిహద్దు నీడల్లో సేవ

సరిహద్దు నీడల్లో సేవ

సరిహద్దు నీడల్లో సేవ

                                        ఉదయం పొద్దుపొడవక ముందే అడవి అంచుల్లో నిశ్శబ్దం పరుచుకుంది. గాలిలో ఆకుల చప్పుడు తప్ప మరేమీ వినిపించలేదు?

ఆ నిశ్శబ్దాన్ని చెదరగొడుతూ కొందరు భద్రతా సిబ్బంది తమ విధుల్లో భాగంగా ముందుకు సాగుతున్నారు. వారి కళ్లలో అప్రమత్తత, మనసులో దేశం పట్ల బాధ్యత కనిపిస్తోంది.
ఆ బృందానికి నాయకుడు అర్జున్. అతను తన సహచరులతో కలిసి ఎన్నో రోజులుగా ఆ ప్రాంతంలో పర్యవేక్షణ చేస్తున్నాడు.
“మన పని కాపలా కాదు! ప్రజల ప్రశాంత నిద్రకు భరోసా ఇవ్వడం” అని అతను తరచూ చెప్పేవాడు.
ఆ రోజు అడవి దారిలో వెళ్తుండగా… దూరంగా ఒక చిన్న బాలుడు చెట్టు కింద కూర్చుని కనిపించాడు. అతని ముఖంలో భయం స్పష్టంగా కనిపించింది. అర్జున్ అతని దగ్గరకు వెళ్లి ,
“ఏమైంది బాబు? ఎందుకు ఒంటరిగా ఉన్నావు?” అని మృదువుగా అడిగాడు.
బాలుడు కన్నీళ్లు తుడుచుకుంటూ,
“నేను మా ఊరినుంచి దారి తప్పిపోయాను అన్నయ్య..!” అన్నాడు.
వెంటనే సిబ్బంది బాలుడికి నీళ్లు ఇచ్చి ధైర్యం చెప్పారు. ఆ తర్వాత చుట్టుపక్కల గ్రామాల వివరాలు తెలుసుకుని అతని ఇంటి కోసం వెతకడం ప్రారంభించారు.
కొంతసేపటి తర్వాత ఓ చిన్న గ్రామానికి చేరుకున్నారు. అక్కడ బాలుడి తల్లిదండ్రులు అతన్ని చూసి ఆనందంతో… కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తల్లి చేతులు జోడించి,
“మీరు మా బిడ్డను మాత్రమే కాదు! మా ప్రాణాన్ని తిరిగి ఇచ్చారు” అని చెప్పింది.
అర్జున్ చిరునవ్వు నవ్వి,
“మేము చేసే పని ఇదే అమ్మా! దేశాన్ని కాపాడటం మాత్రమే కాదు, మనుషుల్ని కూడా కాపాడటం” అన్నాడు.
ఆ రోజు అడవి నిశ్శబ్దం ఒక గొప్ప సత్యాన్ని చెప్పింది , నిజమైన వీరత్వం ఆయుధాల్లో కాదు, మానవత్వంలో కూడా ఉంటుంది.

మాధవి కాళ్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *