సవతి తల్లి ప్రేమ

ఏంటి పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావు ఇంట్లో పని అంతా వదిలేసి అంది విమల బయటనుండి వస్తున్న రాధతో అది పిన్ని గుడికి వెళ్ళి వస్తున్నా అంది రాధా ఓయబ్బో భక్తి పొంగి పొర్లుతుంది అమ్మాయి గారికి చాలు చాల్లే వెళ్ళి ఇంట్లో పని చూడు నీ మొఖానికి ఇంకా భక్తి కూడా అంటూ నోట్లో నీళ్ళ ని తుపుక్కున ఉమ్మేసి పుడుతూనే తల్లిని మింగి ఇప్పుడు నా మీద నా మొగుడు మిద ఆధారపడ్డారు .

అబ్బా కూతుర్లు ఇద్దరు అయినా పొద్దునే తిరుగులేమిటి ఇంట్లో పనంతా ఎవడు చేస్తాడే అని ఆపకుండా తిడుతూనే ఉంది విమల తనకు అవన్నీ మాములే అన్నట్లు గా అన్ని వింటూ  లోపలికి  వెళ్ళి తన పని తాను చేసుకోసాగింది రాధ .

రమేషు పరమేశు ఇద్దరూ అన్నదమ్ములు కలిసిమెలిసి ఉండేవారు రమేష్ పెద్దవాడు అతని భార్య రాధని కని చనిపోయింది బాధలో రమేష్ కు పక్షవాతం వచ్చి కాలు చెయ్యి పడిపోయి తమ్ముడు పంచన చేరడంతో విమలకు వారిని అనడానికి కారణం దొరికింది .

పాపం విమలకు లోపల చాలా ప్రేమ కానీ అలా బయటకు ప్రేమని చూపిస్తే వాళ్ళెక్కడ నెత్తిన ఎక్కుతారో అనే భయం దానికి తోడు ఆమెకు పిల్లలు లేకపోవడంతో ఆమెలో ఒక రకమైన మొండి తనం  ప్రవేశించి అలా అందర్నీ తిడుతూ ఉంటుంది.

చిన్నప్పటి నుండి పిన్ని దగ్గరే పెరగడం వల్ల ఆమె గురించి అన్ని తెలిసిన రాధ అన్ని పనులు తానే అయి చేస్తూ పిన్నికి చేదోడువాదోడుగా ఉండి ఇంట్లో ఉర్లోనూ చుట్టాల దగ్గర మంచి అమ్మాయి ఓపిక కలది అనే పేరు తెచ్చుకుంది  రాధ పాపం పిన్ని ఆమెని రాచి రంపాన పెడుతుంది .

అని అందరు విమలని తిట్టుకుంటూ ఉంటె రాధ మాత్రం తన పిన్ని చాలా మంచిది అని ఆమెని అలా తిట్టకండి అని వారితో అంటున్న అది రాధ గొప్పతనం అని అనుకుంటూ ఉంటారు వాళ్ళు నిజానికి ఒక్కోసారి విమల చాల కటినంగా మాట్లాడుతుంది ఆమె మాటలకూ రాధ ఒక్కోసారి బాధ పడుతుంది తండ్రి కూడా ఆమె పరిస్థితికి బాధ పడుతూ తను తన బిడ్డకు ఏమి చేయలేక పోయాను అని అనుకుంటూ ఉంటాడు

రాధ రోజు గుడికి వెళ్ళి తన తండ్రి తొందరగా కోలుకోవాలని దేవుణ్ణి కోరుతుంది అలా ఒకరోజు గుడికి వెళ్ళిన రాధకు పూజారి గారు అమ్మా రాధ మన ఊర్లోకి ఒక ఆయుర్వేద వైద్యుడు వచ్చారు చాలా చిన్నవాడు అతని దగ్గరికి వెళ్ళి మీ నాన్నగారి పరిస్థితి వివరించి వైద్యం గురించి అడుగు అని సలహా ఇచ్చారు పూజారి శర్మ గారు .

అలాగే బాబాయి కానీ డబ్బు కావాలి కదా అంది రాధ నీ కష్టాలు తిర్చడానికె అతను వచ్చినట్లు ఉన్నాడు అతను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వైద్యం చేస్తాడు అని అంతా అనుకుంటున్నారు నువ్వు వెళ్ళి నీ ప్రయత్నాలు చెయ్యి తర్వాత అంతా భగవంతుని దయ అని రాధని ఆశిర్వదించారు శర్మ గారు అలాగే బాబాయి గారు అని దేవునికి మరొక్కసారి దణ్ణం పెట్టుకుని వెళ్ళింది రాధ.

ఇంటికి వెళ్ళి బాబాయికి విషయం చెప్పి అతని సహాయంతో తండ్రిని వైద్యుడి దగ్గరికి తీసుకుని వెళ్ళింది రాధ అతను యువకుడు పేరు వాసు అతని వంశ పారంపర్యంగా వస్తున్న ఆయుర్వేద వైద్యం పై ఉన్న ఇష్టంతో తన తండ్రి నుండి వైద్యాన్ని నేర్చుకుని పేద మధ్యతరగతి వారికి ఉచిత వైద్యాన్ని ఉరూరా తిరుగుతూ అందించడం అతని లక్ష్యంగా పెట్టుకున్న ఆధునిక భావాలు కలిగిన యువకుడు ధనవంతుల దగ్గర మాత్రం తోచిన డబ్బును తీసుకునేవాడు పేదలకు మూలికలు ఇవ్వడం కోసం అంతే తప్ప ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకునే వాడు కాదు

వాసు రాధ ని చూడగానే ప్రేమలో పడ్డాడుఆమె తండ్రిని పరిశీలించిఅతని వైద్యానికి మూలికలు సరిపోవని తైలoతో మర్దన చేయాలనీ భావించి అతన్ని అక్కడే ఉంచి మీరు వెళ్ళండి నేను తనకి వైద్యం చేస్తాను అని పరమేష్ గారితో చెప్పాడు .

వాసు కానీ రాధకు పరమేషం గారికి ఆన్నయ్యను అలా వదిలేసి వెళ్ళడం ఇష్టం లేకపోవడంతో అతని వెంట రాధని ఉండమని చెప్పి మీకేమి ఇబ్బంది లేదు కదా అన్నాడు .

పరమేశం నాకేమి ఇబ్బంది లేదండి నేను ఆయన్ని జాగ్రత్తగా చూసుకుంటాను మీరు ప్రొద్దున సాయంత్రం వచ్చి చూసి వెళ్ళండి అని అభయం ఇచ్చాడు వాసు దాంతో తండ్రికి విషయం అంతా చెప్పి తాము మళ్ళి వస్తామని చెప్పి వెళ్ళిపోయారు ఇద్దరు….

వాసు రమేశం గారికి వైద్యాన్ని మొదలు పెట్టాడు రాధ అటూ ఇంట్లో పని చేస్తూ ఇటూ తండ్రిని చూసుకుంటూ ప్రొద్దున సాయంత్రం అతని దగ్గరికి వెళ్తూ వస్తు ఉండేది అలా వారం రోజుల్లో తండ్రిలో వస్తున్న మార్పుని చూసి చాలా ఆనందించింది రాధ రాధ గురించి ఆమె పిన్ని పెట్టె భాదల గురించి తెలుసుకున్న వాసు హృదయం రాధ మీద ఇంకా ప్రేమతో నిండిపోయింది.

విమలకు రామేశం గారికి వైద్యం చేయించడం మాత్రం ఇష్టం లేదు ఎందుకంటే వైద్యం జరిగి అతను మాములు మనిషి అయితే రాధని తీసుకుని ఎక్కడ బయటకు వెళ్ళి పోతారో అనే భయం వల్ల దాంతో ఇంకా రాధని బాధ పెట్టడం మొదలు పెట్టింది విమల పని మిద పని చెప్తూ చేసిన పనినే మళ్ళి మళ్ళి చేయిస్తూ ఉండేది.

అయినా విసుక్కోకుండా చిరునవ్వుతో అన్ని పనులను తలదిoచుకుని చెస్తూ ఉండేది రాధ నెల రోజుల్లో వాసు వైద్యం వల్ల తండ్రి లేచి తిరగడం మొదలు పెట్టడంతో రాధ వాసుని అభిమానించడం మొదలు పెట్టింది అది తెల్సిన వాసు కూడా ఆమె మనోగతం అర్ధం అయ్యి అక్కడే నివాసం ఏర్పరచుకోవాలని భావించి తల్లిదండ్రులని రమ్మని జాబు రాసాడు.

వాళ్ళు వచ్చిన తర్వాత వారికీ రాధని చూపించి ఆమె పరిస్థితిని అంతా వివరించి తానామేని వివాహం చేసుకోవాలని అనుకుంటునట్టు మీకు సమ్మతం అయితే వెళ్ళి మాట్లాడమని అన్నాడు వారికి కూడా రాధ బాగా నచ్చడంతో వాళ్ళు వెళ్ళి రామేశం పరమేశం తో మాట్లాడారు

వారి వివాహానికి ఒప్పుకోకపోవడానికి తప్పు కనిపించకపోవడంతో వాళ్ళు ఆనందంగా ఒప్పుకుని రాధని అడిగారు రాధ సిగ్గుతో అక్కడి నుండి వెళ్లిపోయింది తమకు ఇష్టమే అని చెప్పడం వల్ల నెల రోజుల్లోనె ముహూర్తం పెట్టారు వాళ్ళు విమల ముందు అభ్యంతర పెట్టాలని చూసినా రాధ అక్కడే ఉంటుంది అని చెప్పగానే ఇక ఏమి అనలేకపోయింది .

నెల రోజుల తర్వాత గుడిలో సన్నిహితుల సమక్షంలో వారి వివాహం నిరాడంబరంగా జరిగిపోయింది ఏడుస్తున్న విమలని హత్తుకుంటూ పిన్నిని మాట కఠినం కానీ నా మిద ఉన్న ప్రేమ తల్లి ప్రేమ దాన్ని నాకు ఎప్పటికి పంచు అంటున్న రాధ నుదుటి మిద ముద్దు పెట్టుకుంది విమల వారి ప్రేమని చూసిన అక్కడి వారి కళ్ళు చెమర్చాయి ఆనందంతో….  

Related Posts